pournami
-
మహాకుంభమేళాలో తదుపరి పవిత్ర స్నానం ఎప్పుడు?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు (బుధవారం) భక్తులు మాఘపౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నాటికి 1.20 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి పుణ్య స్నానాల సందర్భంగా కుంభమేళా అధికారులు హెలికాప్టర్లో భక్తులపై పుష్పవర్షం కురిపించారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఈరోజు సుమారు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకూ మూడు అమృత స్నానాలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి పుణ్య స్నానం ఎప్పుడనే సందేహం చాలామందిలో ఉంది. #WATCH | 'Pushp varsha' or showering of flower petals being done on devotees and ascetics as they take holy dip in Sangam waters on the auspicious occasion of Maghi Purnima during the ongoing #MahaKumbh2025 in Prayagraj. #KumbhOfTogetherness pic.twitter.com/FC1C2uetnb— ANI (@ANI) February 12, 2025కుంభమేళా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26న తదుపరి పవిత్ర స్నానాలు ఉండనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడం విశేషం. శివుని భక్తులు ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అదేరోజున కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు శివభక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శివరాత్రి రోజున కుంభమేళాకు లెక్కకుమించినంతమంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో నేడు మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ నేపధ్యంలో కుంభమేళా అధికారులు ప్రయాగ్‌రాజ్ నగరంలోనికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మాఘపౌర్ణమి వేళ మూడు నుంచి కోట్ల నాలుగు కోట్లమంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు త్రివేణీ సంగమానికి తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. #WATCH प्रयागराज, यूपी: माघपूर्णिमा के अवसर पर चांद पूरा दिखा। पवित्र स्नान के लिए त्रिवेणी संगम पर श्रद्धालु पहुंच रहे हैं।#MahaKumbh2025 pic.twitter.com/W9s7csNnim— ANI_HindiNews (@AHindinews) February 12, 2025మాఘపౌర్ణమి ఏర్పాట్ల గురించి కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ ఈరోజు(బుధవారం) మాఘపౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తరలివస్తున్నారు. భారీసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ స్నానాలు ఈ రోజంతా కొనసాగనున్నాయన్నారు. #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए त्रिवेणी संगम पर महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची। #MahaKumbh2025 pic.twitter.com/iA38Vex2Ta— ANI_HindiNews (@AHindinews) February 11, 2025మహాకుంభమేళాకు ఈరోజు 31వ రోజు. ఈరోజున ఐదవ పవిత్ర స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడునా ఉన్నారని, వారు ఎటువంటి వరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు.కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్యశిబిరాలలోని సిబ్బంది మాట్లాడుతూ ఇక్కడ 30 మంది నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని, 500కు పైగా నర్సింగ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కుంభమేళా జరిగే ప్రాంతాన్నంతటినీ నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. దీంతో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతులు కల్పించారు. బయటి నుంచి వచ్చే ఏ వాహనాలను కూడా నగరంలోనికి అనుమతించడం లేదు. #WATCH| #MahaKumbh2025 | प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर महाकुंभ में श्रद्धालु स्नान के लिए पहुंच रहे हैं। ड्रोन वीडियो त्रिवेणी संगम से है। pic.twitter.com/U0mD6gCp5m— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్ #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए श्रद्धालुओं की भारी भीड़ अरैल घाट पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/3g08taJquH— ANI_HindiNews (@AHindinews) February 11, 2025 -
Kartik Purnima: వారణాసి, అయోధ్యలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు(నవంబర్ 15) కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిత్ర పుణ్యదినాన ఉత్తరాదినగల గంగా ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వారణాసి, అయోధ్యలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నదుల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.యూపీలోని అయోధ్యలోని సరయూ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Uttar Pradesh: A huge crowd of devotees arrive in Varanasi to take holy dip in the Ganga River, on the occasion of Kartik Purnima. pic.twitter.com/dosN2SHqNN— ANI (@ANI) November 15, 2024ఇదేవిధంగా యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగా ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ రోజున వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు కార్తీక పూర్ణిమ, గురునానక్ దేవ్ల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు దక్కాలని ఆకాంక్షించారు. గురునానక్ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, యోగి, దేశభక్తుడని ఆయన కొనియాడారు. సమాజంలోని మూఢనమ్మకాలు, కులతత్వాన్ని తొలగించేందుకు గురునానక్ కృషి చేశారని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
నేడు పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుపతి: తిరుమలలో మంగళవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా మంగళవారం పౌర్ణమి గరుడసేవ ఉండదని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తెలిపింది. నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో అభివృద్ధి పనులతో పాటు మరిన్ని అంశాలపై పాలకమండలి చర్చించనుంది. ఈ సమావేశానికి టీటీడీ బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తి ఈ నెల 23 నుంచి 2024, జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్ల జారీని సోమవారం టీటీడీ పూర్తి చేసింది. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను నాలుగు లక్షలకుపైగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను భక్తులకు అందించారు. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు. -
గోదారమ్మ ఒడిలో... పౌర్ణమి వీడియో కాల్...
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే గోదావరిలో స్నానాలు చేసి ఉసిరికాయలతో దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తారు... బియ్యంపిండితో చేసిన ప్రమిదలతో ఇంటింటా దీపాలు అలంకరించి వెలిగించడం పౌర్ణమి ప్రత్యేకత.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తన కుటుంబీకులకు వీడియోకాల్ చేస్తూ గోదారమ్మ ఒడిలో దీపాలు వదులుతున్న మహిళ ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. -
ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించలేదు
తిరుమల: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసినట్టు టీటీడీ పీఆర్వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే, కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం జరుగుతోంది. అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి అయోధ్య కాండ లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో ఈనెల 21 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష జరగనుంది. తిరుమల వసంత మండపంలో శ్లోక పారాయణం, ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద వి/ê్ఞన పీఠంలో జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అంకురార్పణ జరగనుంది. పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న లడ్డూ కౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోంది. రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ కాంప్లెక్స్‌లో మొత్తం 62 కౌంటర్లు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు 6 బ్యాంకులు స్పాన్సర్షిప్ అందించాయి. నేడు పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 20న బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. -
శరత్కాల వెన్నెల
‘విత్ ఫ్రీడమ్, బుక్స్ అండ్ ది మూన్ హూ కుడ్ నాట్ బి హ్యాపీ’ అన్నాడు ఆస్కార్ వైల్డ్. కోరుకున్న స్వేచ్ఛ, చదువుకోదగ్గ పుస్తకాలు, వెన్నెల కురిపించే జాబిల్లి... ఆనందానికి మరేం కావాలి. అందుకే ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అని మన కవి సినారె రసాస్వాదన చేశాడు. మానవజాతి సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టుకుంది. గౌరవించింది. పూజించింది. అష్షో బుష్షో అనీ అంది. చంద్రుడు? వారికి నేస్తం. బెడ్‌లైటు. మామ. ఊసులు చెప్పుకునే చెలికాడు. తక్కిన రుతువులు ఎవరివైనా కావచ్చు. శరత్కాలం చంద్రుడిది. ఈ కాలంలో చంద్రుడు చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకున్నట్టు ఉంటాడు. ఇది శరత్కాలం. ‘పిండారబోసినట్టుంది వెన్నెల’ అని పుస్తకాల్లో కనిపిస్తుంది. ‘కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి వెన్నెల కురుస్తోంది’ అని రచయితలు రాస్తే వయసులో ఉన్న యువతీ యువకుల రొమాంటిక్ భావాలతో మైమరుస్తారు. ఏ అడ్డంకీ లేని నిర్మల ఆకాశంలో, పలుచటి గాలులు వీచే రాత్రి సమయాన, దాపున చుక్కల సింగారంతో, శరత్కాలంలో పూర్ణచంద్రుడు ఉదయిస్తే, దానిని చూడలేకపోతే మన దగ్గర మణులుంటే ఏంటి... మాణిక్యాలుంటే ఏంటి... ఫోన్‌పేలో ఎంత ఉంటే ఏంటి... సాహిత్యంలో వసంత రుతువుది ఏకఛత్రాధిపత్యమే. కాని శరదృతువు తక్కువ తిన్లేదు. ఆ మాటకొస్తే వేదకాలం గుర్తించింది మూడు రుతువులనే. గ్రీష్మం, వసంతం, శరత్తు. ‘సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి’ అనే అర్థం వచ్చే శ్లోకం ఋగ్వేదంలో ఉంది. ప్రకృతి వర్ణనలో పరాక్రమశాలి అయిన కాళిదాసు శరత్కాలపు వెన్నెలను ఏల వదులుతాడు. ‘ఈ వెన్నెల ఎలా ఉందంటే గడ్డ కట్టిన చిక్కటి తెల్లటి పెరుగులా ఉంది’ అని వెన్నెల రుచి చూపించాడు. వెన్నెలలో రెల్లుగడ్డికి గ్లామర్ తీసుకు వచ్చింది కూడా ఆ మహాకవే. శరత్కాలంలో రెల్లుగడ్డి వెన్నెలను తాగి మత్తుగా ఊగుతున్నట్టు ఉందని రాశాడాయన. ‘వెన్నెల కాస్తుంటే కొందరు కిటికీలు మూసుకుంటారు’ అని గుడిపాటి వెంకటాచలం విసుక్కున్నాడు కాని తిలక్ వెన్నెల కాసిందంటే చాలు కవిత్వం రాశాడు. ‘దవుదవ్వుల పడుచు పిల్లలు పకపక నవ్వినట్టుంది వెన్నెల... దాపరికం లేని నాతి వలపులాగుంది వెన్నెల’ అని రాశాడు. అంతేనా? ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. తన పుస్తకాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’ అన్నాడు. ఇక్కడ అమృతం వెన్నెలామృతమే. అయినా సరే ‘ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది’ అని రాసిన నండూరి సుబ్బారావూ మొనగాడే. ఎంకిని ఆచ్ఛాదన లేని చంద్రుని కింద నాయుడు బావ చూశాడో లేదో కాని తెలుగు పాఠకులు కన్నులు ఇంతింత చేసుకుని చూశారు. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పున్నమి వాల్మీకి మహర్షి జన్మదినం. రామాయణం ఈ భరతభూమి మీద అనాదిగా ఆధ్యాత్మిక వెన్నెలను కురిపిస్తూ ఉంది. రాముడు రామచంద్రుడు. చంద్రుణ్ణి నేలకు దించమని కోరి గోరుముద్దలు తిన్నవాడు. సీతమ్మ మోము చంద్రబింబం కంటే ఏం తక్కువ. మహా భారతాన్ని తెలుగు అనువాదం చేస్తున్న నన్నయ్య ‘అరణ్య పర్వం’లో శరత్కాలాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాసి అక్కడితో రచన చాలించాడు. 200 ఏళ్ల తర్వాత ఎఱాప్రగడ కొనసాగింపుగా శరత్కాల వర్ణన చేసే మరో పద్యం రాసి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. తెలుగు మహాభారతం ఆ విధంగా ఒక శరత్కాలానికి మరో శరత్కాలానికి మధ్య సుదీర్ఘ విరామం తీసుకుంది. రుతువులు ఏం చేస్తాయి? ఏవో సంకేతాలు ఇస్తాయి. ఆ ప్రకారం నడుచుకోమని మనుషులకు చెబుతాయి. శరత్కాలం స్త్రీ, పురుషుల సన్నిహిత కాలం అని శృంగార శాస్త్రాలు చెబుతాయి. భర్తృహరి ‘శృంగార శతకం’ ఆ సమయంలో ఆలుమగలు ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ‘శరత్కాలంలో ఆలుమగలు ఏకాంతంగా మేడ మీదకు చేరాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేయాలి. చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది... ఆ సమయంలో ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించాలి’ అని చెప్పింది. చలం కూడా ‘ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు వెన్నెల రాత్రుళ్లలో సముద్రపు ఒడ్డున భూమే శయ్యగా కలిసేది ఎప్పుడో’ అని రాశాడు. రుతువు అంటే స్పందన. వెన్నెల అంటే