ప్రభాకర్ చౌదరి, జేసీ దివకార్ రెడ్డి
సాక్షి, అనంతపురం టవర్‌క్లాక్: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మధ్య విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ఎన్నికల ప్రచారాలు ఈ వివాదాలకు వేదికలయ్యాయి. ఇప్పటికే నాలుగేళ్లుగా నగర వాసులను గందరగోళానికి గురి చేసి అభివృద్ధికి గండి కొడుతూ వచ్చిన ఇద్దరూ ఎన్నికల వేళ ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ వాస్తవాలు బహిర్గతం చేయడం గమనార్హం. తాజాగా సోమ వారం రాత్రి అనంతపురంలో తన తనయుడు, ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలంటూ జేసీ దివాకర్‌రెడ్డి రోడ్డు షో నిర్వహించారు.
టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠంసర్కిల్, తాడిపత్రి బస్టాండ్ రోడ్డు తదితర ప్రాం తాల్లో జేసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అనంతపురం నగరాభివృద్ధిని ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి అడ్డుకున్నారని ఆరోపిం చారు. ఇలాంటి 420కి ఓటు వేయొద్దంటూ ప్రజ లకు పిలుపునిచ్చారు. రోడ్ల వెడల్పు కోసం రూ.65 కోట్లు, ఎన్టీఆర్ మార్గ్ కోసం రూ.25 కోట్లు మున్సిపల్ కమిషనర్ వద్ద మూలుగుతున్నట్లు తెలిపారు. వీటిని పక్కదారి పట్టించారన్నారు. దీన్ని బట్టి చూస్తే నగరంలో అభివృద్ధికి పూర్తి స్థాయిలో అడ్డుపడింది ప్రభాకర్‌చౌదరే అని తేటతెల్లమైంది. కాగా, జేసీ రోడ్డు షోకు జనస్పందన కరువైంది.
Comments
Please login to add a commentAdd a comment