Thadipathri
-
పరారీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి..
-
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
-
Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ
-
తాడిపత్రిలో ఎగిరేది మన జెండానే
-
అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం
-
జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారుల అంతు చూస్తానంటూ జేసీ దివాకర్ రెడ్డి నిన్న బెదిరింపులకు పాల్పడ్డారు. తాడిపత్రి సీఐ తేజోమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. (దివాకర్ రెడ్డి మైనింగ్ సంస్థలకు నోటీసులు) కాగా ‘మా అనుచరులు రాక్షసులు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ అని దివాకర్‌రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వచ్చిన ఆయన వ్యంగ్యంగా హెచ్చరించారు. -
విషమంగా వైఎస్సార్సీపీ కార్యకర్త పరిస్థితి
సాక్షి, అనంతపురం: పోలింగ్ సందర్భంగా అధికార టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త తీవ్ర గాయపడ్డారు. నియోజకవర్గంలోని వీరాపురం పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు ప్రయత్నించిన జేసీ అనుచరులను అడుకున్న పుల్లారెడ్డిపై వేటకొడవళ్లతో దాడికి దిగారు. అక్కడున్న మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆయనతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఎన్నికల అధికారులు ఉండగానే జేసీ వర్గీయులు పోలింగ్ బూత్‌తోకి వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడుతుడడం సంచలనం రేపుతోంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ.. జేసీ వర్గీయులు హల్చల్ చేస్తున్నారు. అడ్డుకున్న వారిపై దాడికి పాల్పడుతు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. -
సీఐ నారాయణరెడ్డిపై ఈసీ కొరడా
సాక్షి, తాడిపత్రి అర్బన్ : తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిపై బదిలీ వేటు పడింది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నందున ఆయనపై ఈసీ చర్యలు తీసుకుంది. రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నారాయణరెడ్డి పనితీరు వివాదాస్పదంగానే ఉంది. ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరునే పరిశీలించారు. ఎస్ఐల నుంచి సిఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్లైన్లో ఉంచాల్సి ఉంది. ఈ నిబంధనలను పక్కనపెట్టి నారాయణరెడ్డి ఏ స్టేషన్లో పనిచేశారో అక్కడే సీఐగా పోస్టింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు కూడాపెద్ద ఎత్తున వినిపించాయి. ఇందుకు ఎమ్మెల్యేకు భారీ స్థాయిలో లాబీయింగ్ చేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ఇందుకు కృతజ్ఞతగా సీఐ నారాయణరెడ్డి తన సొంత గ్రామమైన వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం లావనూరులో అప్పట్లో భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే తన అనుచరగణంతో లావనూరుకు వెళ్లడం.. సీఐ ఘన స్వాగతం పలకడం జరిగింది. ఊరేగింపుగా తీసుకెళ్లిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఏది చెబితే దానికి తలూపడం, పాటించడం తప్ప లా అండ్ ఆర్డర్‌తో, న్యాయ, అన్యాయాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం వివాదాస్పదమైంది. సీఐ ఏకపక్ష తీరుతోనే సమస్యలు ముందే తాడిపత్రి సమస్యాత్మక అతి సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ అధికార, విపక్ష పార్టీల మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ప్రబోధాశ్రమం ఘటన ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో సీఐ అనే అధికారి చాలా పారదర్శకంగా పనిచేసి నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఇక్కడ సీఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఆదేశాలు పాటించడం తప్ప మరో విషయం తెలియదని, పూర్తిగా జేసీ సోదరులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వైఎస్సార్సీపి నేతలు బాహాటంగా ఆరోపించారు. గతంలో ఇదే స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినపుడు కూడా నారాయణరెడ్డి వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరిగి సీఐగా ఇదే స్టేషన్‌కు పోస్టింగ్ ఇవ్వడంపై విపక్ష నేతలు అదే రీతిలో ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు మాత్రం జేసీ సోదరుల సిఫారస్సు లేనిదే ఇక్కడి నుంచి బదిలీ చేయలేరు, పోస్టింగ్ ఇవ్వలేరు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో సీఐ నారాయణరెడ్డిని బదిలీ చేయడంతో ఎన్నికల కమిషన్(ఈసీ)పై మరింత నమ్మకం కలిగినట్లైంది. ప్రతిపక్షపార్టీ నేతలే ఆయన టార్గెట్ ప్రజాసంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న సందర్భంగా వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి 2018 అక్టోబర్ ఆరో తేదీన పెద్దపప్పూరు మండలంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివర్లో నిరాకరించారు. సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే తన అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పాడు. ఇందులో భాగంగానే రూరల్ పోలీసులు అప్పట్లో పెద్దారెడ్డి పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. ఎలాగైనా పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో పెద్దారెడ్డి ముచ్చుకోటకు రావడంతో వెంటనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో 2018 ఆగస్టు 29న జరిగిన చిన్నపాటి ఘర్షణకు వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని బాధ్యుడిని చేస్తూ హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఏకపక్షంగా వ్యవహరించారు. 2018 సెప్టెంబర్‌లో జేసీ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారన్న నెపంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. తాడిపత్రి మండలం ఆలూరులో వైఎస్సార్సీపీ నేత గోసు రాజగోపాల్‌రెడ్డి అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసును బనాయించారు. నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లి సీఐ, నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐపై ఈసీ కొరడా ఝుళిపించింది. అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తోంది. ఈసీ చర్యలతో సదరు పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు స్పందించిన ఈసీ తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి ఏకపక్ష వ్యవహారంపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పలుమార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఈసీ స్పందిస్తూ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. ఈయన స్థానం లో తిరుపతి క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న శరత్‌చంద్రను నియమిస్తూ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. -
తాడిపత్రికి విముక్తి కలిగిస్తాం : కేతిరెడ్డి
సాక్షి, తాడిపత్రి అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో వైఎస్సార్సీపీ జెండా ఎగిరేసి జేసీ సోదరుల కబంధహస్తాల్లో చిక్కుకున్న తాడిపత్రికి విముక్తి కల్గిస్తామని తాడిపత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆద్యంతం జేసీ బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు. తాడిపత్రి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది. జగనన్న రాజ్యం రావాలంటే మనమందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. జేసీ సోదరుల రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే ఓటు అనే ఆయుధంతో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలోనే బీసీలకు పెద్దపీట బడుగు,బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించడంలో వైఎస్.జగనన్న ఎప్పుడూ ముందుంటారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు బీసీ అభ్యర్థులనే ప్రకటించిన వైఎస్.జగన్ తన విశ్వసనీయతను చాటుకున్నాడు. పార్లమెంటు ఇద్దరికీ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేనప్పటికీ ముందుగా మాట ఇచ్చిన విధంగానే రెండు పార్లమెంటు స్థానాలను బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ది నిరూపించుకున్నాడు రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయతకు, విలువలకు పట్టం కట్టండి. ఫ్యానుగుర్తుకు ఓటువేసి జేసీ సోదరుల అరాచకపాలనకు చరమగీతం పాడదాం. – తలారి రంగయ్య, అనంతపురం వైఎస్సార్సీపీ పార్లమెంటు అభ్యర్థి. భయపడాల్సిన అవసరం లేదు తాడిపత్రి ప్రజలు మనసాక్షిగా ఓటేయండి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. టీడీపీ వారు డబ్బు ఇస్తే అది ఒక్కసారి మాత్రమే ఇస్తారు. కాని జగనన్న సీఎం అయితే ప్రతి ఏడాది రూ.20వేలు ఇస్తాడు. మహిళలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. తాడిపత్రిలో మార్పు అవసరం.వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యం. –ఆలూరి సాంబశివారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు. జేసీ గుండెల్లో రైళ్లు వైఎస్.జగన్ సభతో జేసీ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. జేసీ సోదరుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వైఎస్.జగన్ సీఎం అయితే తనను జైలులో పెడతారని ఎంపీ జేసీ చేస్తున్న వ్యాఖ్యలు త్వరలోనే నిజమవుతాయి. ఎంపీ దివాకర్‌రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్ళడం తథ్యం. –పైలా నరసింహయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి జగనన్నను సీఎం చేసుకుందాం వైఎస్.జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లిం సోదరులు ఒక సారి ఆలోచించాలి. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే ఈరోజు పేద ముస్లింల పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేదని ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంతో మంది పేద ముస్లిం మైనార్టీల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. నవరత్నాల పథకాలతో మన భవిష్యత్తు మారబోతోంది. వైఎస్.జగన్ సీఎం కావడం తథ్యం. –గయాజ్‌బాషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మంచి పాలన వైఎస్. జగన్‌తోనే సాధ్యం ప్రజలకు మంచి పాలన అందించాలంటే అది ఒక్క వైఎస్.జగన్‌తోనే సాధ్యం. రైతుల కష్టసుఖాలను తెలుసుకుని రైతాంగానికి పెద్దపీట వేసిన మహానేత వైఎస్సార్‌ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని, విలువలను,విశ్వసనీయను పుణికిపుచ్చుకున్న యువనేత వైఎస్.జగనన్న నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం.మంచి నాయకుడు ఉండే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలి. - పేరం స్వర్ణలత, వైఎస్సార్సీపీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి తాడిపత్రిని చెడగొట్టకండి తాడిపత్రిలో గ్రానైట్రంగం జేసీసోదరుల నిర్వాకం వల్ల మూతపడిపోతోంది. 2014 ఎన్నికల్లో గ్రానైట్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జేసీ పీఆర్ గ్రానైట్ పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విజిలెన్స్ దాడులు ఏవీ ఉండవని హామీ ఇచ్చి, వారి ఓట్లతో లబ్దిపొంది నేడు వారిపై కక్షసాధింపుచర్యలకు పూనుకున్నాడు. జేసీ సోదరులారా ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.- జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు -
బెదిరించే కళ్లు.. ఒళ్లంతా కుళ్లు!
సాక్షి, తాడిపత్రి అర్బన్: రెండునర్న దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జేసీ సోదరులు రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీలో చేరారు. ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్‌రెడ్డి గెలవడం.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వారి అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. తమ స్వార్థం కోసం నదులను చెరబట్టారు. ఇసుకను తోడేసి రూ.కోట్లు పిండేశారు. ప్రజాప్రతినిధులైన వారే దగ్గరుండి మరీ మట్కాతో పాటు పేకాట కేంద్రాలను నడిపించారు. ఇక జేసీ ట్రావెల్స్ బాగోతం ఎంత చెప్పినా తక్కువే. ఇలా చెప్పుకుంటూపోతే జేసీ బ్రదర్స్ అరాచకాలు కోకొల్లలు. సొంతూర్లోనూ అరాచకమే.. జేసీ బ్రదర్స్ అరాచకాలకు వారి సొంత గ్రామమైన జూటూరు రైతులు కూడా బలయ్యారు. గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల క్షేత్రానికి అవసరమైన భూములను రైతులను భయపెట్టి, వేధించి అతితక్కువ ధరకే స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాట వినకపోతే ఎక్కడ చంపేస్తారోననే భయంతో రైతులంతా వారు ఇచ్చింది తీసుకుని భూములు అప్పగించారు. అంతేకాకుండా బ్రోకర్లను నియమించుకుని అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నిస్తే కేసులే.. తమ అరాచకాలను ఎవరు ప్రశ్నించినా జేసీ బ్రదర్స్ తట్టుకోలేరు. అది సొంత పార్టీ నేతలైనా సహించలేరు. ఈ క్రమంలోనే చాలా మంది టీడీపీ నేతలను కూడా అక్రమ కేసుల్లో ఇరికించారు. తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరుతో డబ్బులు డిమాండ్ చేశారని, తాము ఇవ్వకపోవడంతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మరీ ఇబ్బందులకు పెడుతున్నారని గ్రానైట్ పరిశ్రమల యాజమానులు వాపోతున్నారు. పట్టణంలో ఎక్కువగా మట్కా కంపెనీలు జేసీ సోదరుల అండతోనే నడుస్తుండటం గమనార్హం. 2016లో నవంబర్‌లో టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సుమారు రూ.200 కోట్లపైగా అవినీతికి పాల్పడ్డారని కౌన్సిల్ సమావేశంలోనే ఎత్తిచూపారు. దీంతో జేసీ పీఆర్ సొంత పార్టీ కౌన్సిలర్ అని కూడా చూడకుండా అతన్ని కౌన్సిల్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయించారు. జేసీ సోదరుల అవినీతిపై గళం వినిపించిన జగ్గీ బ్రదర్స్‌పై కూడా జేసీ సోదరులు పగబట్టారు. రెండు దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకున్న జగ్గీ బ్రదర్స్‌ను పార్టీని నుండి సస్పెండ్ చేయించారు. ప్రధాన అనుచరుడైన కాకర్ల రంగనాథ్ జేసీ సోదరులను వ్యతిరేకించారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ సోదరులు 2018లో జనవరిలో అతని సమీప బంధువు, శేఖర్‌కు చెందిన ‘అన్నా ట్రాన్స్‌పోర్టు’ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. జేసీ సోదరుల అరాచకాలతో విసిగిపోయిన టీడీపీ సీనియర్ నాయకుడు హీరాపురం ఫయాజ్‌బాషా 2018 నుంచి స్తబ్దుగా ఉండిపోయారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫయాజ్‌బాషాకు చెందిన స్థలం మున్సిపాలిటీదని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అయితే ఫయాజ్‌బాషా కోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. నడిబొడ్డున బార్.. ధర్నా చేసిన వారిపై దాడులు పట్టణ నడిబొడ్డున జేసీ బ్రదర్స్ ఆధ్వర్యంలోనే హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు.. ప్రజల నివాసాలకు 500 మీటర్ల సమీపంలో మద్యం షాపులు ఉండకూడదు. కానీ జేసీ బ్రదర్స్ పట్టణ నడిబొడ్డున మద్యం వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఆ మద్యం షాపును తొలగించాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు ధర్నా చేయగా.. జేసీ సోదరులు తమ అనుచరులతో దాడులు చేయించారు. జేసీ అరాచకాలు లెక్కకు మించి.. పెద్దవడుగూరు మండలం అప్పెచెర్లకు చెందిన సింగ్‌ల్‌విండో అధ్యక్షుడు చిట్టెం విజయభాస్కర్‌రెడ్డిని 2015 మార్చి 31న క్రిష్టిపాడులోని సింగిల్‌విండో కార్యాలయంలోనే జేసీ అనుచురులు అంతమొందించారు. ఈ కేసులో రాజీకి రావాలని జేసీ సోదరులు విజయభాస్కర్‌రెడ్డి బంధువులను, కుటుంబీలను కోరారు. అయినా వారు నిరాకరించడంతో 2018లో ఏప్రిల్‌లో వారి ఆస్తులను, వ్యవసాయ బోర్లను ధ్వంసం చేశారు. తమ ఎదుగుదలకు అడ్డొస్తున్నాడనీ, తాము డిమాండ్ చేసినా డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో చిన్నపొలమడలోని ప్రభోదాశ్రమంపై కక్ష పెంచుకున్న జేసీ సోదరులు.. వినాయక నిమజ్జనం ముసుగులో 2018 సెప్టెంబర్ 15న చిన్నపొలమడలోని ఆశ్రమంపై దాడి చేయించారు. ఆ మరుసటి రోజు ఎంపీ జేసీ స్వయంగా వందలాది మంది అనుచరులతో ఆశ్రమం వద్దకు వెళ్లి దాడికి తెగబడ్డారు. ఈ ఘటన కేవలం అప్పటి సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఐ రామక్రిష్ణారెడ్డిల పర్యవేక్షణ లోపంతోనే జరిగిందని నిర్ధారించిన పోలీసు ఉన్నతాధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు. 2018 సెప్టెంబర్ 16 ఎంపీ జేసీ తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్స్టేష్ను ముట్టడించారు. ప్రభోదానందస్వామిని అరెస్టు చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ‘‘చేతకాని పోలీసులు’’ అని విమర్శించారు. అంతటితో ఆగకుండా పోలీసులను కొజ్జాలుగా అభివర్ణిస్తూ పోలీస్‌స్టేషన్ గేటుకు తాళాలు వేసి సుమారు 48 గంటలపాటు స్టేషన్లోనే బైఠాయించారు. 2018 ఫిబ్రవరి 27న వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషాపై ఎమ్మెల్యే జేసీ అనుచరులు దాడికి యత్నించగా... దాడి నుంచి గయాజ్‌బాషా చాకచక్యంగా తప్పించుకున్నారు. దీంతో జేసీ అనుచరులు ఆయన బీడీ ఫ్యాక్టరీపై దాడి చేసి సామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు. 2015లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీగా పనిచేసిన ప్రతాప్‌రెడ్డి గ్రానైట్ అక్రమ రవాణా, జీరో వ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. ఏడాదికి రూ.1.5 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రూ.7 కోట్ల వరకూ తీసుకెళ్లారు. దీంతో ప్రతాప్‌రెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేందుకు జేసీ సోదరులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. చివరకు చంపేస్తామని బెదరించారు. ఈ క్రమంలోనే ఏడీ ప్రతాప్‌రెడ్డి.. తనకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డితో ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జేసీ సోదరులు తమ అధికారం ఉపయోగించి ఆయన్ను తాడిపత్రి నుంచి బదిలీ చేయించారు. 2014 సెప్టెంబర్ 12న మహిళా బ్యాంకు మేనేజర్ ఎల్.మంజుల పట్ల ఎమ్మెల్యే జేసీ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏటీఎం కేంద్రాని తాళం వేశాడు. దీంతో ఆమె ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తప్పుడు కేసుగా కొట్టిపారేశారు. దీంతో ఆమె ప్రైవేటు కేసు వేయగా.. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2018 డిసెంబర్ 30న ఎమ్మెల్యే జేసీ ప్రధాన అనుచరుడు మట్కాడాన్ రషీద్.. సోదాల కోసం వచ్చిన కడప సీఐ హమీద్ ఖాన్‌పై దాడి చేశాడు. పోలీసు వాహనాన్ని తగులబెట్టాడు. ఈ ఘటనలో పోలీసులు కొందరిని అదుపులోనికి తీసుకోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే జేసీ... స్థానిక పోలీసు స్టేషన్ సర్కిల్లో తన అనుచురులతో కలసి బైఠాయించారు. మట్కా నిర్వాహకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోనూ దందా అనంతపురం న్యూ సిటీ : నగరంలోని నందినీ హోటల్ ఎదురుగా జేసీ ట్రావెల్స్ నిర్వహిస్తున్న స్థలం మల్లికార్జనాచారిది. 2000లో అతను ఆ స్థలాన్ని బాబాయ్య అనే వ్యక్తికి ఇచ్చాడు. అయితే బాబయ్య స్థల యజమానికే తెలియకుండా జేసీ బ్రదర్స్‌కు అద్దెకు ఇచ్చాడు. దీంతో జేసీ బ్రదర్స్ నెలకు రూ.2 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ 19 ఏళ్లుగా జేసీ ట్రావెన్స్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఏ ఆధారం లేని తన ఇద్దరు కుమారులకు బిజినెస్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేందుకు షాపు ఖాళీ చేయమని మల్లికార్జునాచారి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కోరగా.. ఆయన ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. దీంతో బాధితుడు 2018 నవంబర్ 8న అప్పటి డీఎస్పీ వెంకట్రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది జనవరి 18న జేసీ ట్రావెల్స్ ఎదుట కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులతో కలసి ధర్నా చేశారు. బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు మల్లికార్జునాచారి కుటుంబీకులు వారికి మద్దతు తెలిపిన సీపీఐ నాయకులనే అదుపులోకి తీసుకున్నారు. కానీ జేసీ బ్రదర్స్‌లో ఎటువంటి మార్పు రాలేదు. తాడిపత్రి తరహాలో నగరంలోనూ దౌర్జన్యానికి తెగబడుతున్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ భారీ విందు
అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రి పోలీసుల తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఇటీవల ఉన్నతాధికారులు వేటు వేసిన విషయం విదితమే. తాజాగా తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు వరకు చేపట్టిన పాదయాత్రకు మొదట పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి నిరాకరించడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పారు. పాదయాత్రకు సిద్ధమైన పెద్దారెడ్డిని అరెస్ట్ చేయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విపక్ష నాయకులు బహిరంగంగా విమర్శలు చేశారు. శాంతిభద్రతల సమస్యలకు కారణం పోలీసులే తాడిపత్రి ప్రాంతంలో శాంతిభద్రతలు తలెత్తడానికి కారణం పోలీసులే అన్న ఆరోపణలు విపక్ష పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. తాడిపత్రిలో పోస్టింగ్‌లకు జేసీ సోదరుల సిఫార్సుల కోసం పాకులాడి పోస్టింగ్‌లు తెచ్చుకున్నపోలీసులు స్వామి భక్తి చాటుకునేందుకు వారు చెప్పిందే తడవుడా ‘జీ హుజూర్’ అంటూ తలూపి న్యాయాన్యాయాలతో పని లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో చట్టం అనేది అధికారపార్టీ నేతలకు చుట్టంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తన నివాసంలో ఎమ్మెల్యే జేసీకి విందు ఇస్తున్న సీఐ నారాయణరెడ్డి వివాదాస్పదమైనసీఐ నారాయణరెడ్డి పనితీరు తాడిపత్రిలో రూరల్ సీఐ నారాయణరెడ్డి పనితీరు తరచూ వివాదాస్పదమవుతోంది. ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరే పరిశీలించారు. వాస్తవానికి ఎస్ఐగా పనిచేసిన చోటే సీఐగా తొలిపోస్టింగ్ ఇవ్వరు. అలాగే సీఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్లైన్లో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు కొన్ని రోజులు నారాయణరెడ్డిని పీటీసీకి పంపిన ఉన్నతాధికారులు..ఆ వెంటనే ఆయన ఎస్ఐగా ఎక్కడ పనిచేశారో అదే స్టేషన్‌కు సీఐగా పోస్టింగ్ ఇవ్వడం చాలా విమర్శలకు తావిస్తోంది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కృతజ్ఞతగా నారాయణరెడ్డి తన సొంత గ్రామం వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం లావనూరులో సీఐ నారాయణరెడ్డి భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. అనుచరగణంతో లావనూరుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ నారాయణరెడ్డి అనూహ్యరీతిలో స్వాగతం పలికారు. తన గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే జేసీపీఆర్ ఏది చెబితే దానికి తలూపి పాటించడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నది సుస్పష్టం. మరి స్వామి భక్తి చాటుకుంటున్న సీఐ నారాయణరెడ్డి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
డ్రైవర్‌ను కులంపేరుతో దూషించిన ఎమ్మెల్యే జేసీ!
అనంతపురం, తాడిపత్రి: ఒక ఆధ్యాత్మిక కేంద్రం....చిన్న పాకలో ప్రారంభమై...భక్తుల విరాళాలతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కానీ ఆశ్రమ నిర్వాహకులు స్థానిక అధికార పార్టీ నేతలకు సలాం చేయడం లేదు. దీంతో అధికారపార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు. అనుచరులతో కలిసి దాడులకు ప్రణాళిక రచించారు. అంతిమంగా తాడిపత్రిలో మంటలు రగిలించారు. సామాన్యులు బలవుతుంటే చోద్యం చూస్తున్నారు. కేసుపెట్టినా...అరెస్టు చేయని పోలీసులు తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడలో‘శ్రీకృష్ణాశ్రమం’ పేరుతో ప్రభోదానంద ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అదనపు భవనాలు నిర్మించాలని భావించారు. నిర్మాణానికి కావాల్సిన ఇసుక కోసం అధికారులను నుంచి అనుమతులు తీసుకున్నారు. అనంతరం 2017 జూన్‌లో పెద్దపప్పూరు మండలం నుంచి ఆశ్రమ నిర్వాహకులు ఇసుకను తరలిస్తుండగా అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డగించి దళితుడైన డ్రైవర్ వెంకటేశును కులం పేరుతో దూషించారు. అంతేకాకుండా అతనిపై దాడి చేసి ఇసుకను తరలిస్తున్న లారీలను స్వాధీనం చేసుకుని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. దీంతో లారీ డ్రైవర్ వెంకటేశు పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను కులంపేరుతో దూషించి దాడి చేశాడని ఆశ్రమ నిర్వాహకులతో కలిసి పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు చేసేందుకు వెనుకంజ వేశారు. దీంతో బాధితుడు ఆశ్రమ నిర్వాహకులతో కలిసి మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మానవహక్కుల కమిషన్ ఆదేశాల మేరకు పెద్దపప్పూరు పోలీసులు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయినా ఎమ్మెల్యేను మాత్రం అదుపులోనికి తీసుకోలేదు. అక్రమ కట్టడాలపేరుతోఆశ్రమాన్ని కూల్చే యత్నం తనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అప్పటి నుంచి ఆశ్రమంపై, నిర్వాహకులపై కక్ష గట్టారు. తన అధికార బలాన్ని ఉపయోగించి ఆక్రమ కట్టడాల పేరుతో ఆశ్రమంలో నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులను ఆశ్రమంపై ఉసిగొల్పినట్లు ఆశ్రమ నిర్వాహకులే చెబుతున్నారు. అంతేకాకుండా 2017 సెప్టెంబర్‌లో ఆశ్రమంలోని వ్యర్థాలను (సెప్టిక్ ట్యాంక్‌ను) బయటికి తరలిస్తుండగా పెద్దపొలమడ గ్రామస్తులు ట్యాంకర్‌ను అడ్డగించి నిప్పంటించారు. ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ఆశ్రమ నిర్వాహకులు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడంతో ఆశ్రమ నిర్వాహకులు అధికారపార్టీ ఎమ్మెల్యే జేసీ ఆగడాలపై అప్పట్లో హోంమంత్రికి, డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు చేశారు. ఓటమి భయంతో ఆగడాలు రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా తమకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న భయంతో జేసీ సోదరులు దాడులకు బరితెగిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించన తర్వాత నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మరింతగా పుంజుకుంది. గ్రామస్థాయిలో ఓటు బ్యాంకును సంపాదించడంలో పెద్దారెడ్డి సఫలీకృతులయ్యారు. దీనికి తోడు జేసీ సోదరుల ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి వారి దౌర్జన్యాలను అడ్డుకోవడంతో జేసీ సోదరులు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ క్రమంలో ప్రబోధాశ్రమం భక్తులు పరోక్షంగా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతుండాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రబోధాశ్రమానికి చెందిన సుమారు 6వేల మంది భక్తుల పేర్లను ఓటరు జాబితాలోకి నమోదు కాకుండా తెరవెనక ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. మరోవైపు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్న అక్కసుతో ఎలాగైనా ఆశ్రమ నిర్వాహకులను లొంగదీసుకుని తన గుప్పిట్లో ఉంచుకోవాలని పలుమార్లు వారితో రాజీ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రబోధానంద స్వామివర్సెస్ ఎమ్మెల్యే జేసీ స్వామి ప్రబోధానందస్వామి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇటీవల కమ్మసేవా సంఘం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలంలోని రావివెంకటాంపల్లి సమీపంలో కాకతీయ కమ్మసేవా సంఘం కల్యాణ మండపం నిర్మాణాని ప్రభోదానంద స్వామి ఆర్థిక సాయం చేశారు. భవన నిర్మాణ శంకుస్థానకు మాజీ డీజీపీ రాముడు సహా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు, అధికారులతో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కూడా హాజరయ్యారు. ఇదంతా స్వామి ప్రబోధానంద స్వామినే చేయిస్తున్నారని భావించిన జేసీ సోదరులు..దాన్ని జీర్ణించుకోలేకపోయారు. తనకు వ్యతిరేకంగా కమ్మసామాజిక వర్గాన్నంతటినీ ప్రభోదానందస్వామి కూడగట్టి తాడిపత్రిలో బలమైన వర్గంగా ఎదుగుతున్నాడని భావించిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి... అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో తాను గెలవాలంటే ప్రబోధాశ్రమాన్ని ఎలాగైనా మూసివేయించాలన్న దురుద్దేశ్యంతో దాడులకు దెగబడుతున్నట్లు సమాచారం. హిందువుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం తనకు వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణ సృష్టించి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నదే అధికారపార్టీ నేతల ప్లాన్‌గా తెలుస్తోంది. అందులో భాగంగానే జేసీ సోదరులు ప్రభోదానందాశ్రమం భక్తులకు, పెద్దపొలమడ గ్రామస్తుల మధ్య చిచ్చుపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల వరకు పెద్దపొలమడ, చిన్నపొలమడ గ్రామ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండే వారు.. కానీ అధికార పార్టీ నేతల పన్నాంగంతో శత్రుత్వం పెంచుకుని నేడు కత్తులు దూసుకునేందుకు సిద్ధమయ్యారు. జేసీ సోదరుల ప్రోద్భలంతో ఒకరిపై ఒకరు రాళ్లదాడులు, దహనాలకు పాల్పడుతున్నారు. ప్రబోధాశ్రమంపై ఓ వర్గాన్ని జేసీ సోదరులు ఉసిగొల్పుతున్నారనిఆశ్రమానికి చెందిన భక్తులు చెబుతున్నారు. -
తాడిపత్రితో ఉద్రికత్త పరిస్థితి
-
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వినాయక నిమజ్జనం సందర్బంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్ల దాడులు, వాహనాల దహనాలతో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో శనివారం వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించారు.చిన్నపొలమడలోని శ్రీప్రబోధానందాశ్రమం మీదుగా జేసీ సోదరుల అనుచరులు మూడు ట్రాక్టర్లలో ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ, డప్పులు మోగిస్తూ, ఈలలు కేకలు వేయడంతో ఆశ్రమ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఇలా హంగామా సృష్టించడం సమంజసం కాదన్నారు. అక్కడ బందోబస్తులో ఉన్న సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి ఆశ్రమ భక్తులకు సర్దిచెప్పారు. అయితే, నిమజ్జనం ఊరేగింపు ఆశ్రమం ముందుకు రాగానే అధికార టీడీపీ కార్యకర్తలు, జేసీ సోదరుల అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఇంతలో అక్కడున్న మూడు ట్రాక్టర్లు, ఒక ఆటోకు మంటలంటుకున్నాయి. ఆశ్రమ భక్తులు, జేసీ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. ఈ ఘర్షణలో ఆశ్రమానికి చెందిన భక్తులు చంద్రశేఖర్, ఆదినారాయణ, జయచంద్ర, రామకృష్ణ, మహేష్, వెంకటేష్, నిరంజన్‌తోపాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను ఆశ్రమ నిర్వాహకులు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు జేసీ సోదరుల అనుచరులు పెద్దపొలమడలోని ఆశ్రమ భక్తుల నివాసాలను చుట్టుముట్టారు. పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి వచ్చేంత వరకు వాహనాలు దహనమవుతూనే ఉన్నాయి. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు మంటలను ఆదుపులోకి తెచ్చారు. అనుమతి ఎందుకు ఇచ్చినట్లు? శ్రీప్రబోధానందాశ్రమం ముందుగా ట్రాక్టర్లు ఊరేగింపుగా వెళ్లేందుకు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ దారిలో ఊరేగింపుగా వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇక్కడ నీళ్లు కూడా లేవు. అలాంటప్పుడు పోలీసులు ఆశ్రమం ముందు నుంచి ఊరేగింపునకు ఎందుకు అనుమతిచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనూ వినాయక చవితి సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులకు, జేసీ అనుచరులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయినా జేసీ వర్గీయులు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. పథకం ప్రకారమే ఆశ్రమంపై దాడులు పెద్దపొలమడ, చిన్నపొలమడ గ్రామస్థులు తమ ఊళ్లలోనే వినాయక నిమజ్జనం నిర్వహించడం ఏటా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే, ఈసారి నిమజ్జనం సందర్భంగా చిన్నపాటి విగ్రహాలను ఓ ట్రాక్టర్లో ఉంచి, దాని వెనుక మరో రెండు ఖాళీ ట్రాక్టర్లకు పోలీసులు ఎందుకు అనుమతిచ్చారని ఆశ్రమ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఘర్షణ చోటు చేసుకోవడానికి కారణం సీఐ సురేంద్రనాథ్రెడ్డేనని ఆరోపిస్తున్నారు. సీఐ ప్రోత్సాహంతోనే జేసీ అనుచరులు మరింత రెచ్చిపోయారని పేర్కొంటున్నారు. విగ్రహం వెనుక వస్తున్న రెండు ట్రాక్టర్లలో రాళ్లు వేసుకుని ఊరేగింపునకు వచ్చారని, ఆశ్రమం వద్దకు రాగానే ఓ పథకం ప్రకారం దాడులకు తెగబడ్డారని భక్తులు చెబుతున్నారు. ఘర్షణ సందర్బంగా ట్రాక్టర్లను జేసీ అనుచరులే దహనం చేసి తమపై తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఓ పథకం ప్రకారమే వారి ట్రాక్టర్లను వారే దహనం చేసుకుని తమపై కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ట్రాక్టర్లకు ఎవరు నిప్పు పెట్టారో తెలియాల్సి ఉంది. పోలీసులు జేసీ సోదరులకు తొత్తులు తాడిపత్రిలో జేసీ సోదరులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆశ్రమం భక్తులు ఆరోపించారు. ఘర్షణకు పరోక్షంగా సహకరించి, ఆశ్రమంపై జేసీ అనుచరులను ఉసిగొల్పిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా భక్తులు శనివారం రాత్రి ఆశ్రమం ముందు ఆందోళనకు దిగారు. గతంలో ఇదే సీఐ పలుమార్లు జేసీ సోదరుల ప్రోద్బలంతో ఆశ్రమ నిర్వాహకులపై తప్పడు కేసులు బనాయించాడని ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడుబందోబస్తు డ్యూటీ వేయించుకుని ఆశ్రమంపై తెలుగుదేశం పార్టీ వారిని ఉసిగొల్పాడని విమర్శించారు. సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేసీ సోదరులు కక్ష సాధిస్తున్నారు జేసీ సోదరులు ఓ పథకం ప్రకారం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని శ్రీప్రబోధానందశ్రమం డైరెక్టర్ సూర్యనారాయణ ఆరోపించారు. ఆశ్రమానికి చెందిన దళితుడిని దూషించిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయించామన్న అక్కసుతో తమపై కక్ష సాధిస్తున్నారని పేర్కొన్నారు. సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై ఎస్పీ సీరియస్ నిమజ్జనం సందర్బంగా బందోబస్తు నిర్వహించిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఇప్పుడు మళ్లీ ఇదే దారి గుండా నిమజ్జనానికి ఎందుకు అనుమతిచ్చారని సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తాడిపత్రి ఆస్పత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రి : తమ పిల్లలను ఎవరో హత్య చేసి, చెరువులో పడేశారంటూ.. వారెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ పవన్, బాలాజీ బంధువులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యల్లనూరు మండలం చిలమకూరు సమీపంలోని చిత్రావతి నదిలో విద్యార్థులు పవన్ (8), బాలజీలు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు, సమీప బంధువులు తమ పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో హత్య చేసి నదిలోని నీటిగుంటలో పడేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలులేదని ఆందోళనకు దిగారు. పోలీసులు కొందరిని కాపాండేందుకు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అర్బన్, రూరల్ సీఐలు సురేందర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డిలు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. -
బాబుపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: సోము
అనంతపురం జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , టీడీపీ నేతలకు ప్రధానమంత్రి పై తిరగబడండి అని చెప్పడం చూస్తుంటే ఎంత నీచ స్థితికి దిగజారాడో అర్థం అవుతుందని..అసలు ప్రధానమంత్రి పైకాదు..ప్రజలే చంద్రబాబు పై తిరగబడే రోజు దగ్గర్లో ఉందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలో బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ఆంద్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ తనవల్ల వచ్చిదని చెప్పుకుంటున్నాడని, కానీ ఇది ప్రధాన మంత్రి గారి వల్ల వచ్చిందే తప్ప చంద్రబాబు వల్ల కాదని అన్నారు. ఆంద్రప్రదేశ్‌కు కడప ఉక్కు పరిశ్రమ రావాలన్నా, విశాఖకు రైల్వే జోన్ రావాలన్నా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు సంబంధించి నిధులు రావాలన్న ఒక్క ప్రధానమంత్రితోనే సాధ్యమవుతుంది తప్ప..అవినీతి చంద్రబాబు వల్ల కాదని విమర్శించారు. -
జీవితాలతో ఆట!
కొండసాని సురేశ్‌రెడ్డి. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పీఏగా పనిచేసిన వ్యక్తి. జీవా తాడిపత్రి వాసి. వీరి కనుసన్నల్లో నడిచే బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేస్తే రూ.29.90 లక్షలు పట్టుబడింది. తాడిపత్రి అడ్డాగా క్రికెట్ బెట్టింగ్ సాగుతోందని ‘సాక్షి’లో లెక్కలేనన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికైనా పోలీసులు బెట్టింగ్‌పై దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగడంతో నిర్వాహకులతో పాటు బెట్టింగ్‌రాయుళ్లలో వణుకు పుడుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్కా.. క్రికెట్ బెట్టింగ్.. పేకాట. ఈ మూడింటికీ అనంత అడ్డాగా మారింది. తాడిపత్రి కేంద్రంగా ఎన్నో జీవితాలు కూలిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బడా నేతల అండతో అనుచరవర్గం సాగిస్తున్న దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే ‘సాక్షి’ పలుమార్లు ఈ ఆట గుట్టురట్టు చేసింది. అయితే అప్పటికప్పుడు బుకీలను అరెస్టు చేయడం.. బెట్టింగ్‌రాయుళ్లను అదుపులోకి తీసుకుని వదిలేయడంతో పోలీసులు తమ పని అయిందనిపించడం పరిపాటిగా మారుతోంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మంగళవారం నుంచి ముక్కోణపు టీ–20 సిరీస్ ఆరంభమైన నేపథ్యం లో ఒక రోజు ముందుగానే బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్‌లీగ్)మ్యాచ్‌లకు బెట్టింగ్ కాస్తూ పట్టుబడ్డారు. సోమవారం బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నా మంగళవారం రాత్రి శ్రీలంక–భారత్ మ్యాచ్‌కు యథేచ్ఛగా భారీగా బెట్టింగ్ సాగడం గమనార్హం. తాడిపత్రి, అనంత కేంద్రంగా బెట్టింగ్ ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు బుకీలు తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. బుకీలు ముంబయి, హైదరాబాద్‌లో ఉంటారు. ఇక్కడ సబ్ బుకీలను నియమించుకుంటారు. మ్యాచ్ ప్రారంభం నుంచి.. ముగిసే వరకు బెట్టింగ్ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. దీనికి వ్యాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి బెట్టింగ్ రేటును ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. బుకీల ద్వారా మ్యాచ్ గెలుపోటములపై మాత్రమే ఎక్కుగా బెట్టింగ్ నడుస్తోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఒక జట్టును ఫెవరెట్‌గా పరిగణిస్తారు. ఫేవరెట్ జట్టుపై బెట్టింగ్ కాసి ఆ జట్టు విజయం సాధిస్తే తక్కువ డబ్బు వస్తుంది. ఫేవరేట్ కాని జట్టు గెలిస్తే భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పోలీసులకు పట్టుబడిన వారిలో లక్షకు ఐదు లక్షల చొప్పున కూడా బెట్టింగ్ కాశారు. మ్యాచ్‌లో ఫేవరెట్ జట్టు త్వరగా వికెట్లు కోల్పోతే వెంటనే బెట్టింగ్ తీరు మారిపోతోంది. 50–50కి వస్తుంది. మ్యాచ్ తీరును బట్టి బెట్టింగ్ తన స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్‌బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగే జిల్లాలో రోజూ రూ.2 కోట్ల దాకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాల్‌టు బాల్ బెట్టింగ్ సబ్‌బుకీలతో పనిలేకుండా ‘లోకల్’బెట్టింగ్ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్ టు బాల్’ బెట్టింగ్ జరుగుతోంది. ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు వికెట్ పడుతుందా? లేదా? సిక్స్? ఫోర్ కొడతాడా? బౌలర్ డాట్ బాల్ వేస్తాడా? బ్యాట్స్‌మన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతీ బాల్‌కు బెట్టింగ్ జరుగుతుంది. అంటే ఒక మ్యాచ్ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్ జరిగే 240 బాల్స్‌పై బెట్టింగ్ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్‌కు కొన్ని లాడ్జీలు, ఇళ్లను రోజువారీ అద్దెకు తీసుకుని నడిపిస్తారు. ఇలాంటి ఇళ్లకు రోజుకు రూ.5వేలు కూడా అద్దె చెల్లిస్తున్నారు. అలాగే 10–20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి మ్యాచ్ సమయంలో ఓ లాడ్జీ ని అద్దెకు తీసుకుని అక్కడ బెట్టింగ్ ఆడుతుంటారు. సోమవారం పట్టుబడిన వారు కూడా అనంతలో ఓ గదిని అద్దెకు తీసుకుని పట్టుబడ్డారు. ఈ తరహా బెట్టింగ్ రోజూ రూ.1.50కోట్ల దాకా ఉంటోందని సమాచారం. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయిస్తేనే ప్రయోజనం జీవా విజయవాడలో ఎక్కువగా ఉంటాడు. అక్కడి నుంచే బెట్టింగ్‌ను నిర్వహిస్తుంటాడని తెలుస్తోంది. జీవాను విచారిస్తే పూర్తిగా బెట్టింగ్ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. ఇతని కనుసన్నల్లో తాడిపత్రిలో మరో ఆరుగురు సబ్‌బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ‘అనంత’లోనూ భారీగా బెట్టింగ్ సాగుతోంది. వన్‌టౌన్ పరిధిలోని పంజాబ్నేషనల్ బ్యాంకు వీధిలో రోజూ బెట్టింగ్‌రాయుళ్లు సమావేశమవుతుంటారు. అలాగే కమలానగర్‌లోని ఓ కేఫ్‌లోనూ మరో బృందం రోజూ సమావేశమై బెట్టింగ్ నిర్వహిస్తోంది. రాజు రోడ్డులోని ఓ హోటల్లో సూట్ బుక్ చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలో ఏ లీగ్, టోర్నీ జరిగినా పందేలు కాస్తున్నారు. రోజూ టీవీలో ఏదో ఒక మ్యాచ్ వస్తుంటుంది. అంటే రోజూ బెట్టింగ్ నడుస్తున్నట్లే లెక్క. భారత్ ఆడే మ్యాచ్‌లు ఉంటే బెట్టింగ్‌కాసే వాళ్లు మరింత ఎక్కువగా ఉంటారు. మంగళవారం నుంచి మొదలైన ముక్కోణపు టోర్నీ జరిగే సమయాల్లో దాడులు నిర్వహిస్తే భారీగా బెట్టింగ్ రాయుళ్లు పట్టుబడే అవకాశం ఉంది. భారీ వడ్డీలకు అప్పులు బెట్టింగ్‌లో కలిసొస్తే పదివేలతో వెళ్లిన వాడు రూ.లక్షతో తిరిగొస్తాడు. లేదంటే రూ.లక్ష తీసుకెళ్లిన వాడు రూపాయి కూడా మిగిల్చుకోలేని పరిస్థితి. దీంతో బెట్టింగ్ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీతో డబ్బులు తెస్తున్నారు. ఇంకొందరు పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. వీరి వద్ద చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్‌లను కూడా తాకట్టుపెడుతున్నారు. -
..ష్ గప్ చుప్!
తాడిపత్రి : తాడిపత్రి సమీపంలోని గెర్డెవ్ ఉక్కు కర్మాగారంలో కార్మిక చట్టాలు అమలవుతున్న తీరుపై స్థానిక పోలీసుల విచారణ మొక్కుబడిగా సాగింది. ఏదైనా ఒత్తిడా.. లేక మరో కారణమో తెలీదు కానీ విచారణ సాగిన తీరు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు.. ఒడిశా కార్మికులను నిర్బంధించి.. జీతాలు ఇవ్వకుండా వారితో చాకిరీ చేయించుకుంటున్న విషయాన్ని ‘లోగుట్టేంటి?’ శీర్షికన సాక్షి గురువారం వెలుగులోకి తేవడంపై జిల్లా ఎస్పీ స్పందించారు. వెంటనే విచారణ చేపట్టాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ వెంకటరెడ్డి, ఎస్ఐ రఘుప్రసాద్ గురువారం సాయంత్రం గెర్డెవ్ కర్మాగారంలోని లేబర్ కాలనీకి వెళ్లారు. పోలీసులు వస్తున్నట్లు ముందుగా సమాచారం అందుకున్న యాజమాన్యం.. కాలనీలో ఎక్కువ మంది కార్మికులు లేకుండా జాగ్రత్త తీసుకుంది. కూలీలు కాని వారిని.. కూలీలుగా చూపుతూ పోలీసుల ముందుంచింది. కాసేపు వారితో మాట్లాడిన పోలీసులు అక్కడి నుంచి వచ్చేశారు. కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమన్యంతో కానీ, కార్మికులతో పని చేయిస్తున్న కాంట్రాక్టర్‌తో కానీ మాట్లాడలేదు. అనంతరం రూరల్ పోలీస్టేషన్లో విలేకరులతో సీఐ మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం లేకుండా 18 మంది కార్మికులను ఒడిశా రాష్ట్రానికి తరలించిన మాట వాస్తవమేనన్నారు. ఇంకా నిర్బంధంలో ఉన్న కార్మికుల గురించి విచారణ చేస్తున్నామన్నారు. తాము వెళ్లిన సమయంలో కార్మికులు పని చేస్తుండటంతో పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఫొటోను మీడియాకు అందజేశారు. ఆ ఫొటోలో ఉన్న వారు కార్మికులంటే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన యాజమాన్యం సెక్యూరిటీ విభాగం అధికారులపై తాడిపత్రి ప్లాంట్ ప్రధాన ఇన్చార్జి జార్జి ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. హైదరాబాద్‌లో ఉన్న ఉప ప్రధాన కార్యాలయంలోని అధికారులు దీనిపై నివేదిక తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. కార్మికులకు సంబంధించి ప్రధాన కాంట్రాక్ట్ పొందిన ఎన్సీసీ సంస్థ మళ్లీ సబ్ కాంట్రాక్ట్ చందన సంస్థకు ఇవ్వడంపై కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. ఎన్సీసీ ప్రతినిధి సోమయాజులు హైదరాబాద్ నుంచి సాయంత్రం వచ్చి డీజీఎం కుట్టి, ఏజీఎం జార్జ్‌లతో చర్చించారు. కార్మికుల విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. కార్మికులకు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పి నిర్బంధంలో లేమని చె ప్పించేందుకు యాజమాన్యం, కాంట్రాక్ట్ సంస్థ ప్రయత్నలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న ఒడిశా కార్మికుల వద్ద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి వారితో కాంట్రాక్టర్ తరఫు ప్రతినిధులు తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు సమాచారం. మరోవైపు యాజమాన్యం కూడా దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు, కార్మిక శాఖ అధికారులు తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేలా చూడాలని కోరినట్లు సమాచారం. -
పట్టాల పందేరం
తాడిపత్రి : మీకు ఇంటి పట్టా కావాలా? అర్హత లేకున్నా పట్టాను ఆశిస్తున్నారా? ఎక్కడో కొండ గుట్టలు కాదు.. పట్టణానికి సమీపంలోనే స్థలం కేటాయించాలని కోరుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే తాడిపత్రికి వచ్చేయండి. మీరు పేదలు కాకపోయినా, ఇంటి పట్టా తీసుకోవడానికి ఏమాత్రమూ అర్హతలు లేకపోయినా రెవెన్యూ అధికారులు మీకు సహాయపడతారు. వారు నియమించుకున్న దళారులకు అంతో ఇంతో ముట్టజెబితే చాలు..విలువైన స్థలాన్ని రాసిచ్చేస్తారు. ఇప్పటికే పట్టణానికి అతి సమీపంలో పరిశ్రమలకు ఆనుకొని తాడిపత్రి-పెద్దపప్పూరు రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పంచి పెట్టేశారు. 20 ఏళ్ల క్రితం నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన స్థలాలపైనా మళ్లీ పట్టాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి సమీపంలో చిన్నపొలమడ గ్రామ సర్వే నంబర్ 369, 371-బీలలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడే 1988లో తాడిపత్రి ప్రాంతంలో పనిచేసే నాల్గోతరగతి ఉద్యోగులు 132 మందికి స్థలాలు కేటాయించారు. వారిక్కడ ఇళ్లు నిర్మించుకోలేదు. ఈ స్థలంపై కన్నుపడిన కొంత మంది దళారులు.. నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలన్న పేరుతో మధ్యవర్తిత్వం వహించి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్నారు. దీంతో అధికారులు ఏకంగా 280 వరకు బోగస్ పట్టాలు సృష్టించి నేరుగా దళారులకు అందజేశారు. పోలింగ్ బూత్ అధికారులు (బీఎల్ఓలు)గా పనిచేసిన సుమారు 185 మంది పేర్లతోనూ పట్టాలు జారీ చేశారు. ఈ వ్యవహారమంతా సాధారణ ఎన్నికల ముందు గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారు. ఈ పట్టాలను దళారులు రూ.వెయ్యి మొదలుకుని అంతకంటే ఎక్కువ మొత్తానికి అమ్మడం ప్రారంభించారు. ఈ విషయం చిన్నపొలమడ గ్రామస్తులకు తెలియడంతో తమ గ్రామంలోని నిరుపేదలకు కాకుండా ఇతరులకు ఎలా పట్టాలు ఇస్తారంటూ స్థలాన్ని ఆక్రమించేశారు. అలాగే విషయాన్ని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే.. తహశీల్దార్ రామకృష్ణారెడ్డిని, రెవెన్యూ అధికారులను పిలిపించి తనకు కానీ, అప్పట్లో ఉన్న ఎమ్మెల్మేకు కానీ తెలియకుండా ఇన్ని పట్టాలు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం పట్టాలన్నీ రద్దు చేయాలని ఆదేశించారు. పట్టాలు మా వద్దే ఉన్నాయి ఇళ్ల పట్టాలు తయారు చేసిన మాట వాస్తవమే. అయితే.. వాటిని ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. మా వద్దనే ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యే పరిశీలించిన తర్వాత, ఆయన ఆమోదం మేరకు అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తాం. - తహశీల్దార్ రామకృష్ణారెడ్డి -
బోరు ఏర్పాటుకు టీడీపీ మోకాలడ్డు
తాడిపత్రి: పట్టణంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, సొంత ఖర్చులతో బోరు వేయించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు తీసుకున్న చర్యలను అడ్డుకోవడంతో అమ్మా పెట్టదు.. అడుక్కు తినానివ్వదన్న చందంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాడిపత్రి మున్సిపాలిటీలోని 3వ వార్డు ఎద్దుల గేరిలో తాగునీటి ఎద్దడి తీవ్రం కావడంతో, సమస్య పరిష్కరించాలంటూ ఆ ప్రాంత వాసులనుంచి కౌన్సిలర్ మున్నాకు విన్నవించుకున్నారు. అందుకు స్పందించిన ఆయన శుక్రవారం రిగ్గును రప్పించి బోరు వేయిస్తుండగా మున్సిపల్ ైవె స్ చైర్మన్ జిలాన్ బాషా, మైనార్టీ నాయకులు ఫయాజ్ బాషా, కౌన్సిలర్లు ఇక్బాల్, సాదక్ టీడీపీకి చెందిన ఇతర నాయకులు పనులను అడ్డుకున్నారు. బోరు వేయాలంటే మున్సిపాలిటీ వారు వేస్తారని, ఆ పని చేసేందుకు మీరెవరంటూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ యువ నాయకుడు రమేష్‌రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రంగనాథ్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఇన్నాళ్లూ తాగేందుకు నీటి సరఫరాలో విఫలమైన అధికారులు, తగుదునమ్మా అంటూ ఇప్పుడు రావడం విడ్డూరంగా ఉందంటూ మున్సిపల్ అధికారులు, ఎస్ఐ వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో మున్సిపల్ సిబ్బంది హడావుడిగా కాలనీలోకి నీటి ట్యాంకర్లు పంపించారు. అక్కడే ఉన్న రిగ్గును పంపించి, సాయంత్రం లోపు బోరును తామే ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వైఎస్సార్సీపీ నాయకులు మిన్నకుండిపోయారు. డీఎస్పీకి ఫిర్యాదు ఈ సంఘటనపై వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్ రెడ్డి డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. వార్డు ప్రజల కోసం కౌన్సిలర్ బోరు వేయించడాన్ని రాజకీయ కోణంలో చూ డాల్సిన పని లేదని, ఇన్ని రోజులుగా స్పందించని నాయకులు ఇప్పుడు హడావుడిగా స్పందించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. అధికారులు బోరు వేయిస్తే తమకు అభ్యంతరం లేదని, వారు చర్యలు తీసుకోని పక్షంలో తాము బోరు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
ఉనికి కోసం జేసీ అడ్డదారులు!
తాడిపత్రి, న్యూస్‌లైన్: పౌరులు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న అధికారుల మాటలు ఆచరణకు నోచుకోకపోవడంతో తాడిపత్రి ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి మండల పరిధిలోని తలారిచెరువు, ఊరుచింతల గ్రామాల్లో 1340 మంది ఓటర్లు ఉన్నారు. పాదేశిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయని పక్షంలో వారికి ఓటు హక్కే లేకుండా చేస్తామని జేసీ సోదరులు మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. లేని పక్షంలో ఎవరూ ఓటింగ్‌లో పాల్గొనరాదని హెచ్చరించినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం జేసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు తలారిచెరువు సమీపంలోని పెన్నా సిమెంట్ ప్లాంట్ యాజమాన్యాన్ని కలిసి, ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది టీడీపీకి ఓటు వేసేలా చూడాలని, లేని పక్షంలో వారెవరూ ఓటింగ్‌కు వెళ్లకుండా చూడాలని అన్న ఆదేశించారంటూ చెప్పారు. పరిధిలో ఉన్న 600 ఓట్లు ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఇవి కీలకంగా మారాయి. సర్పంచ్ ఎన్నికల సమయంలో సైతం ఈ ఓటర్లు ఫ్యాక్టరీ కాంపౌండ్ దాటి బయటకు వెళ్లకుండా గేట్లు మూసేశారు. తమకు అనుకూలంగా ఓటు వేయకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందంటూ కార్మికులు, సిబ్బందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిసింది. వీటికి లొంగని పక్షంలో ఓటింగుకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై గురువారం వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌తోపాటు ఎస్పీ, కలెక్టర్లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
సమస్య చెప్పుకోండి
ముఠా కక్ష్యలు, హత్యలు, దాడులు.. ప్రతి దాడులకు పెట్టింది పేరు తాడిపత్రి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల ప్రోత్సాహంతో ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో ఆధిపత్య పోరు సాగుతోంది. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బ తీయడానికి తోటల్లోని చెట్లను నరికివేయడం ఇక్కడ పరిపాటి. తాజాగా ఎర్ర చందనం అక్రమ రవాణా, ఇసుక మాఫియా ఈ ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి ప్రాంతం నుంచే తొలిసారిగా ‘ప్రజా దర్బార్’కు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. తాడిపత్రి సబ్ డివిజన్లోని పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్లో ప్రజల నుంచి స్వయంగా ఆయనే ఫిర్యాదులు స్వీకరిస్తారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఫిర్యాదు చేస్తే.. బాధితుల భద్రతపై పోలీసులు ఇచ్చే భరోసాపైనే ఈ కార్యక్రమం హిట్టా.. పట్టా అనేది ఆధారపడి ఉంది. తాడిపత్రి, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమస్యాత్మక ప్రాంతాలపై పట్టు బిగించేందుకు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించాలని నిర్ణయించుకున్న ఆయన, ఈ కార్యక్రమాన్ని తొలుత తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రత్యేక కారణాలే ఉన్నాయి. 2013 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించిన సెంథిల్‌కు మొదట తాడిపత్రి ప్రాంతం వాసులే తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. నేరుగా ఫోన్ చేసి తమ దీనగాథలను వెల్లడించారు. మొదటి రోజే తాడిపత్రిలోని ఓ మద్యం సిండకేట్ కార్యాలయంలో పేకాట ఆడుతున్నారని, పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ అనంతపురానికి చెందిన ప్రత్యేక బృందంతో దాడులు చేయించి నిందితులను, పెద్ద మొత్తంలో నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డీఎస్పీ, సీఐలను మందలించి చార్జ్‌మెమోలు కూడా ఇచ్చారు. ఇక అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని, బాధితుల ఫిర్యాదులు స్వీకరించడం లేదని పోలీసు టోల్‌ఫ్రీ నంబర్లకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తులుగా మారడంతో ఇద్దరు సీఐలను కూడా ఎన్నికల కమిషన్ కొద్ది రోజుల పాటు పక్కన పెట్టింది. ఇటీవల పెద్దవడుగూరు సహకార సంఘాల ఎన్నికల్లో బరిలో ఉన్న గిరిజన మహిళపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేయడం.. దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఎస్పీ దృష్టికి తీసుకె ళ్లారు. ఇలాంటి దారుణాలు చాలానే ఉన్నాయి. ప్రత్యర్థుల చెట్లను నరికే సంస్కృతి కూడా అధికంగా ఉంది. తాజాగా పెన్నా, చిత్రావతి నదుల నుంచి రాయలసీమ జిల్లాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఇక్కడ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. పెద్ద ఎత్తున ఇసుక మాఫియా ఇక్కడ రాజ్యమేలుతోంది. నెలకు కనీనం 50 నుంచి 100 వాహనాలను సీజ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రచందనం రవాణాలో కూడా ఈ ప్రాంత నేతల అనుచరుల హస్తం ఉంది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. ఎర్రచందనం దుంగలను తోటల్లో, పరిశ్రమల్లో దాచి.. వీలు కుదిరినప్పుడు రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందన్న విమర్శలు ఉన్నాయి. పరోక్షంగా రాజకీయ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎస్పీ ఇక్కడి నుంచి ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. ప్రజలు ఫిర్యాదు చేస్తారా? ప్రజాదర్బార్‌లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సమస్యలపై గానీ, తమకు జరిగిన అన్యాయం గురించి గానీ ఫిర్యాదు చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి తెలుసు. అందుకే చాలా మంది ‘ప్రజాదర్బార్’పై ఎటూ చెప్పలేకపోతున్నారు. ఫిర్యాదు చేసిన బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. లేదంటే బాధితులపై రాజకీయ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు. గతంలోలా చేయరు కదా? ‘ప్రజాదర్బార్’ ఉంటుందన్న విషయం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు. దీంతో చాలా మందికి ఈ విషయం చేరకపోవచ్చు. అయినా ఎస్పీ నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు అభినందిస్తున్నారు. కానీ ఆచరణలో ఎలా ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఫిర్యాదులు తీసుకుని ‘ఇది మా పరిధిలోకి రాదు.. మేం చేయలేం.. కోర్టులను ఆశ్రయించండి’ అన్న సందర్భాలు ఉన్నాయి. ఎవరెవరు ఫిర్యాదు చేయొచ్చంటే.. పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలీసు ప్రజాదర్బార్ పేరుతో ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు సేకరిస్తారు. పెద్దపప్పూరు, తాడిపత్రి, తాడిపత్రి రూరల్, యాడికి, పెద్దవడుగూరు, పామిడి, పుట్లూరు, యల్లనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రజలు నేరుగా ఫిర్యాదులు అందజేయవచ్చని తాడిపత్రి డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు హాజరవుతారు.