స్పందన. స్పందనాగుణం కోల్పోవడమే ఇప్పుడు మనిషిని బాధిస్తున్న సంగతి. విషాదం ఏమంటే తాను స్పందనాలేమితో బాధ పడుతున్న సంగతి కూడా మనిషికి తెలియదు. పూవు పూస్తే, హరివిల్లు విరిస్తే, చినుకు చూరు నుంచి చిటుకూ పుటుకూ మంటే, గాలికి ఒక తీవ ఝల్లుమని కదిలితే ఆగి చూసి ఆస్వాదించి స్పందించే సమయం మనిషికి ఎక్కడిది? అది ఉంది. కాని లేదు అని పరుగు పెట్టడమే మనిషి నేడు చేస్తున్నది. ఈ స్పందన కరువైన కొద్దీ జీవితంలో ఆస్వాదన కరువవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య శుష్కమైన కోరిక మిగిలి రససిద్ధి అడుగంటుతుంది. నేడు భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య నిజమైన రసస్పందన కరువవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫేక్– కపట మోహ ప్రదర్శనే మిగులుతున్నది. సంవత్సరానికి ఒకసారి శరత్ రుతువు వస్తుంది. సోముడు తేజోవంతమై అందాక పేరుకు పోయిన భావాల నిరాసక్తతను వదలగొడతాడు. వెన్నెల గుమ్మరిస్తాడు. గుండెలకు లాలిత్యం ఇస్తాడు. హాయి పడాల్సిన కాలం ఇది. పున్నములను చూడాల్సిన కాలం. దాంపత్య అనుబంధాన్ని వెలిగించుకోవాల్సిన కాలం. వెలగడం మీ వంతు. -
తిరుమలలో వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ
-
'ప్రభుదేవాతో గొడవలు'..క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు
వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘శత్రువు’ సినిమాతో నిర్మాగా మారారు ఎంఎస్ రాజు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం పౌర్ణమి. ఈ చిత్రాన్ని కూడా ఎంఎస్ రాజునే నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ సమయంలో డైరెక్టర్ ప్రభుదేవాకు, ఎంఎస్ రాజుకు మధ్య గొడవలు వచ్చాయని, ప్రభాస్ దీన్ని సద్దుమణిగించారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చారు. 'ప్రభుదేవాకు నాకు చాలా గొడవలు అయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. నిజానికి ప్రభుదేవా మంచి పొజిషన్లో ఉన్నాడని సంతోషిస్తాను కానీ అతనితో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి? ఇది కేవలం పుకార్లు మాత్రమే' అని వివరించారు. ఇక నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాను అందించిన ఎంఎస్ రాజు కొంతం గ్యాప్ తర్వాత దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఆయన తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొన్నారు. చదవండి : మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా? Karnataka: సీఎం కావాలని ఉంది: ఉపేంద్ర -
నేడు తిరుమలలో పున్నమి గరుడ సేవ
సాక్షి, తిరుమల: తిరుమలలో ప్రతినెలా జరిగే పున్నమి గరుడసేవ గురువారం సాయంత్రం జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలో కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా ఈ నెలలో స్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరుగనుంది. పౌర్ణమి సందర్భంగా గురువారం, అక్టోబరు 31న, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడసేవ నిర్వహిస్తారు. -
జాతరెల్లిపోదామే..జాతరో జాతరా!
మహిమాన్విత్వం.. నీలకంఠేశ్వరుని చరితం..! - 12నుంచి బ్రహ్మోత్సవాలు - నెలరోజుల పాటు ఉత్సవాలు --14న మహారథోత్సవం - జిల్లాలో ప్రత్యేకం ఎమ్మిగనూరు : పుణ్యక్షేత్రాలకు నెలవుగా ఉన్న కర్నూలు జిల్లాలో తర్తూరు, ఎమ్మిగనూరు, గూడూరు జాతరలు ప్రధానమైనవి. ఇందులో ఎమ్మిగనూరు జాతరకు దశాబ్ధాల చరిత్ర, ప్రత్యేక స్థానం ఉంది. ఏటా పుష్యమాసం పౌర్ణమి రోజుతో మొదలై మళ్లీ పౌర్ణమి వచ్చేవరకూ అంటె నెల రోజుల పాటు జాతర కొనసాగడం ఇక్కడి ప్రత్యేకత. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా.. ఎమ్మిగనూరు పరిసరాల వారికి ఇలవేల్పుగా గుర్తింపు పొందిన శ్రీనీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నాలుగు శతాబ్దాల చరిత్ర నాలుగు శతాబ్దాలకు పైగా ఎమ్మిగనూరులో శ్రీనీలకంఠేశ్వరస్వామి రథోత్సవం జరుగుతున్నట్లు తెలుస్తోంది. చేనేత మహిళ సేద్యం చేస్తున్నప్పుడు నాగలికి స్వామి వారి లింగం తగలడంతోవెలికితీసి ప్రతిష్టించినట్లు ప్రచారం. చేనేతలు కాశీనుంచీ శివలింగాన్ని తెచ్చి ప్రతిష్టించటంతో పూజలు మొదలైనట్లు మరో ప్రచారం. ఆలయానికి గతంలో ఉన్న భారీ రథం బ్రిటీష్ పాలనలో వివాదం కారణంగా దగ్ధమైనట్లు చెబుతారు. అనంతరం ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వనపర్తి రాజులు(సంస్థానాధీసులు) నల్లమొద్దును తెప్పించి దాదాపు 55 ఆడుగుల ఎత్తులో మరో రథాన్ని తయారు చేయించారు. ఈ రథ చక్రాలు పది అడుగుల ఎత్తున్నాయి. రథానికి నాలుగు వైపులా పురాణగాథలను ప్రతిబింబిస్తూ చెక్కిన దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. రథం ఇప్పటి వరకు చెక్కుచెదరకపోవడం విశేషం. 12నుంచి బ్రహ్మోత్సవాలు.. శ్రీ దుర్మిఖినామ సంవత్సరం పుష్యమాస శుక్లపక్ష పౌర్ణమి గురువారం నుంచి సోమవారం వరకు శ్రీ నీలకంఠేశ్వరుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 12వ తేది పుష్పారోహణ సహిత శ్రీపార్వతి పరమేశ్వరస్వామి కల్యాణమహోత్సవం, 13 రాత్రి 9గంటలనుంచి 12గంటల వరకు ప్రభావళి మహోత్సవం, 14 సాయంత్రం 4గంటల నుంచి 6 వరకు మహారథోత్సవం, 15వతేదీ రాత్రి 9నుంచీ 12 వరకూ వ్యాహావళి మహోత్సవం, 16వతేదీ సాయంత్రం 5 నుంచి 9గంటల వరకు తీర్థావళీ వసంతోత్సవం నిర్వహిస్తారు. మహారథోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. వ్యవసాయానికి జాతరే.. ఎమ్మిగనూరు జాతరలో ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పలు అంశాలు చోటుచేసుకుంటాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి వివిధ రకాల మేలు జాతి ఎద్దులు, దూడలను విక్రయానికి ఉంచుతారు. పది రోజుల పాటు జరిగే పశువుల జాతరలో రూ.3కోట్ల వరకు లావాదేవీలు నమోదవుతాయి. వివిధ ప్రాంతాల్లో నిపుణులు తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు, ఎద్దుల బండ్లను ప్రదర్శన, విక్రయాలకు ఉంచుతారు. సంప్రదాయ బలప్రదర్శనకు పెద్దపీట.. జాతర సందర్భంగా ఎమ్మిగనూరులో ప్రత్యేకంగా నిర్వహించే ఎద్దుల బలప్రదర్శనలు ఉత్సవాలకు మరింత శోభను తెస్తాయి. నాలుగు రోజుల పోటీల్లో రాష్ట్రం నలుమూల నుంచి వివిధ కేటగిరిలకు చెందిన ఒంగోలు జాతి ఎద్దులను రైతులు ఇక్కడికి తీసుకువస్తారు. నెలల తరబడి తర్ఫీదు ఇచ్చిన మేలు జాతి ఎద్దులతో జరిగే బండలాడుగు పోటీలు ప్రత్యేక ఆకర్శణగా మారాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింత.. జాతర సందర్భంగా ఎమ్మిగనూరులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నారు. జానపద నృత్య ప్రదర్శనలు, ఏకపాత్ర అభినయాలు, సంప్రదాయ నాటక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలతో ఎమ్మిగనూరు కలకలాడునుంది. క్రికెట్, వాలీబాల్, షటీల్, కబడ్ఢీ, ఫుట్‌బాల్ వంటి ప్రధాన టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. -
అక్టోబర్ నెలలో పండుగలే...పండగలు
రాయచోటి రూరల్: అక్టోబర్ నెల పండుగల వాతావరణంతో నిండిపోనుంది. 1153వ సంవత్సరం తరువాత అంత అరుదైన నెల అక్టోబర్ మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు పలువురు వేదపండితులు పేర్కొంటున్నారు. సుమారు 8 శతాబ్దాల తరువాత వచ్చిన అరుదైన నెలగా అక్టోబర్ నిలిచిపోనుంది. నెల ప్రారంభం నుంచే , అంటే 1వ తేదీ నుంచి పండుగలు ప్రారంభం కానున్నాయి. 1వ తేది దేవీశరన్నవరాత్రులు ప్రారంభంతో 9వ తేదీన దుర్గాష్టమి, 11వ తేదీ విజయదశమితో వరుసగా 11రోజులు పండుగలే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మరో రోజు అధికంగా 12రోజుల పాటు నిర్వహించుకోనున్నారు. ఆ తరువాత 3వ తేదీ ప్రారంభమై, 10రోజుల పాటు 12వ తేదీ వరకు పీర్లపండగ(మొహర్రం) ఉంటుంది. 2వ తేదీ గాంధీ జయంతి, 30వ తేదీ దీపావళి పండుగ నిర్వహించుకోనున్నారు. విచిత్రంగా ఈ నెలలోనే పౌర్ణమి, అమావాస్య రెండూ వచ్చాయి. విద్యార్థులకు దసరా సెలవులు రావడంతో స్వగ్రామాల్లో సందడి వాతావరణం నెలకొననుంది. -
శ్రీవారి ఆలయంలో రెండో కొప్పెర
సాక్షి, తిరుమల:తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు కానుకలు సమర్పించేందుకు శుక్రవారం రెండో కొప్పెర(హుండీ) ఏర్పాటు చేశారు. పౌర్ణమి పర్వదినంలోని శుభ గడియాల్లో ఈ కొత్త కొప్పెర ప్రారంభించారు. ఆలయ సన్నిధిలో జయ–విజయలకు పక్కనే ఈశాన్యదిశలో నాటికాలం నుండి కొప్పెర ఉంది. ఇందులోనే భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా ఏటా రూ.1000 కోట్లు నగదు కానుకలు, రూ.300 కోట్ల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన రంగురాళ్లు లభిస్తున్నాయి. హుండీలో కానుకలు సమర్పించేందుకు భక్తుల రద్దీ పెరిగింది. వారి మధ్యతోపులాటలు జరుగుతున్నాయి. మరికొన్ని సార్లు హుండీ కానుకలు కూడా చోరీకి గురవుతున్నాయి. దీన్ని గుర్తించిన టీటీడీ ఈవో సాంబశివరావు కొత్త హుండీ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. దీనికి ఆగమ పండితులు, అర్చకులు పచ్చజెండా ఊపారు. దీంతో ప్రస్తుతం ఉన్న హుండీకి సమీపంలోనే మరో హుండీ ఏర్పాటు చేశారు. ఆగమ శాస్రంతోపాటు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయటంతో భక్తులు కూడా సులభంగా కానుకలు, ముడుపులు సమర్పిస్తున్నారు. -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి పౌర్ణమి రా.3.28 వరకు నక్షత్రం అశ్వని సా.4.12 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ప.12.21 నుంచి 1.54 వరకు తదుపరి రా.1.36 నుంచి 3.10 వరకు దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.41 వరకు తదుపరి ప. 2.22 నుంచి 3.12 వరకు అమృతఘడియలు ఉ.9.16 నుంచి 10.48 వరకు కార్తీక పౌర్ణమి. ------------------------- సూర్యోదయం: 6.014 సూర్యాస్తమయం: 5.24 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు ** -
కార్తీక శోభ