లవర్‌తో వీడియో కాల్‌, లైవ్‌ లో ఆత్మహత్య | Teenager Committed Suicide On Live Video Call | Sakshi
Sakshi News home page

లవర్‌తో వీడియో కాల్‌, లైవ్‌ లో ఆత్మహత్య

Published Thu, Mar 15 2018 12:58 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Teenager Committed Suicide On Live Video Call - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్షణికావేశంతో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయంతో నిండు జీవితాం అర్థాంతరంగా ముగిసింది. ప్రేమికురాలితో వీడియో కాల్‌ మాట్లాడుతూనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 20 ఏళ్ల అజ్మీర్‌ సాగర్‌ మల్కాజ్‌గిరిలోని వినాయక్‌ నగర్‌లో తన సోదరితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సాగర్‌ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే నాలుగు నెలల క్రితం ఆ యువతి బంధువులతోపాటు, ఇంట్లోవాళ్లు కూడా ఈ ప్రేమ వ్యవహరంలో సాగర్‌ని  హెచ్చరించారు. సాగర్‌ తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూడటంతో  తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.

ఈ సందర్భంగా ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె నువ్వు చనిపోతే నీ మీద కోపం పోతుంది అంటూ సాగర్‌కు వాట్సాప్‌లో సందేశం పంపింది. ఈ విషయంపై మాట్లాడాలంటూ సాగర్‌ గురువారం ఉదయం ఆమెకు మెసేజ్‌ చేశాడు. తాను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్‌ చేయమని కోరాడు. ఆ యువతి వీడియో కాల్‌ చేయగానే.. సాగర్‌ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అయితే సాగర్‌ సీరియస్‌గా చెప్పినప్పుటికీ ఆ విషయాన్ని ఆమె సరదాగా తీసుకోవడంతో సాగర్‌ ... వీడియో కాల్‌ మాట్లాడుతూనే సీలింగ్‌ ఫ్యాన్‌కి ఊరేసుకుని తనువు చాలించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement