సాక్షి, చిత్తూరు : కరోనా మహమ్మారికి నగరి ప్రజలెవరు భయపడాల్సిన అవసరం లేదని, మీకు అండగా మేమున్నామంటూ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సెల్ఫీ వీడియో ద్వారా భరోసానిచ్చారు. రోజా వీడియోలో మాట్లాడుతూ.. 'నగరిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంటిలోనే ఉండండి.. సరైన జాగ్రత్తలు పాటించండి.. కరోనాను పారద్రోలండి. లాక్‌డౌన్ సందర్భంగా నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవారు అధికంగా ఉన్నారని, వారికి నిత్యావసర సరుకులు సమకూర్చడంలో వైఎస్ఆర్ కార్యకర్తలు ముందుండి సహాయ సహకారాలు అందించండి' అంటూ పిలుపు నిచ్చారు. ఎమ్యెల్యేగా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడటం తన బాధ్యత అని రోజా పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు అందవలసిన నిత్యావసరాల సరుకులను వలంటీర్ల ద్వారా అందిస్తున్నట్లు రోజా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment