
వైవిధ్యభరితంగా 143
తమిళసినిమా: ఈ తరం యువతకు 143 అంటే తెలియకుండా ఉండదు. ఐలవ్యూకు ప్రేమికుల సంకేతం 143. దీన్ని ఈ తరం దర్శకులు చిత్ర టైటిల్‌గా వాడుకోవచ్చని భావించకపోవడం విశేషమే. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఒక చిత్రం తయారవుతోంది. నవ నటుడు రిషీ కథానాయకుడిగా పరిచయం అవుతూ స్వీయ దర్శకత్వంలో రూపొం దిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా ప్రియాంక వర్ష, నక్షత్ర నటిస్తున్నారు.
ఐ టాకీస్ పతాకంపై సతీష్ చంద్ర పాలట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌భాస్కర్ సంగీతాన్ని, రాజేశ్.జేకే ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శక హీరో తెలుపుతూ వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా 143 ఉంటుందన్నారు. అమావాస్య రోజున పుట్టిన అబ్బాయి, పౌర్ణమి రోజున పుట్టిన అమ్మాయి ప్రేమించుకుంటారన్నారు. వీరి ప్రేమకు ఒక విలన్ ఉంటాడన్నారు. మరి విరుద్ధమైన రోజుల్లో పుట్టిన ఈ ప్రేమ జంట ఒకటవుతారా? లేదా?అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథా చిత్రమే 143 అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శక కథానాయకుడు రిషీ తెలిపారు.