
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
అనంతపురం జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , టీడీపీ నేతలకు ప్రధానమంత్రి పై తిరగబడండి అని చెప్పడం చూస్తుంటే ఎంత నీచ స్థితికి దిగజారాడో అర్థం అవుతుందని..అసలు ప్రధానమంత్రి పైకాదు..ప్రజలే చంద్రబాబు పై తిరగబడే రోజు దగ్గర్లో ఉందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలో బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ఆంద్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు.
అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ తనవల్ల వచ్చిదని చెప్పుకుంటున్నాడని, కానీ ఇది ప్రధాన మంత్రి గారి వల్ల వచ్చిందే తప్ప చంద్రబాబు వల్ల కాదని అన్నారు. ఆంద్రప్రదేశ్‌కు కడప ఉక్కు పరిశ్రమ రావాలన్నా, విశాఖకు రైల్వే జోన్ రావాలన్నా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు సంబంధించి నిధులు రావాలన్న ఒక్క ప్రధానమంత్రితోనే సాధ్యమవుతుంది తప్ప..అవినీతి చంద్రబాబు వల్ల కాదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment