
సాక్షి, అనంతపురం: అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం ముదురుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ పవన్‌రెడ్డి కార్యక్రమాలు చేపట్టడంతో.. తన అనుమతి లేకుండా ఎందుకు పర్యటిస్తున్నారంటూ ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ పవన్‌రెడ్డిని ఆయన ఓ శకునిగా అభివర్ణించారు. తాడిపత్రిలో టీడీపీని నాశనం చేశారని.. ఇప్పుడు అనంతపురం నియోజకవర్గంలో టీడీపీని డ్యామేజ్ చేసేందుకు తిరుగుతున్నారని జేసీ పవన్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ పవన్ నియంతలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జేసీ దివాకర్‌రెడ్డి వర్గంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమంటూ ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. (చదవండి: జేసీ దివాకర్‌రెడ్డికి 100 కోట్ల జరిమానా)
Comments
Please login to add a commentAdd a comment