సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామంలో పర్యటించిన ఆయన్ని గ్రామస్తులు సమస్యలపై నిలదీశారు. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని, నాలుగున్నరేళ్లలో నెరవేర్చని హామీలు 4 నెలల్లో ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ రెడ్డి వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. సహనం కోల్పోయి ఎవరికో ఓట్లు వేసి మమ్మల్ని అడుగుతే ఎలా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. తను చెప్పింది మాత్రమే వినాలంటు హెచ్చరించారు. పవన్ రెడ్డి తీరుపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment