

ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో కొంతమంది సోసల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తళుక్కున మెరిశారు.

అలా ఓ సీన్లో యూట్యూబర్, నటి వర్ష డిసౌజ మెరిసింది.

సినిమా ప్రారంభంలో హీరోని చూసి ఇష్టపడే అమ్మాయిగా, అతడిని సరదాగా ఆటపట్టించే అమ్మాయిల్లో ఒకరిగా వర్ష నటించింది.

ఆ ఒక్క సీన్ లోనే కాసేపు అలరించింది.

ఈ బ్యూటీ ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వర్ష.. క్లాస్మేట్స్, బ్యాక్ బెంచర్స్ వంటి సిరీస్‌లతో జనాలకు దగ్గరైంది. ప్రస్తుతం 'హే అంజలి' అనే సిరీస్ చేస్తోంది.




















