
బెంగళూరు(కర్ణాటక): కర్ణాటకలోని బెంగళూరులోని విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. 24 ఏళ్ల అశ్ఫక్ తగడి శివమొగ్గజైలులో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను.. ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో.. భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భయపడిపోయిన భార్య.. అతడిని వారించింది. తీవ్ర భయాందోళనలకు గురైన భార్య.. ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
అధికారులు.. అశ్ఫక్ ఇంటికి చేరుకుని అతని ఇంటి డోర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే .. అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, అశ్ఫక్‌ను అధికారులు.. శివమొగ్గలో తొలిపోస్టింగ్ ఇచ్చారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్‌టబ్‌లో ముంచి