దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ కొత్త కరోనా మరణాలు నమోదవుతుంటే బాధితుల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు, ఫ‍్రంట్ లైన్ వారియర్స్ అహర్నిశలు కృషి చేస‍్తున్నాయి. బాధితులకు చికిత్స ఇవ్వడమే కాకుండా, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర‍్యాన్ని నింపుతున్నాయి. అయితే కరోనా మరణాలు మాత్రం తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఓ ఆస్పత్రి కోవిడ్ వార్డ్ లో తల్లి కొడుకుల మధ్య జరిగిన ఓ సంఘటన నెటిజన్లని కంటతడి పెట్టిస్తోంది.
డాక్టర్ దీప్షికా ఘోష్ ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా భావోద్వేగానికి లోనయ్యాను. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’ అని కామెంట్ జతచేశారు. ఆమె ఈ ఆస‍్పత్రిలోని కోవిడ్ వార్డ్‌లో సేవలు అందిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా దీప్షికాకు ఓ యువకుడు కాల్ చేశాడు. మేడం ప్లీజ్ నేను మా అమ‍్మతో మాట్లాడాలి. నేను వీడియో కాల్ మాట్లాడేదాకా వెయిట్ చేయరా ? అని రిక్వెస్ట్ చేశాడు.
అయితే కోవిడ్ వార్డ్‌లో ప్రాణా పాయస్థితిలో తల్లితో మాట్లాడేందుకు వీడియో కాల్ చేసిన అతను తల్లి వైపు చూస్తూ 'తేరా ముజ్సే హై పెహ్లే కా నాటా కోయి' అంటూ 1973లో విడుదలైన ‘ఆ గేల్ లాగ్ జా’ సినిమా పాట పాడి తల్లిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు. కోవిడ్‌తో బాధపడుతున్న తన తల్లికి ‘అమ్మా లేమ‍్మా..’ అని ధైర్యం చెప్పాడు.
అతను పాటపాడుతుండగా వార్డ్‌లో సేవలు అందిస్తున్న నర్స్‌లు కొన‍్ని నిమిషాలపాటు వారికి ఇబ్బంది కలగకుండా అలా నిల్చుండిపోయారు. బెడ్‌మీద ఉన్న బాధితురాలు వీడియోకాల్‌లో అతన్ని చూడడంతో.. తన తల్లి ఆరోగ్యంగానే ఉందని పాడడం ఆపేశాడు. తన తల్లితో మాట్లాడినందుకు డాక్టర్లకు, నర్స్‌లకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ వీడియో కాల్ చేసిన ఆ యువకున్ని అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘తన తల్లి పట్ల అతనికి ఉన్న ప్రేమ చాలా గొప్పది’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Today, towards the end of my shift, I video called the relatives of a patient who is not going to make it. We usually do that in my hospital if it’s something they want. This patient’s son asked for a few minutes of my time. He then sang a song for his dying mother.
— Doctor (@DipshikhaGhosh) May 12, 2021
Comments
Please login to add a commentAdd a comment