బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి | RK Roja Serious Comments On JP Nadda | Sakshi
Sakshi News home page

బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి: మంత్రి రోజా

Published Wed, Jun 8 2022 2:34 PM | Last Updated on Wed, Jun 8 2022 2:55 PM

RK Roja Serious Comments On JP Nadda - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ‍్యలకు కౌంటర్‌ ఇచ్చారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కింది. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీలోని సంక్షేమ పథకాలు అమలు కావల్లేదు. ఆరోగ్య శ్రీ బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడుంది..?. 

32 లక్షల ఇళ్ల పట్టలు బీజేపీ పాలిత రాష్ట్రాలన్ని కలిపి ఇచ్చాయా..?. కేంద్రం అప్పులు చెయ్యడం లేదా..?. బీజేపీ సీఎంలు అప్పులు చెయ్యడం లేదా..?. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌తో కలిసి బీజేపీ.. ఏపీకి అన్యాయం చేసింది. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి’’ అని సవాల్‌ విసిరారు. 

ఇది కూడా చదవండి: జేపీ నడ్డా ఏపీకి అబద్ధాలను మోసుకొచ్చారు.. పోలవరం ఊసేది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement