
కుమారుడి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూస్తూ విలపిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు
ఉరవకొండ: లాక్‌డౌన్ కారణంగా ఆ తల్లిదండ్రులు కొడుకును కడసారి చూసుకోలేకపోయారు. అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, శివమ్మ దంపతుల కుమారుడు సుంకన్న(46) హైదరాబాద్‌లో కారు డ్రైవర్. ఆయన భార్య పార్వతి ఏడు నెలల గర్భిణీ. వీరికి ఇద్దరు పిల్లలు.
భార్యాపిల్లలతో సుంకన్న (ఫైల్)
► సుంకన్న శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు.
► అతడి తల్లిదండ్రుల సమక్షంలో అంత్యక్రియలు చేయాలని మృతదేహంతో పార్వతి బయలు దేరింది.
► అంత్యక్రియలు పూర్తయ్యాక 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఇక్కడి అధికారులు ఫోన్‌లో ఆమెకు చెప్పడంతో వెనుదిరిగింది.
► హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియో కాల్ ద్వారా ఆ కార్యక్రమాన్ని మృతుడి తల్లిదండ్రులకు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment