Prabhakar Choudhary
-
నువ్వా నేనా.. అనంత అసెంబ్లీ టికెట్ దక్కేదెవరికో..?
టీడీపీలో ఇద్దరు సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీయబోతోంది?. పట్టు నిలుపుకునేందుకు ఒకరు.. వేరే చోట పట్టు పెంచుకునేందుకు మరొకరు నానా తంటాలు పడుతున్నారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. ఒకరిమీద ఒకరు బాదుడే బాదుడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటంటూ నలుగురు జేసీ వర్గీయులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అనంతపురం అసెంబ్లీ పార్టీ ఇంచార్జ్ ప్రభాకర్ చౌదరి పార్టీ నాయకత్వానికి సిఫారసు చేశారు. దీంతో నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేసేదేంటంటూ జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. పైగా వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి అర్బన్ టికెట్ ఇవ్వొద్దంటూ తీర్మానం కూడా చేశారు. ఈ విధంగా తెలుగు తమ్ముళ్లలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. 2014లో అనంతపురం టౌన్ నుంచి గెలిచిన ప్రభాకర్ చౌదరి అంతకు ముందు ఒకసారి మున్సిపల్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి అర్బన్ నియోజకవర్గంపై కన్నుపడింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న జేసీ ఫ్యామిలీ 2014 ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చింది. 2014 నుంచి 2019 దాకా అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా జేసీ దివాకర్ రెడ్డి పనిచేశారు. 2019లో పోటీ నుంచి తాను తప్పుకుని కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని పోటీ చేయించి, ఘోర పరాభవాన్ని చవిచూశారు. కొడుకు రాజకీయ భవిష్యుత్తపై బెంగపెట్టుకున్న జేసీ ఇప్పుడు మరో ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి తన కొడుకు పవన్‌ను పోటీ చేయించే ఆలోచనలో జేసీ ఉన్నట్లు సమాచారం. అందుకే అనంతపురం పార్లమెంట్ ఇంచార్జి బాధ్యతలు చూస్తున్న పవన్‌రెడ్డికి అనంతపురం అసెంబ్లీ బాధ్యతలు వచ్చేలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: (లోకేష్ పోటీ చేసేది అక్కడినుంచేనా.. ఆ నియోజకవర్గ సర్వేల్లో తేలిందేంటి?) ఈ నేపథ్యంలోనే జేసీ వర్గం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దూకుడు పెంచింది. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ప్రభాకర్ చౌదరికి తెలియకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాజానగర్‌లో జేసీ వర్గం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక ఇంచార్జి ప్రభాకర్ చౌదరి అనుమతి లేకుండానే మీరెలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ చౌదరి వర్గీయులు జేసీ వర్గం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో జేసీ, ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య పరస్పరం వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎవరికి అనుకూలంగా వారు నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. వాస్తవానికి 2014లో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరినప్పటి నుంచే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో విభేదాలు మొదలయ్యాయి. అనంతపురం నియోజకవర్గంలో పట్టుకోసం జేసీ అప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభాకర్ చౌదరి అడ్డుకుంటూ వచ్చారు. ఎన్నికలయిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న వీరి గొడవలు ఇప్పుడు మళ్లీ మొదలైనట్లే కనిపిస్తున్నాయి. అనంత అసెంబ్లీ టికెట్ ముచ్చటగా మూడోసారి తనకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పట్టుబడుతుండగా, ఈసారి ఎలాగైనా తన కొడుక్కు ఇప్పించుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎవరికివారు నారా లోకేష్, చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. జేసీ, ప్రభాకర్ చౌదరి గ్రూపు రాజకీయాలతో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. అసలే పరిస్థితులు బాగాలేవు. మళ్లీ పార్టీలో రెండు గ్రూపుల మధ్య కొట్లాట ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని టీడీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
జేసీ పవన్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి
సాక్షి, అనంతపురం: అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం ముదురుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ పవన్‌రెడ్డి కార్యక్రమాలు చేపట్టడంతో.. తన అనుమతి లేకుండా ఎందుకు పర్యటిస్తున్నారంటూ ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ పవన్‌రెడ్డిని ఆయన ఓ శకునిగా అభివర్ణించారు. తాడిపత్రిలో టీడీపీని నాశనం చేశారని.. ఇప్పుడు అనంతపురం నియోజకవర్గంలో టీడీపీని డ్యామేజ్ చేసేందుకు తిరుగుతున్నారని జేసీ పవన్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ పవన్ నియంతలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జేసీ దివాకర్‌రెడ్డి వర్గంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమంటూ ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. (చదవండి: జేసీ దివాకర్‌రెడ్డికి 100 కోట్ల జరిమానా) -
నీ ఇష్టమొచ్చినోడికి చెప్పుకో !
సాక్షి, అనంతపురం : నగరంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గత ప్రభుత్వంలో చిరుద్యోగుల నుంచి కమిషనర్ స్థాయి అధికారులను సైతం చౌదరి అనుచరులు లెక్కచేయకుండా దాడులకు యత్నించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం తెలిసిందే. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కోవలోనే టౌన్ బ్యాంకు అధ్యక్షుడు జేఎల్ మురళీధర్ టీపీఎస్ సాయిప్రసాద్‌ను నడిరోడ్డుపై బండబూతులు తిట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల టీడీపీ నేత వ్యవహరించిన తీరు చూస్తే అధికారంలో ఉండగా ఏ స్థాయిలో పెత్తనం చెలాయించారో అర్థమవుతోంది. ఆగని ఆగడాలు నగరపాలక సంస్థ అధికారులు టీడీపీ నాయకుల దౌర్జన్యాలతో భయాందోళనకు గురవుతున్నారు. టౌన్ బ్యాంకు అధ్యక్షుడు జేఎల్ మురళీధర్ టీపీఎస్ సాయిప్రసాద్‌పై నోరు పారేసుకున్నాడు. అదే విధంగా 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ జీసస్‌నగర్‌లో టీడీపీ కార్యాలయం పేరిట తన కారు పార్కింగ్ ఏర్పాటు చేశాడు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళితే.. అక్రమ కట్టడాలన్నింటికీ కొలతలు వేసి మా వద్దకు రావాలని దురుసుగా సమాధానమివ్వడం గమనార్హం. ఇంకా నగరంలో టీడీపీ చోటామోటా నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పోలీసులు అధికారులను వేధిస్తున్న ఘటనలూ కోకొల్లలు. జిల్లా ఎస్పీ స్పందించి ఇలాంటి నేతలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ నేత బూతుపురాణం టీపీఎస్ సాయిప్రసాద్ : అన్నా.. వంకలో నిర్మాణం చేపట్టకూడదు. జేఎల్ మురళి : ‘నా స్థలాన్ని వంకంటావా? నువ్వెవడయ్యా. ల..బాల్‌గాడివి. నా గురించి తెలుసుకో ఫస్ట్ నీవు. వంకంటావా. ఏమనుకున్నావ్. నాకు మెంటల్ తేవద్దు. పోవయ్యా నీకిష్టమొచ్చినోనికి చెప్పుకో. నా దగ్గర గాన్నకరాలు చేస్తావా? నా పని ఆపు చేయిస్తావా? గు..పగలకొడుతా. ఏం పేరు నీ పేరు. ఏమనుకున్నావ్. నీ కథలు నా దగ్గర పడద్దు చెబుతున్నా. టీపీఎస్ సాయిప్రసాద్ : ఏసీపీ ఇసాక్ సార్ చెబితేనే వచ్చాం. జేఎల్ మురళి : అతి చేయొద్దు. (వెంటనే ఏసీపీ ఇస్సాక్‌కు ఫోన్ చేసి) నేను మురళి అన్నా. కాదు వంక గింక అంటున్నాడేంది నా సైట్‌ని. వీఎల్టీ కోసం రామ్మోహన్‌కు పంపిస్తా. చూడు. నీకు ఇబ్బంది లేదు. నీకేమున్నా నాకు చెప్పు. కాదు ఇతనెవరు సాయిప్రసాద్.. చాలా టూమచ్ చేస్తున్నాడు.. టీపీఎస్ సాయిప్రసాద్ : అన్నా.. వంకలో నిర్మాణం చేపట్టకూడదు. జేఎల్ మురళి : ‘నా స్థలాన్ని వంకంటావా? నువ్వెవడయ్యా. ల..బాల్‌గాడివి. నా గురించి తెలుసుకో ఫస్ట్ నీవు. వంకంటావా. ఏమనుకున్నావ్. నాకు మెంటల్ తేవద్దు. పోవయ్యా నీకిష్టమొచ్చినోనికి చెప్పుకో. నా దగ్గర గాన్నకరాలు చేస్తావా? నా పని ఆపు చేయిస్తావా? గు..పగలకొడుతా. ఏం పేరు నీ పేరు. ఏమనుకున్నావ్. నీ కథలు నా దగ్గర పడద్దు చెబుతున్నా. టీపీఎస్ సాయిప్రసాద్ : ఏసీపీ ఇసాక్ సార్ చెబితేనే వచ్చాం. జేఎల్ మురళి : అతి చేయొద్దు. (వెంటనే ఏసీపీ ఇస్సాక్‌కు ఫోన్ చేసి) నేను మురళి అన్నా. కాదు వంక గింక అంటున్నాడేంది నా సైట్‌ని. వీఎల్టీ కోసం రామ్మోహన్‌కు పంపిస్తా. చూడు. నీకు ఇబ్బంది లేదు. నీకేమున్నా నాకు చెప్పు. కాదు ఇతనెవరు సాయిప్రసాద్.. చాలా టూమచ్ చేస్తున్నాడు. -
420కి ఓటు వేయొద్దు
సాక్షి, అనంతపురం టవర్‌క్లాక్: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మధ్య విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ఎన్నికల ప్రచారాలు ఈ వివాదాలకు వేదికలయ్యాయి. ఇప్పటికే నాలుగేళ్లుగా నగర వాసులను గందరగోళానికి గురి చేసి అభివృద్ధికి గండి కొడుతూ వచ్చిన ఇద్దరూ ఎన్నికల వేళ ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ వాస్తవాలు బహిర్గతం చేయడం గమనార్హం. తాజాగా సోమ వారం రాత్రి అనంతపురంలో తన తనయుడు, ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలంటూ జేసీ దివాకర్‌రెడ్డి రోడ్డు షో నిర్వహించారు. టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠంసర్కిల్, తాడిపత్రి బస్టాండ్ రోడ్డు తదితర ప్రాం తాల్లో జేసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అనంతపురం నగరాభివృద్ధిని ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి అడ్డుకున్నారని ఆరోపిం చారు. ఇలాంటి 420కి ఓటు వేయొద్దంటూ ప్రజ లకు పిలుపునిచ్చారు. రోడ్ల వెడల్పు కోసం రూ.65 కోట్లు, ఎన్టీఆర్ మార్గ్ కోసం రూ.25 కోట్లు మున్సిపల్ కమిషనర్ వద్ద మూలుగుతున్నట్లు తెలిపారు. వీటిని పక్కదారి పట్టించారన్నారు. దీన్ని బట్టి చూస్తే నగరంలో అభివృద్ధికి పూర్తి స్థాయిలో అడ్డుపడింది ప్రభాకర్‌చౌదరే అని తేటతెల్లమైంది. కాగా, జేసీ రోడ్డు షోకు జనస్పందన కరువైంది. -
అనంత టీడీపీలో బయటపడ్డ విభేదాలు
అమరావతి: అనంతపురం జిల్లా టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అనంతపురం జిల్లా సమీక్షా సమావేశం వేదికగా అనంత సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీకి సీటు ఇవ్వొద్దంటూ ఆ పార్టీ నేతలు జకీవుల్లా, జయరాం నాయుడు డిమాండ్ చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరీ టీడీపీని ఎన్నడూ పట్టించుకోలేదని, ప్రభాకర్ చౌదరీకి గనక మళ్లీ సీటు ఇస్తే కచ్చితంగా ఓడించి తీరతామని తెగేసి చెప్పారు. దీంతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు నివ్వెరపోయారు. ఎమ్మెల్యేపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాసి ఇవ్వాలని మంత్రులు దేవినేని ఉమ, జవహర్‌లు వారిని కోరారు. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యేపై లిఖితపూర్వకంగా రాసి ఇచ్చేందుకు జకీవుల్లా, జయరాం నాయుడులు నిరాకరించారు. సాయంత్రం సీఎం నారా చంద్రబాబు నాయుడితో జరిగే సమావేశంలో అన్ని విషయాలను తెలియజేస్తామని సమీక్షా సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
ఆదర్శం.. అవినీతి పర్వం
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పరస్పర వ్యాఖ్యలపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. జిల్లాలోనే అర్బన్ నియోజక ఆదర్శమని ఎమ్మెల్యే గొప్పలు చెబుతుండగా...అవినీతిలోనే ఆదర్శంగా నిలిచారంటూ మాజీ ఎంపీ అనంతతో పాటు విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. (సాక్షిప్రతినిధి, అనంతపురం) : అనంతపురం అర్బన్ నియోజకవర్గం జిల్లాకే ఆదర్శం. నాలుగున్నరేళ్లలో అవినీతి లేకుండా, అభివృద్ధిని అందించాం. జిల్లాకే ‘అనంత’ ఆదర్శం’’ – పలు సందర్భాల్లో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యలు ‘అనంత’ అభివృద్ధిలో కాదు...అవినీతిలో జిల్లాకు ఆదర్శం. ఏ పని చూసినా, ఏ వార్డుకు వెళ్లినా అవినీతి తాండవిస్తోంది. గతంలో మేం చేసిన అభివృద్ధి మినహా నాలుగున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి కన్పించలేదు.’’– మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అనంత అర్బన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లా కేంద్రం కావడం, నియోజకవర్గంలోని ఎక్కువశాతం ఓటర్లు విద్యావంతులు, రాజకీయంగా చైతన్యం ఉన్నవారే కావడంతో ఈ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు జిల్లాలోని తక్కిన నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. మొదటినుంచి ‘అనంత’లో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభాకర్‌చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే నాలుగున్నరేళ్లలో ‘అనంత’ అభివృద్ధిని ఎమ్మెల్యే, మేయర్ పూర్తిగా విస్మరించారు. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆధిపత్యపోరుతో ‘అనంత’ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందనేది నగరవాసుల వాదన. కానీ ఎమ్మెల్యే మాత్రం తాను నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, అవినీతికి దూరమని, శాంతి కాముకుడినని, రాజకీయంగా అందరికీ అండగా ఉంటున్నాని ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే మాటలకు.. నియోజకవర్గ వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదు. అభివృద్ధిలో కాదు...అవినీతిలోనే ఫస్ట్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి అనుమతి లేకుండా నVýæరంలో చిన్న మురుగు కాలవ పనులు కూడా ముందుకు సాగవన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రతీ పనికి ఈయన కమిషన్ ఆశిస్తారని... ఆ పార్టీలోని కార్పొరేటర్లు, నేతలే బాహాటంగా చెబుతున్నారు. జేఎన్టీయూ పరిధిలో రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో 2 శాతం కమిషన్ ఎమ్మెల్యేకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో ఐహెచ్పీ చేపట్టిన రూ.191 కోట్లతో తాగునీటి పైపులైన్ పనుల్లోనూ మొబలైజేషన్ అడ్వాన్స్‌కింద మొదట్లో కంపెనీకి ఇచ్చిన రూ.7.5 కోట్లు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్లు కార్పొరేటర్లే చెబుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేతో పాటు మేయర్‌కూ వాటాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే రాంనగర్ బ్రిడ్జి నిర్మాణంలోనూ ఎమ్మెల్యేకు 3 శాతం ‘గుడ్‌విల్’ ముట్టజెప్పినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇటీవల వడ్డెర ఫెడరేషన్‌కు చెందిన రూ.12 కోట్లు దారి మళ్లినట్లు బాధితులుపోలీసులను ఆశ్రయించారు. నిజానికి రూ.24 కోట్ల మేర దారి మళ్లాయని, ఇందులో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే పాత్ర ఉందని కూడా తెలుస్తోంది. ఇద్దరికీ వాటాలు టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి భారీ భవంతులు నిర్మాణాలకు మేయర్‌కు వాటాలు ముట్టందే పని ముందుకు కదలదని కార్పొరేటర్లే చెబుతున్నారు. ‘అనంత’లో భారీ సంఖ్యలో నిర్మాణాలు జరుగుతుండటం, ఆదాయం ఎక్కువగా ఉండటంతో టౌన్‌ప్లానింగ్‌లోని ఓ అధికారి అండతో ఎమ్మెల్యే ఇంటికీ పర్సెంటేజీలు వెళుతున్నాయని తెలుస్తోంది. పైకి మేయర్‌తో విభేదాలు ఉన్నట్లు కనిపించినా.... వాటాల పంపకంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో ఉంటారని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో రూ.107 కోట్ల అభివృద్ధి పనులు కార్పొరేషన్లో జరిగితే రూ.40 శాతం అవినీతి జరిగిందనేది అధికారులు, కార్పొరేటర్లే చెబుతున్నారు. ఇందులో సింహభాగం ఎమ్మెల్యేకు, ఆపై మేయర్‌కు, అధికార పార్టీ కార్పొరేటర్లకు కొద్ది మేర వాటాల పంపకం జరిగిందని తెలుస్తోంది. 2005లో రాష్ట్రపతి పర్యటన ‘అనంత’లో లేకపోయినా ఇక్కడికి వస్తారని సాకు చూపి 36వ డివిజన్లో రెండురోజుల్లో రూ.2 కోట్ల ఖర్చుపెట్టి నాసిరకమైన పనులు చేశారు. సొంతపార్టీ నేతల్లోనే అసంతృప్తజ్వాలలు టీడీపీలో జయరాంనాయుడు క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే వైఖరితో విభేదించి అవినీతిపై విమర్శలు చే స్తున్నారు. దీంతో బుల్లెట్ లింగమయ్య అనే వ్యక్తి ద్వారా తనను హత్య చేసేందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రయత్నించారని ఇటీవల జయరాం పోలీసులను కలిశారు. ఓ స్కార్పియో ఇవ్వడంతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తానని లింగమయ్యకు చౌదరి భరోసా ఇచ్చారని జయరాం చెబుతున్నారు. శాంతిస్థాపన కోసం ‘అవే’ను స్థాపించానని చెప్పే చౌదరి... రాజకీయంగా అడ్డొచ్చేవారిని అంతమెందించాలనుకోవడం దారుణమని విమర్శలు వచ్చాయి. ఎవరైనా తనను విమర్శించినా, అడ్డొచ్చినా వారి డివిజన్లపై చౌదరి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, లాలెప్ప, విద్యాసాగర్‌తో పాటు పలువురి కార్పొరేటర్లపై ఈ తరహా ధోరణి అవలంభించారు. ఇలా ‘అనంత’ అవినీతిలో నాలుగున్నరేళ్లుగా అడుగులు వేస్తూ వచ్చిన చౌదరి వ్యాఖ్యలు చూస్తుంటే ‘వేయిగొడ్లను తిన్న రాబంధు ఓ గాలివానకు నెలకూలిందన్నట్లు’ ప్రతీ పనిలో వాటాలు తీసుకునే చౌదరి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని విపక్షపార్టీ నేతలతో పాటు సొంతపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ ప్రభాకర్ చౌదరి
-
మేమింతే!
తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది. నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అధినేతకు ఫిర్యాదులతో బజారుకెక్కుతున్నారు. పెద్దదిక్కుగా వ్యవహరించాల్సిన మంత్రులే పోరుకు సారథ్యం వహిస్తున్నారు. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ జిల్లా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఇక టిక్కెట్లు దక్కవనే నైరాశ్యం కొందరు ఎమ్మెల్యేలను ఇంటికే పరిమితం చేస్తోంది. మొత్తంగా ‘తమ్ముళ్ల రాజకీయం’ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు చుక్కలు చూపుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోగా.. నేతల ఆధిపత్య పోరుతో పార్టీ పరువును దిగజారుస్తోంది. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ అగాథం నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత మూడున్నరేళ్లలో వీరిద్దరూ ఏమి చేశారనే ప్రశ్న వేసుకుంటే మౌనమే సమాధానమవుతోంది. కదిరిలో అత్తార్, కందికుంట ప్రసాద్ ఇప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. పెనుకొండలో బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్పల మధ్య ఆధిపత్య పోరు పార్టీ పునాదులను కుదిపేస్తోంది. రాయదుర్గం, తాడిపత్రి, పుట్టపర్తితో పాటు పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందనే విషయం తెలుసుకున్న చంద్రబాబు 8–10 నెలల కిందట నేతలందరినీ అమరావతికి పిలిపించి ‘క్లాస్’ తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం అనంతపురంలో ఎలా ఉందో ఎప్పటికప్పుడు తాను రిపోర్టులు తెప్పించుకుని పరిశీలిస్తున్నానని చెప్పి.. అప్పట్లో రిపోర్టులు బయటపెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీకి 20–30 శాతం లోపు నష్టం వాట్లిల్లితే.. కృష్ణా జిల్లాలో 56శాతం, గుంటూరులో 52శాతం నష్టం జరిగిందనే రిపోర్టలతో కంగారు పడ్డానన్నారు. ఇందుకు భిన్నంగా అనంతపురంలో పార్టీకి జరిగిన నష్టం 92శాతం ఉందనే రిపోర్టు తనను కలవర పర్చిందని ఆ సందర్భంగా నేతలపై సీఎం చిర్రుబుర్రులాడినట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ నాయకుల తీరులో మార్పు లేకపోవడం గమనార్హం. ‘అనంత’లో తారాస్థాయికి ఆధిపత్య పోరు 2019 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్టు దక్కకుండా చేసేందుకు జేసీ దివాకర్‌రెడ్డి మొదటి నుంచి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో గురునాథరెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశ చూపి టీడీపీలోకి తీసుకొచ్చారు. దీంతో పాటు తనవర్గం కార్పొరేటర్లతో మేయర్ స్వరూపను కూడా ఇబ్బంది పెట్టడుతున్నారు. ఫలితంగా ‘అనంత’లో టీడీపీ మూడు ముక్కలైంది. చౌదరికి టిక్కెట్టు రాకూడదని జేసీ వర్గీయులైన కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జయరాంనాయుడుతో పాటు మరికొందరు నేతలు ఇన్ని రోజులు పని చేశారు. ఇప్పుడు గురునాథ్‌రెడ్డి రూపంలో చౌదరికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ఆయనకు టిక్కెట్టుకు ఇస్తే ప్రభాకర్‌చౌదరి అసలు టీడీపీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మేయర్ కలిసి కార్పొరేషన్లో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని దివాకర్‌రెడ్డి ఏకంగా పలుసార్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. దివాకర్‌రెడ్డి వైఖరితో పార్టీకి నష్టం వాటిల్లుతోందని మేయర్, ఎమ్మెల్యే కూడా బాహాటంగానే విమర్శిస్తున్నారు. కదిరిలో రచ్చ...రచ్చ.. కదిరిలో వైఎస్సార్సీపీ నుంచి వలస వెళ్లిన చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంటప్రసాద్ల మధ్య వివాదం ముదిరిపాకన పడింది. అత్తార్ రాకను జీర్ణించుకోలేని కందికుంట, ఆయన వర్గం ప్రతీ అంశంలోనూ చాంద్‌బాషాను విభేదిస్తున్నారు. చాంద్‌బాషా కూడా టీడీపీ కేడర్‌తో సర్దుకునిపోలేక తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పర్చుకునేందుకు పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కదిరిలో మొదటి నుంచి టీడీపీ బలహీనంగా ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య విభేదాలతో మరింత బలహీనపడింది. కందికుంటకు చెక్‌బౌన్స్ కేసులో శిక్షపడటంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు విషయంలో తనకు పోటీ లేదని నేతలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చాంద్‌బాషా చేస్తున్నారు. కార్పొరేటర్స్థాయి కూడా లేని చాంద్‌బాషాను ఎమ్మెల్యేని చేస్తే పార్టీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారని, ఆయన్ను నమ్మి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చే ప్రసక్తే లేదని కందికుంట ప్రచారం చేస్తున్నారు. వరదాపురం వర్సెస్ పరిటాల ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల వర్గీయుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు మంత్రి సునీతతో వరదాపురం సూరి పూర్తిగా విభేదిస్తున్నారు. ఇరువర్గాల మధ్య ధర్మవరంలో పలుసార్లు ఘర్షణ కూడా జరిగింది. ఇద్దరినీ పిలిపించి సీఎం క్లాస్ తీసుకుంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా తీరు మారని పరిస్థితి. ఇటీవల మాల్యవంతంలో జాతరకు పరిటాల శ్రీరామ్ వెళ్లారు. ఇదే సమయంలో సూరితో పాటు బీకే పార్థసారథి వచ్చారు. ఇద్దరూ ఎదురుపడ్డా పలకరించుకోకుండా వెళ్లిపోయారు. ధర్మవరంలో సూరికి ఎలాగైనా చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో పరిటాల వర్గం వ్యూహం రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన ధర్మవరం, రాప్తాడులో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు ఏస్థాయిలోకి వెళతాయోనని అక్కడి జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. అన్నిచోట్లా ఇంతే.. రాయదుర్గంలో ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డిని మంత్రి కాలవ పూర్తిగా పక్కనపెట్టారు. ఎన్నికల్లో సహకరించిన పాపానికి కాలవ తనను పూర్తిగా పక్కనపెడుతున్నారని మెట్టు కూడా అసంతృప్తితో ఉన్నారు. దీపక్‌రెడ్డి, గోవిందరెడ్డి కలిసి ఇద్దరిలో ఎవరో ఒకరం టిక్కెట్టు తెచ్చుకుందాం.. కాలవకు మాత్రం రాకూడదనే రీతిలో పని చేస్తున్నట్లు సమాచారం. గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేసీ వర్గం సహకరించింది. ఈ సాన్నిహిత్యంతో కాలవకు వ్యతిరేకంగా ఇద్దరూ ఏకమయ్యారు. ఇది గ్రహించిన కాలవ విభేదాల మధ్య, కాపు రామచంద్రారెడ్డిపై గెలవడం కష్టమనే యోచనతో గుంతకల్లు బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మడకశిరలో ఎమ్మెల్యే ఈరన్నను పూర్తిగా పక్కనపెట్టి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇది ఈరన్న జీర్ణించుకోలేకపోతున్నారు. విభేదాల పరిస్థితి ఇలా ఉంటే మంత్రులతో పాటు చీఫ్‌విప్, విప్ అంతా కలిసి జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని టీడీపీ ప్రజాప్రతినిధులపై ‘అనంత’వాసుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీ, హెచ్చెల్సీ నీటి వాటాల్లో అలసత్వం, తదితర అంశాలతో పాటు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం ఆలోచన లేదని, నేతలు ఆర్థికంగా ఎదగడం మినహా ఇంకేదీ లేదనే బాధ ప్రజల్లో కనిపిస్తోంది. -
గుర్నాథ్ రెడ్డిపై ప్రభాకర్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరికపై అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రభాకర్ చౌదరి మీడియా చిట్ చాట్‌లో పాల్గొన్నారు. 'అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే గుర్నాథ్ రెడ్డి టీడీపీలోకి వస్తున్నారు. ఆయనది అవకాశవాద రాజకీయం. కబ్జాలు.. హత్యలే ఆయన చరిత్ర. ఆయన మా ప్రత్యర్థి.. ఇపుడు మేము ఎవరితో పోరాడాలి. గతంలో కొంత మంది టీడీపీ నేతలపై చెప్పులు వేయించాడు. జేసీ తప్ప ఆయన చేరికను ఎవరు స్వాగతించడం లేదు. చంద్రబాబు పక్కన నిలబడటానికి కూడా గుర్నాథ్ రెడ్డి సరిపోడు. ఆయన చేరిక కార్యక్రమంలో కూడా నేను హాజరు కాను.. పక్కన నిలబడి ఫొటో దిగేందుకు కూడా నేను ఇష్టపడను. ఇన్ని సంవత్సరాలుగా అసెంబ్లీకి వస్తున్నా.. ఒక గంట కూడా సమావేశాలను మిస్ కాలేదు. కానీ నిన్న(బుధవారం) అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే వెళ్లిపోయాను. నిఖార్సుగా ఉంటే లాభం లేదని అర్థమవుతోంది' అని ప్రభాకర్ చౌదరి మీడియాతో తెలిపారు. చంద్రబాబుతో అత్యవసర భేటీ గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరిక నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి బుధవారం చంద్రబాబు నాయుడుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అవకాశవాది అయిన ఆయన వస్తే పార్టీలో జరగబోయే పరిణామాలపై ప్రభాకర చౌదరి అధినేతకు వివరించినట్టు సమాచారం. అయితే పార్టీ బలోపేతం చేయాలనే గుర్నాథ్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. 2019 వరకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగానే ఆలోచన చేయాలని ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. -
'రూ. 10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు'
అనంతపురం/కడప: టీడీపీలో కష్టపడ్డవారికి అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్ ఆరోపించారు. రూ. 5 నుంచి రూ. 10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారని అన్నారు. డబ్బు ప్రాతిపదికన టికెట్లు ఇస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అనంతపురంలో కార్యకర్తలతో సమావేశమైయ్యారు. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా సుమారు రూ.120కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు టికెట్లు ఇవ్వమంటే ఎలా అని వాపోయారు. సూట్‌కేసులు మోసినవారికే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారని, తమకు అన్యాయం జరిగితే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామని ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. కడప జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రొద్దుటూరు సీటు ఇవ్వకపోతే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు ఆయన సిద్దపడుతున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలోనూ వివాదం రేగింది. మహిళలకు ఒక్క సీటే కేటాయించడంపై తెలుగు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడితో పాటు మరో స్థానాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.