Couple Made Young Women's Indecent Video Calls And Cheated 200 People Honey Trip - Sakshi
Sakshi News home page

నగ‍్నంగా వీడియో కాల్స్‌ చేసి.. 200 మందిని మోసం చేసిన జంట

Published Mon, Oct 25 2021 11:54 PM | Last Updated on Tue, Oct 26 2021 2:35 PM

Couple made young womens indecent video calls and cheated 200 people Honey Trap - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: కొందరు కేటుగాళ్లు సోషల్​మీడియా సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ దాదాపు 200 మందిని మోసం చేసిన ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన సప్నాగౌతమ్‌, యోగేశ్‌ భార్యాభర్తలు. వీరికి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టింది. దీంతో ఆ దంపతులకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డు చేసి బాధితుల నుంచి డబ్బులు లాగొచ్చని సలహా ఇచ్చాడు. దీంతో సప్నా గౌతమ్‌, యోగేశ్‌ జంట ఈ దందాలోకి దిగింది.

యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించడంతో ఆ వివరాలతో వీడియో కాల్స్ ఎలా మాట్లాడలో కొంతమంది యువతులకు సప్నా శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. దీని కోసం వీరు ముందుగా ఓ వెబ్సైట్‌ సాయంతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేవారు. దానికి నిమిషానికి రూ.200పైగా ముందుగానే చెల్లించాలని చెప్పేవారు. ఇందులో సగం వెబ్సైట్ వారికిపోగా మిగిలిన సగం ఈ దంపతులకు చేరుతుంది. తర్వాత ఆ రేటు కంటే తక్కువకే తాము వీడియో కాల్స్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించేవారు. వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల్లో వీడియో కాల్స్ చేసి, అవతలి వారు నగ్నంగా మాట్లాడేలా చేసి రికార్డు చేసేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకుంటే.. వారి వీడియోలు బయట పెడతామని బాధితులను బెదిరించేవారు.

ఇలా ఎంతో మందిని మోసం చేసి గత రెండేళ్లుగా సుమారు రూ.22 కోట్లను పలువురు బాధితుల నుంచి దోచుకున్నారు. యువతులను రిక్రూట్ చేసుకుని వారికి నెలకు రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్‌ చేయించారు. కేవలం మెసేజ్​లు చేసే వారికి నెలకు రూ.15వేలు ఇచ్చేవారు. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేయడంతో ఆ కంపెనీ యజమాని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ జంట దందా వెలుగులోకి వచ్చింది. ఆ కేసు విచారణలో రాజ్‌కోట్‌ పోలీసులు ఘజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేస్తుంటే హనీ ట్రాప్ విషయం బయటపడింది. ఈ కేసులో భార్యాభర్తలు సహా, మరో ముగ్గురు యువతులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement