
ఇన్‌కమింగ్ వీడియో కాల్స్ ఆన్సర్ చేస్తున్న సమయంలో హ్యాకర్లు యాప్‌ను క్రాష్ చేసేలా సహకరిస్తున్న ఓ బగ్‌ను ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ గుర్తించింది. ఈ విషయాన్ని ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్లు జీడీనెట్, ది రిజిస్టార్ రిపోర్టు చేశాయి. ఈ బగ్‌తో ఆపిల్ ఐఫోన్ల వాట్సాప్ అప్లికేషన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ప్రభావితం కానున్నాయని పేర్కొంది. ఆగస్టులోనే ఈ బగ్‌ను వాట్సాప్ గుర్తించిందని తెలిసింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌కు ప్రస్తుతం 1.5 బిలియన్ పైగా యూజర్లున్నారు. అయితే ఈ బగ్ బారిన ఎంత మంది యూజర్లు పడ్డారో ఇంకా తెలియరాలేదు.
వాట్సాప్ వీడియో కాల్‌లో బగ్ ఉన్నట్టు నటాలీ సిల్వనోవిచ్ అనే సెక్యురిటీ రీసెర్చర్, గూగుల్ ప్రాజెక్ట్ జీరో సెక్యురిటీ రీసెర్చ్ టీమ్‌తో కలిసి కనుగొన్నారు. వాట్సాప్ వీడియో కాల్‌ను ఎత్తిన వెంటనే అటాకర్, యూజర్ వాట్సాప్ అంతటిన్నీ తన ఆధీనంలోకి తీసుకుంటాడని గూగుల్ ప్రాజెక్ట్ జీరో రీసెర్చర్ ట్రావిస్ ఓర్‌మాండీ చెప్పారు. కాగా, ఈ బగ్‌పై ఫేస్‌బుక్ ఇంకా స్పందించలేదు. గతేడాది నుంచి ఫేస్‌బుక్ సెక్యురిటీ సంబంధిత సమస్యలతో బాధపడుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితమే దాదాపు 5 కోట్ల యూజర్ అకౌంట్లు హ్యాక్ అయినట్టు ఫేస్‌బుక్ ప్రకటించి, అందర్ని షాక్‌కు గురిచేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ కూడా ఫేస్‌బుక్‌ను అతలాకుతలం చేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండ్‌లో సుమారు 8.7 కోట్ల యూజర్లు డేటా చోరికి గురైంది.
Comments
Please login to add a commentAdd a comment