JC Pawan Kumar Reddy
-
జేసీ పవన్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి
సాక్షి, అనంతపురం: అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం ముదురుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ పవన్‌రెడ్డి కార్యక్రమాలు చేపట్టడంతో.. తన అనుమతి లేకుండా ఎందుకు పర్యటిస్తున్నారంటూ ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ పవన్‌రెడ్డిని ఆయన ఓ శకునిగా అభివర్ణించారు. తాడిపత్రిలో టీడీపీని నాశనం చేశారని.. ఇప్పుడు అనంతపురం నియోజకవర్గంలో టీడీపీని డ్యామేజ్ చేసేందుకు తిరుగుతున్నారని జేసీ పవన్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ పవన్ నియంతలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జేసీ దివాకర్‌రెడ్డి వర్గంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమంటూ ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. (చదవండి: జేసీ దివాకర్‌రెడ్డికి 100 కోట్ల జరిమానా) -
జేసీ పవన్‌ను ముందుగానే హెచ్చరించాం
సాక్షి, తాడిపత్రి: శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసుల వాహన శ్రేణి కవాతుతో పాటు, ఏరియా డామినేషన్ పెట్రోలింగ్‌ను నిర్వహించారు. ఈ వాహన శ్రేణి స్థానిక గాంధీ సర్కిల్ వద్దకు చేరుకున్న అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణంలోకి రాకూడదన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..) ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ పవన్‌కు ముందుగానే తాము హెచ్చరికలు జారీ చేసినా వాటిని పెడచెవిన పెట్టిన కారణంగానే కడపలో నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్.కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డిలపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తాడిపత్రి పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు నమోదు చేశామన్నారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నావ్!
సాక్షి, గుంతకల్లు: ‘‘ఎన్నికలప్పుడు వస్తారు. అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ నమ్మిస్తారు. చేసిందేమీ లేదు. ఐదేళ్లుగా తాగునీళ్లివ్వమని అడుగుతున్నాం. ఒక్కరూ పట్టించుకోలేదే. ఉమామహేశ్వరనగర్, కాల్వగడ్డ, గంగానగర్ తదితర ప్రాంతాల్లో తాగునీళ్లు రావడం లేదు. నెలనెలా కుళాయి, ఇంటి గుత్తలు సక్రమంగా కడుతున్నాం. అయినా నీళ్లు ఇవ్వడం లేదు. ఎండాకాలం మా పరిస్థితి దేవునికే తెలుసు. రోజూ నీళ్లకే రూ.50 దాకా ఖర్చవుతోంది. ఇవన్నీ మీకు పట్టవు.. ఇప్పుడు ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకుని వచ్చారు.’’ అంటూ మహిళలు టీడీపీ పాలనను తూర్పారబట్టారు. దీంతో అట్టహాసంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి బిక్కచచ్చిపోయారు. మంగళవారం ఆయన గుంతకల్లు పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. హనుమేష్‌నగర్‌లో పర్యటిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీయగా.. జేసీ పవన్ నీళ్లు నమిలారు. ఏడాది కాలంగా అనంతపురం పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామంటూ అక్కడి నుంచి జారుకున్నారు. ఏనాడూ మా కాలనీకి రాలేదు .. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ 2014 ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చారు. గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఏనాడూ మా కాలనీకి రాలేదు. మా సమస్యలు విన్నదీ లేదు. 2019 ఎన్నికలు రావడంతో మీ సమస్యలు పరిష్కారం చేస్తామంటూ రావడం నవ్వులాటగా ఉంది. – శోభ, సీఐటీయూ కాలనీ -
నీయబ్బ.. ఎవరనుకున్నావ్.. అంతుచూస్తా: జేసీ పవన్
అనంతపురం, గుంతకల్లు రూరల్: ‘నీయబ్బ .. ఎవరనుకున్నావు నన్ను.. నీఅంతు చూస్తా.. డబ్బు నాది, మినరల్ వాటర్ ప్లాంట్ నాది అడగడానికి నువ్వెవరూ’ అంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి మాజీ సర్పంచ్‌పై దూషణలకు దిగాడు. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు మండలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో దంచెర్ల ఒకటి. ఒక్కగానొక్క బోరులో వచ్చే అరకొర నీటితోనే గ్రామస్తులు తమ అవసరాలను తీర్చుకునేవారు. ఈక్రమంలో గత ప్రభుత్వ హయాంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం గది నిర్మించారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరులో అంతంత మాత్రంగా నీరు ఉండటం, అదే బోరు నుంచి శుద్ధజల ప్లాంట్‌కు నీటిని సరఫరా చేస్తే బోరు అడుగంటిపోయి గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఏర్పడుతుందనే ఉద్దేంతో గ్రామస్తులందరూ కలిసి మినరల్ వాటర్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా ఒక బోరును వేయాలని కోరారు. అందుకు అనుగుణంగా పైప్‌లైన్ ఏర్పాటు కూడా చేపట్టాల్సి రావడం అదే సమయంలో ఎన్నికలు కూడా దగ్గర పడటంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామస్తులు వాటర్ ప్లాంట్ ఏర్పాటుపై అడుగుతూనే వస్తున్నారు. అడిగిన ప్రతిసారీ అదిగో ఇదిగో అంటూ నాయకులు కాలం గడిపారు. బోరు, పైప్‌లైన్ లేకుండా ప్లాంట్ ప్రారంభం రెండు నెలల క్రితం గ్రామంలో పర్యటించిన జేసీ పవన్‌కు గ్రామస్తులు వాటర్‌ప్లాంట్ సమస్యను వివరించారు. ఎన్నికలలోపే ప్లాంట్ ఏర్పాటుచేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. అయితే బోరు, పైప్‌లైన్ ఏర్పాటుచేయకుండా రెండు రోజుల క్రితం మిషనరీ బిగించి ప్లాంట్‌ను సిద్ధం చేశారు. ఈమేరకు గురువారం జేసీ పవన్‌రెడ్డి ప్లాంట్‌ను ప్రారంభించేందుకు వచ్చారు. ఈసందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అనంతయ్య గ్రామస్తులతో కలిసి కొత్తబోరు, పైప్‌లైన్ వేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్ మాజీ సర్పంచ్ అన్న గౌరవం లేకుండా దూషణలకు దిగాడు. మాజీ సర్పంచ్ అనంతయ్య మర్యాదగా మాట్లాడాలని చెప్పినప్పటికీ జేసీ పవన్ తగ్గకపోవడంతో గ్రామస్తులందరూ అనంతయ్యకు మద్దతు పలికారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటే అవసరం లేదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని మూకుమ్మడిగా తిరగబడ్డారు. దీంతో జేసీ పవన్ అక్కడి నుంచి తిరుగుముఖం పట్టాడు. పైప్‌లైన్ వేయాలని అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడాడు.. వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తామంటే గ్రామంలోని ప్రజలందరూ స్వాగతించాం. కానీ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా బోరు వేస్తే తప్ప ఫలితం ఉండదని లేకపోతే గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఏర్పడుతుందని చెప్పాం. అందుకు సరే అన్నారు. ఎన్నికల కోడ్ రాబోతున్న తరుణంలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వాటర్‌ప్లాంట్ హడావుడిగా సిద్ధం చేసి ప్రస్తుతం అంతంత మాత్రంగా నీరు ఉన్న అదే బోరునుంచి ప్లాంట్‌కు నీటి సరఫరా అందించారు. అయినప్పటికీ మేము ఏమీ అనలేదు. కనీసం ప్రారంభోత్సవం అయిన వెంటనే బోరు, పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అడిగినందుకు దుర్భాషలాడాడు. – అనంతయ్య, వైఎస్సార్సీపీసీనీయర్ నాయకుడు,దంచెర్ల మాజీ సర్పంచ్ -
జేసీ తనయుడి దురుసు ప్రవర్తన
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామంలో పర్యటించిన ఆయన్ని గ్రామస్తులు సమస్యలపై నిలదీశారు. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని, నాలుగున్నరేళ్లలో నెరవేర్చని హామీలు 4 నెలల్లో ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ రెడ్డి వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. సహనం కోల్పోయి ఎవరికో ఓట్లు వేసి మమ్మల్ని అడుగుతే ఎలా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. తను చెప్పింది మాత్రమే వినాలంటు హెచ్చరించారు. పవన్ రెడ్డి తీరుపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ విభేదాలకు జేసీ పవన్ ఆజ్యం
వర్గ విభేదాలతో అనంతపురంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కొందరు నేతల ‘వ్యతిరేక రాజకీయం’తో నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత ముదురుతోంది. పార్టీ శ్రేయస్సును పక్కనపెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండటంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జేసీ పవన్ కొరకరాని కొయ్యలా మారడం పార్టీలో కలకలం రేపుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన జేసీ ఫ్యామిలీ 2014లో టీడీపీలోకి వలస వెళ్లింది. ఇన్నాళ్లూ తాడిపత్రి వరకే జేసీ ఫ్యామిలీ పరిమితమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీగా, సోదరుడు ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఒకే ఇంటిలో రెండు పదవులు వచ్చినట్లయింది. ఇప్పటి వరకూ ‘అనంత’ టీడీపీలో ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇచ్చిన దాఖలాల్లేవు. వచ్చే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాలకు స్వస్తి చెప్పి తనయులను రంగంలోకి దించాలనే పథక రచన చేశారు. ఇందులో భాగంగానే తాడిపత్రిలో ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డి, పార్లమెంట్ పరిధిలో పవన్‌రెడ్డి పర్యటనలు సాగిస్తున్నారు. ఈ పర్యటనలకు తెలుగుదేశం పార్టీ పాత నేతల మద్దతు దక్కడం లేదు. అంతా ‘జేసీ ఫ్యామిలీ’ని వ్యతిరేకిస్తున్నారు. అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో జేసీ పవన్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని సొంత పంథాలో రాజకీయం చేస్తున్నారు. మిగిలిన తాడిపత్రి, ఉరవకొండ. తాడిపత్రిలో పవన్ సోదరుడే పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ జోక్యం చేసుకోవల్సిన పనిలేకుండాపోయింది. తక్కిన ఉరవకొండలో చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ జేసీ దివాకర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పలు సందర్భాల్లో కేశవ్‌ను జేసీ సమర్థించారు. దీనికి తోడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేశవ్ అనుచరుడు ఉమామహేశ్వరనాయుడుకు టిక్కెట్టు ఇప్పించాలనిఇద్దరూ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇరువర్గాల సాన్నిహిత్యంతో ఉరవకొండలో పవన్ అడుగు పెట్టలేదు. తక్కిన అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటించాడు. ఇందులో గుంతకల్లు, శింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గం సిట్టింగ్‌లను మార్చాలనే ప్రతిపాదనను కూడా సీఎం ముందు జేసీ పెట్టినట్లు ఆ పార్టీలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ పరిధిలో బలహీనపడిన టీడీపీ జేసీ పవన్ తీరుపై సిట్టింగ్‌లు ఓ గ్రూపుగా తయారై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణలు, ఇతరత్రా అంశాలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ క్రమంలో పవన్ సిట్టింగ్‌ల వ్యతిరేకులతో రాజకీయం చేస్తుండటంతో రెండు వర్గాల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఇందులో ఏ వర్గానికి టిక్కెట్టు ఇచ్చినా మరో వర్గం సహకరించని పరిస్థితి. టీడీపీ ఆవిర్భావం నుంచి ‘అనంత’ పార్లమెంట్లో ఆ పార్టీ బలహీనంగానే ఉంది. 2014లో మాత్రమే మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. అయితే సిట్టింగ్‌ల వైఖరి, జేసీ పవన్ అనుసరిస్తున్న తీరుతో టీడీపీ తిరిగి బలహీనపడింది. ఇదే అదనుగా ఆయా నియోజకవర్గాల్లో విపక్ష పార్టీ పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ సీట్లు విపక్ష పార్టీయే గెలవచ్చని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించడం కొసమెరుపు. నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి.. ♦ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని విట్లంపల్లి, ఉలికల్లు, గూబనపల్లి, మల్లిఖార్జునపల్లి, బోరంపల్లి, గోళ్ల, బాల వెంకటాపురం, కడదరకుంట తదితర గ్రామాల్లో జేసీ పవన్ ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ఎక్కడా పాల్గొనలేదు. పైగా చౌదరిని వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీపీ మల్లిఖార్జున, మునిసిపల్ మాజీ చైర్మన్ వైటీ రమేశ్, పురుషోత్తం లాంటి నేతలను పవన్ వెంటబెట్టుకుని పర్యటించారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు మారుతికి పవన్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ‘అన్నా! మీరు లేకుండా సొంతంగా నియోజకవర్గంలో తిరిగితే ఎవరు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యతిరేకత ఉంది? అనే అంశాలు తెలుస్తాయి. దాన్నిబట్టి మనం మార్పులతో ముందుకెళ్లొచ్చు. మరో రకంగా అనుకోవద్దు’ అని చెప్పినట్లు సమాచారం. ♦ అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పార్టీలోనే ఉంటూనే జేసీ కుటుంబంతో పోరు సాగిస్తున్నారు. ఇఫ్తార్ విందుతో పాటు పవన్ చేసిన ఏ కార్యక్రమానికీ చౌదరి హాజరుకాలేదు. ఇక్కడ పవన్‌కు ఎలాంటి సహకారం లేదు. కోగటం విజయభాస్కర్‌రెడ్డి కూడా దూరమవడంతో నియోజకవర్గంలో జేసీకి వర్గమంటూ కరువైంది. కేవలం ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా జయరాంనాయుడు ఒక్కడే పవన్‌కు దగ్గరవుతున్నాడు. పవన్ వైఖరితో ఇతను కూడా చాలారోజుల నుంచి దూరంగా ఉంటున్నట్లు టీడీపీలో ప్రచారం నడుస్తోంది. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి జేసీ వర్గంలో కొనసాగుతున్నా, అహుడా చైర్మన్‌గిరి దక్కకపోవడంతో టీడీపీలో జేసీ ప్రభావం ఆశించినస్థాయిలో లేదని వారు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ♦ గుంతకల్లులో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పవన్‌తో ఎక్కడా వేదిక పంచుకోలేదు. ఈ నియోజకవర్గంలో కూడా గౌడ్ వ్యతిరేకవర్గీయులతో పవన్ రాజకీయం చేస్తున్నారు. పైగా మధుసూదన్ గుప్తాకు టీడీపీ టిక్కెట్టు ఇప్పించేందుకు జేసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో చేరకుండానే గుప్తా ‘అనంత’లో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్నారు. ♦ రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులకూ జేసీ పోరు తప్పలేదు. ఇక్కడ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అండతో పవన్ సొంతంగా ఓ వర్గాన్ని పోగు చేసే యత్నం చేస్తున్నారు. దీపక్‌రెడ్డి కూడా ప్రభుత్వాన్ని, మంత్రి పనితీరుపై ఇటీవల పలు వేదికల్లో విమర్శలు గుప్పించారు. ♦ శింగనమల నియోజకవర్గంలో పవన్‌ను శమంతకమణి, యామినీబాల కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ తనకంటూ ఓ వర్గం ఉండాలని వారి వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారు. -
రాజకీయ క్రీ'నీ'డ
మొన్న పరిటాల శ్రీరాం అనుచరులు...ఇప్పుడు జేసీ పవన్ కుమార్‌రెడ్డి...టీడీపీ నేతల జోక్యంతో క్రీడారంగం తరచూ వివాదాస్పదమవుతోంది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో శ్రీరాం అస్మదీయులు తెరపైకి వస్తే....ఒలింపిక్ అసోసియేషన్ నిధులు అక్రమంగా డ్రా చేశారని జేసీ పవన్ కుమార్‌రెడ్డిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో క్రిమినల్, సివిల్ కేసులు కూడా పెట్టారు. తాజా పరిణామాలు ‘అనంత’ క్రీడారంగంలో కలకలం రేపుతున్నాయి. సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు, మురళీకృష్ణలు పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా మెలుగుతున్నారు. శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. అలాగే న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్‌లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. తెరపైకి జేసీ పవన్ ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. దీంతో పవన్ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్‌తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ‘అనంత’ పరువుకు భంగం సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో ‘అనంత’ వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంత పరువుకు భంగం వాటిల్లుతోంది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్, క్రికెట్‌తో పాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి వచ్చినవేకాకుండా...ఇంకా అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్‌లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు -
రాజకీయ క్రీనీడ
జిల్లాలో క్రీడా మాఫియా ♦ సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడోల్లో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం ♦ ఇద్దరు నిందితులకు పరిటాల శ్రీరాం అండదండలు ♦ ఒలింపిక్ సంఘం నిధులు డ్రా చేశారని జేసీ పవన్‌పై కేసు ♦ జడ్జి, ఎస్పీ కుమారులకు కూడా నకిలీ సర్టిఫికెట్లు! మొన్న పరిటాల శ్రీరాం అనుచరులు...ఇప్పుడు జేసీ పవన్ కుమార్‌రెడ్డి...టీడీపీ నేతల జోక్యంతో క్రీడారంగం తరచూ వివాదాస్పదమవుతోంది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో శ్రీరాం అస్మదీయులు తెరపైకి వస్తే....ఒలింపిక్ అసోసియేషన్ నిధులు అక్రమంగా డ్రా చేశారని జేసీ పవన్ కుమార్‌రెడ్డిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో క్రిమినల్, సివిల్ కేసులు కూడా పెట్టారు. తాజా పరిణామాలు ‘అనంత’ క్రీడారంగంలో కలకలం రేపుతున్నాయి. – సాక్షిప్రతినిధి, అనంతపురం సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు, మురళీకృష్ణలు పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా మెలుగుతున్నారు. శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. అలాగే న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్‌లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. తెరపైకి జేసీ పవన్ ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. దీంతో పవన్ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్‌తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ‘అనంత’ పరువుకు భంగం సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో ‘అనంత’ వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంత పరువుకు భంగం వాటిల్లుతోంది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్, క్రికెట్‌తో పాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి వచ్చినవేకాకుండా...ఇంకా అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్‌లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
జేసీ పవన్, అస్మిత్‌రెడ్డిలపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు
అనంతపురం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి జేసీ దివాకరరెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలపై తాడిపత్రి మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2009 ఏప్రిల్ 24న తెలుగుదేశం పార్టీకి చెందిన కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేసి వస్తువుల్ని దహనం చేశారని తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 14 మందితో పాటా పవన్‌కుమార్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలు కూడా నిందితులు. అదే సమయంలో నమోదైన మరో కేసు లోనూ వీరిద్దరి పేర్లను తొలుత చేర్చి తరువాత తొలగించారు. ఈ విధంగానే ఇంటిపై దాడి కేసులోనూ పేర్లు తొలగించాలని వారు హోం మంత్రికి అర్జీ పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ కోర్డు విచారణ నివేదిక ఆధారంగా వారి పేర్లను తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితులు గుత్తి సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. గుత్తి సెషన్స్ కోర్టు నిందితుల పేర్లు తొలగించరాదని తీర్పు వచ్చింది. దీనిపై నిందితులిద్దరూ హైకోర్టును ఆశ్రయించి 2013లో స్టే తెచ్చుకున్నారు. 2014 ఏప్రిల్ 4న స్టే తొలగించడంతో సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ తిరిగి గురువారం నిందితుల జాబితాలో చేర్చి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ పవన్, అస్మిత్‌లను అరెస్ట్ చేయడానికి వారి ఇంటి వద్దకు వెళ్లగా, వారు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.