కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్‌ను ప్రకటించింది. తాజా అప్‌డేట్ ప్రకారం వాట్సాప్ వినియోగదారులు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీటాలో 32 మంది పార్టిసిపెంట్స్‌తో వీడియో కాల్స్‌ను చేసుకునే ఫీచర్‌ను లాంచ్ చేసింది. అంటే ఇకపై గూగుల్ మీట్, జూమ్ లాంటి అవసరం లేకుండానే ఒకేసారి 32మందితో వీడియో ద్వారా డెస్క్ టాప్ ద్వారా సంభాషించవచ్చు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?)
వాబేటా ఇన్ఫో ప్రకారం 32 మంది యూజర్లు వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్‌లో జాయిన్ కమ్మని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా కావాలనుకున్నబీటా యూజర్లు ఈ వీడియో కాల్‌లో జాయిన్ కావచ్చు. విండోస్ అప్‌డేట్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది.
విండోస్ వినియోగదారులు ఇప్పటివరకు 32 మంది వ్యక్తులతో మాత్రమే ఆడియో వాట్సాప్ కాల్స్ చేసుకోగలిగేవారు. అయితే ఇప్పుడు తాజా అప్‌డేట్‌తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబరులోనే మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విండోస్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌లకు వీడియో కాల్‌ల కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment