
సాక్షి, అనంతపురం: పోలింగ్ సందర్భంగా అధికార టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయుల చేతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త తీవ్ర గాయపడ్డారు. నియోజకవర్గంలోని వీరాపురం పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు ప్రయత్నించిన జేసీ అనుచరులను అడుకున్న పుల్లారెడ్డిపై వేటకొడవళ్లతో దాడికి దిగారు. అక్కడున్న మరికొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆయనతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఎన్నికల అధికారులు ఉండగానే జేసీ వర్గీయులు పోలింగ్ బూత్‌తోకి వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడుతుడడం సంచలనం రేపుతోంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ.. జేసీ వర్గీయులు హల్‌చల్ చేస్తున్నారు. అడ్డుకున్న వారిపై దాడికి పాల్పడుతు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.