
పుణె: లాక్‌డౌన్ సడలింపులతో నేరపూరిత ఘటనలు పెరిగిన నేపథ్యంలో పుణె పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఇంటి నుంచే వీడియా కాలింగ్ ద్వారా బాధితులు ఫిర్యాదులు చేసే దిశగా చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో పోలీసులు కరోనా లాక్‌డౌన్ విధుల్లో ఉండటంతో బాధితుల ఫిర్యాదుల స్వీకరణకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పుణె పోలీస్ కమిషనర్ కె.వెంకటేశం తెలిపారు. దాంతోపాటు కరోనా నియంత్రణకు కూడా ఇది దోహద పడుతుందని వెల్లడించారు. పుణె పోలీస్ కమిషనరేట్‌లో తొలుత ఈ ‘వర్చువల్ అపాయింట్‌మెంట్ సిస్టం’ ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. దాని ఫలితాల ఆధారంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో వర్చువల్ అపాయింట్‌మెంట్ సిస్టంను అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. బాధితులు పోలీస్ అధికారులతో వీడియో కాలింగ్ చేసి మాట్లాడొచ్చని కమిషనర్ చెప్పారు.
(చదవండి: పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్)
Comments
Please login to add a commentAdd a comment