నీ ఇష్టమొచ్చినోడికి చెప్పుకో !  | TDP Leader Gave Warning To Government Officers About Land Issue In Anantapur | Sakshi
Sakshi News home page

నీ ఇష్టమొచ్చినోడికి చెప్పుకో ! 

Published Sun, Aug 18 2019 7:53 AM | Last Updated on Sun, Aug 18 2019 12:08 PM

TDP Leader Gave Warning To Government Officers About Land Issue  In Anantapur  - Sakshi

సాక్షి, అనంతపురం : నగరంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అనుచరుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గత ప్రభుత్వంలో చిరుద్యోగుల నుంచి కమిషనర్‌ స్థాయి అధికారులను సైతం చౌదరి అనుచరులు లెక్కచేయకుండా దాడులకు యత్నించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం తెలిసిందే. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కోవలోనే టౌన్‌ బ్యాంకు అధ్యక్షుడు జేఎల్‌ మురళీధర్‌ టీపీఎస్‌ సాయిప్రసాద్‌ను నడిరోడ్డుపై బండబూతులు తిట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల టీడీపీ నేత వ్యవహరించిన తీరు చూస్తే అధికారంలో ఉండగా ఏ స్థాయిలో పెత్తనం చెలాయించారో అర్థమవుతోంది. 

ఆగని ఆగడాలు 
నగరపాలక సంస్థ అధికారులు టీడీపీ నాయకుల దౌర్జన్యాలతో భయాందోళనకు గురవుతున్నారు. టౌన్‌ బ్యాంకు అధ్యక్షుడు జేఎల్‌ మురళీధర్‌ టీపీఎస్‌ సాయిప్రసాద్‌పై నోరు పారేసుకున్నాడు. అదే విధంగా 27వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సరిపూటి రమణ జీసస్‌నగర్‌లో టీడీపీ కార్యాలయం పేరిట తన కారు పార్కింగ్‌ ఏర్పాటు చేశాడు. దీనిపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్కడికి వెళితే.. అక్రమ కట్టడాలన్నింటికీ కొలతలు వేసి మా వద్దకు రావాలని దురుసుగా సమాధానమివ్వడం గమనార్హం. ఇంకా నగరంలో టీడీపీ చోటామోటా నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పోలీసులు అధికారులను వేధిస్తున్న ఘటనలూ కోకొల్లలు. జిల్లా ఎస్పీ స్పందించి ఇలాంటి నేతలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.  

టీడీపీ నేత బూతుపురాణం 
టీపీఎస్‌ సాయిప్రసాద్‌ : అన్నా.. వంకలో నిర్మాణం చేపట్టకూడదు. 
జేఎల్‌ మురళి : ‘నా స్థలాన్ని వంకంటావా? నువ్వెవడయ్యా. ల..బాల్‌గాడివి. నా గురించి తెలుసుకో ఫస్ట్‌ నీవు. వంకంటావా. ఏమనుకున్నావ్‌. నాకు మెంటల్‌ తేవద్దు. పోవయ్యా నీకిష్టమొచ్చినోనికి చెప్పుకో. నా దగ్గర గాన్నకరాలు చేస్తావా? నా పని ఆపు చేయిస్తావా? గు..పగలకొడుతా. ఏం పేరు నీ పేరు. ఏమనుకున్నావ్‌. నీ కథలు నా దగ్గర పడద్దు చెబుతున్నా. 
టీపీఎస్‌ సాయిప్రసాద్‌ : ఏసీపీ ఇసాక్‌ సార్‌  చెబితేనే వచ్చాం. 
జేఎల్‌ మురళి : అతి చేయొద్దు. (వెంటనే ఏసీపీ ఇస్సాక్‌కు ఫోన్‌ చేసి) నేను మురళి అన్నా. కాదు వంక గింక అంటున్నాడేంది నా సైట్‌ని. వీఎల్‌టీ కోసం రామ్మోహన్‌కు పంపిస్తా.  చూడు. నీకు ఇబ్బంది లేదు. నీకేమున్నా నాకు చెప్పు. కాదు ఇతనెవరు సాయిప్రసాద్‌.. చాలా టూమచ్‌ చేస్తున్నాడు..
టీపీఎస్‌ సాయిప్రసాద్‌ : అన్నా.. వంకలో నిర్మాణం చేపట్టకూడదు. 
జేఎల్‌ మురళి :  ‘నా స్థలాన్ని వంకంటావా? నువ్వెవడయ్యా. ల..బాల్‌గాడివి. నా గురించి తెలుసుకో ఫస్ట్‌ నీవు. వంకంటావా. ఏమనుకున్నావ్‌. నాకు మెంటల్‌ తేవద్దు. పోవయ్యా నీకిష్టమొచ్చినోనికి చెప్పుకో. నా దగ్గర గాన్నకరాలు చేస్తావా? నా పని ఆపు చేయిస్తావా? గు..పగలకొడుతా. ఏం పేరు నీ పేరు. ఏమనుకున్నావ్‌. నీ కథలు నా దగ్గర పడద్దు చెబుతున్నా. 
టీపీఎస్‌ సాయిప్రసాద్‌ : ఏసీపీ ఇసాక్‌ సార్‌     చెబితేనే వచ్చాం. 
జేఎల్‌ మురళి : అతి చేయొద్దు. (వెంటనే ఏసీపీ ఇస్సాక్‌కు ఫోన్‌ చేసి) నేను మురళి అన్నా. కాదు వంక గింక అంటున్నాడేంది నా సైట్‌ని. వీఎల్‌టీ కోసం రామ్మోహన్‌కు పంపిస్తా.  చూడు. నీకు ఇబ్బంది లేదు. నీకేమున్నా నాకు చెప్పు. కాదు ఇతనెవరు సాయిప్రసాద్‌.. చాలా టూమచ్‌ చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement