RK roja
-
అసలు ఏపీలో పోలీసులున్నారా..?: రోజా
సాక్షి,తిరుపతి:సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఒక బాలిక కిడ్నాప్,హత్య కు గురైతే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.ఈ విషయమై రోజా ఆదివారం(అక్టోబర్6)మీడియాతో మాట్లాడారు.‘చిన్నారి హత్య ఘటన విని గుండె తరుక్కుపోతోంది.ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లల్ని స్కూళ్లకు పంపించాలంటేనే ఆడపిల్లలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉంది.బాలిక 29వ తేది కిడ్నాప్ అయితే 4రోజుల పాటు 4కిలోమీటర్ల దూరంలో పుంగనూరులో ఉన్నా పోలీసులు పట్టుకోలేకపోయారు.చంద్రబాబు,హోం మంత్రి,డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు.ప్రజల్ని పట్టించుకోరు.మహిళల్ని పట్టించుకోరు. చిన్నారులను పట్టించుకోరు.అసలు ఈ ప్రభుత్వం ఉందా..పోలీసులు ఉన్నారా..ఉంటే ఏం చేస్తున్నారు.ఈ రాష్ట్రంలో పోలీసులను కేవలం కక్ష సాధింపు చర్యలకు,రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే వినియోగిస్తున్నారు.రాష్ట్రంలో మహిళలు,పిల్లల్ని పట్టించుకోరా’అని రోజా ప్రశ్నించారు. ఇదీ చదవండి: అంజుమ్ కేసులో పోలీసుల వైఫల్యం -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి
సాక్షి, విజయవాడ: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీలోని సంక్షేమ పథకాలు అమలు కావల్లేదు. ఆరోగ్య శ్రీ బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడుంది..?. 32 లక్షల ఇళ్ల పట్టలు బీజేపీ పాలిత రాష్ట్రాలన్ని కలిపి ఇచ్చాయా..?. కేంద్రం అప్పులు చెయ్యడం లేదా..?. బీజేపీ సీఎంలు అప్పులు చెయ్యడం లేదా..?. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌తో కలిసి బీజేపీ.. ఏపీకి అన్యాయం చేసింది. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి’’ అని సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: జేపీ నడ్డా ఏపీకి అబద్ధాలను మోసుకొచ్చారు.. పోలవరం ఊసేది? -
కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబుకు మైండ్ పోయింది
-
భయపడొద్దు.. మీకు మేమున్నాం : రోజా
సాక్షి, చిత్తూరు : కరోనా మహమ్మారికి నగరి ప్రజలెవరు భయపడాల్సిన అవసరం లేదని, మీకు అండగా మేమున్నామంటూ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ వీడియో ద్వారా భరోసానిచ్చారు. రోజా వీడియోలో మాట్లాడుతూ.. 'నగరిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంటిలోనే ఉండండి.. సరైన జాగ్రత్తలు పాటించండి.. కరోనాను పారద్రోలండి. లాక్డౌన్ సందర్భంగా నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవారు అధికంగా ఉన్నారని, వారికి నిత్యావసర సరుకులు సమకూర్చడంలో వైఎస్ఆర్ కార్యకర్తలు ముందుండి సహాయ సహకారాలు అందించండి' అంటూ పిలుపు నిచ్చారు. ఎమ్యెల్యేగా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడటం తన బాధ్యత అని రోజా పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు అందవలసిన నిత్యావసరాల సరుకులను వలంటీర్ల ద్వారా అందిస్తున్నట్లు రోజా తెలిపారు. ('నేను క్వారంటైన్లో ఉన్నా.. మరి మీరు') -
రాజ్‌భవన్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు
-
తరలివస్తోన్న తెలుగు చిత్ర పరిశ్రమ
సాక్షి, అమరావతి : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటులు జగన్‌కు జై కొడుతున్నారు. వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సినీ పరిశ్రమపై టీడీపీ పట్టు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజా, విజయ్‌చందర్ వంటి సీనియర్ నటులు మొదట్నుంచీ వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. వీరితో పాటు పోసాని కృష్ణమురళీ తదితరులు పార్టీ తరఫున తమ గళం విన్పించేవారు. ఇటీవల ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ, మరో నటుడు కృష్ణుడు చేరారు. తర్వాత సీనియర్ నటి జయసుధ, మరో ప్రముఖ హాస్యనటుడు అలీ, భానుచందర్, దాసరి అరుణ్‌కుమార్, చిన్ని కృష్ణ, రాజారవీంద్ర, తనీష్ వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు జగన్‌కు మద్దతు పలికారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం రాజశేఖర్, జీవిత, హేమ, టీవీ యాంకర్ శ్యామల దంపతులు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా టీడీపీకి వ్యతిరేకంగా గళం విప్పడంతో పాటు, జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని తమ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది. టీడీపీ, జనసేనను కాదని.. మొదట్నుంచి సినీ నేపథ్యం ఎక్కువగా ఉన్న తెలుగుదేశాన్ని, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనను కాదని నటులు, దర్శకులు, నిర్మాతలు వైఎస్సార్సీపీలోకి రావడం గమనార్హం. కొద్దికాలం క్రితం వరకూ టాలీవుడ్‌పై టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండేది. కొందరు బాహాటంగానే చంద్రబాబుకు మద్దతు పలికారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్ వంటి సినీ పెద్దలైతే సినీ పరిశ్రమ మొత్తం మీ వెంట ఉంటుందని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీనిపై పోసాని కృష్ణమురళీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు సినీ పరిశ్రమలో చిచ్చురేపాయి. చంద్రబాబు కేవలం తన వర్గానికి చెందిన వారికే అవార్డులిచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో ఆధార్ లేని వాళ్లు మాట్లాడుతున్నారంటూ అప్పట్లో సీఎం కుమారుడు లోకేష్ అనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబుకు మద్దతు పలికే సినీ ప్రముఖులెవరూ ఆ సమయంలో నోరు మెదపలేదు. మరోవైపు చిన్న సినిమాల విడుదలకు టీడీపీ ఏమాత్రం సహకారం అందించలేదు. తన కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్లు దక్కకుండా చేసేందుకు లోకేశ్ ప్రయత్నాలు చేశారు. ఏపీలో సినీ పరిశ్రమకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ టీడీపీపై వ్యతిరేకత పెంచేందుకు కారణమయ్యాయి. సినీనటుల్ని కించపర్చేలా టీడీపీ వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు పరిశ్రమ మొత్తాన్ని కించపర్చేలా ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ వారితో మాట్లాడిస్తున్నారని, హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకునేందుకే విమర్శిస్తున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. వీటిపై టాలీవుడ్ నటులు మండిపడుతున్నారు. -
'2017 నారావారి నరకాసుర నామ సంవత్సరం'
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలన మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా అని ప్రశ్నించారు. 2017లో మహిళలు చంద్రబాబు పాలనలో తీవ్ర ఇబ్బందులను మీడియా సమావేశంలో రోజా వివరించారు. 'నాలుగు బడ్జెట్లు మారుతున్నాయిగానీ ఆడవాళ్ల తలరాతలు మారలేదు. రెండో సంతకం మద్యం షాపుల నిషేధానికి సంబంధించిన దస్త్రంపైనే పెడతానని అన్నారు. ఇప్పుడేమో మద్యపు ఏరుల్ని పారిస్తూ ఖజానా నింపుకోవడానికి రాత్రి 1గంట వరకు వైన్ షాపులు నడుపుకునేందుకు లైసెన్స్‌లు ఇచ్చారు. ఆడవాళ్ల జీవితాలు చెడిపోయినా పర్వాలేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆంగ్ల సంవత్సరం మనకొద్దని, ప్రత్యేక జీవో ఇచ్చిన చంద్రబాబు గుడులు అలంకరణ చేయొద్దని వైన్స్‌లు మాత్రం కళకళలాడేట్లు చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు ఎత్తివేసేందుకు వారికి రూ.14,204కోట్లు ఇస్తే సరిపోతుంది. ఈ డబ్బు చంద్రబాబు, టీడీపీ నేతలు దోచుకున్న దానితో పోలిస్తే 1శాతం. కానీ, అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం మహిళలకు పంగనామాలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు తమ గ్రామాల్లోకి అడుగుపెడతారా? ఎప్పుడు నిలదీద్దామా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డ పేరిట రూ.30 వేలు వేస్తానని అన్నారు.. ఇప్పటి వరకు ఏపీలో ఆడపిల్లలే పుట్టలేదా? పౌష్టికాహారం కోసం గర్భిణీలకు రూ.10 వేలు ఇస్తానని వారిని మోసం చేశారు. పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని అన్నారు. అన్యాయం జరిగిన ఐదు నిమిషాల్లో వారి ముందు వాలతానని చెప్పి మోసం చేశారు. న్యాయం చేయకపోగా అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే వారిని భయపెట్టి వెనక్కు పంపుతున్నారు. ఇప్పటి వరకు రిషితేశ్వరి కేసు ఎటూ తేలలేదు. అనంతపురం జిల్లాలో సుదమ్మ అనే మహిళను కొంచెం పక్కకు జరిపి కట్టమన్నందుకు పయ్యావుల అనుచరులు ఎగిరెగిరి ఆమెను తన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై ఏపీలో జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి. పోలీసులు నేరస్తుల కోసం పనిచేస్తున్నారేమో అనిపిస్తోంది. ఆఖరికి టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురుకి కూడా అన్యాయం జరిగిందంటే.. టీడీపీ పాలనలో ఇంతకంటే దౌర్బాగ్యం మరొకటి ఉండదు. టీడీపీలో రౌడీలు, గుండాలే రాజ్యమేలుతున్నారు. ఆడపిల్ల అంటే చంద్రబాబుకు గౌరవం లేదు, పట్టించుకోరు. జెర్రిపోతుల పాలెం ఘటనపై చంద్రబాబు కనీసం ఒక్క ప్రకటన చేయలేదు' అని రోజా చంద్రబాబు వల్ల జరిగిన అన్యాయాలు ఎండగట్టారు. -
'వాళ్ల పిల్లలు కీచకులుగా మారారు'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం విశాఖలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ సభ్యుల పిల్లలే కీచకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కఠినంగా వ్యవహరించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. రిషితేశ్వరి విషయంలో విధిలేక ప్రిన్సిపల్ బాబురావును అరెస్ట్ చేశారని అన్నారు. తహశీల్దారు వనజాక్షి వ్యవహారంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో మాట్లాడి సెటిల్ చేశారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఛీటింగ్ చీఫ్ మినిస్టర్‌గా బిరుదు ఇవ్వొచ్చు' అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ ఇంగ్లీషులో చదవడం దురదృష్టకరమని అన్నారు. బడ్జెట్లో మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రోజా విమర్శించారు.