Jail Warden
-
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్‌తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
భార్యకు వీడియో కాల్ చేసి జైలు వార్డెన్ ఆత్మహత్య
బెంగళూరు(కర్ణాటక): కర్ణాటకలోని బెంగళూరులోని విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. 24 ఏళ్ల అశ్ఫక్ తగడి శివమొగ్గజైలులో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను.. ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో.. భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భయపడిపోయిన భార్య.. అతడిని వారించింది. తీవ్ర భయాందోళనలకు గురైన భార్య.. ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అధికారులు.. అశ్ఫక్ ఇంటికి చేరుకుని అతని ఇంటి డోర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే .. అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, అశ్ఫక్ను అధికారులు.. శివమొగ్గలో తొలిపోస్టింగ్ ఇచ్చారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్‌టబ్‌లో ముంచి -
లేడీ ఆఫీసర్ కాదు.. ఆమె ఒక కామపిశాచి!
విధి నిర్వహణ పక్కకుపెట్టిన ఆ అధికారిణి.. విరహంతో రగిలిపోయి అకృత్యాలకు పాల్పడింది. మూడేళ్ల పాటు జైల్లోనే దారుణాలకు తెగించింది. ఆమె కామ దాహానికి బలైన బాధితులతో పాటు అధికారుల వాంగ్మూలంతో ఎట్టకేలకు నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఖైదీల లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎట్టకేలకు నిందితురాలికి శిక్ష పడింది. టీనా గోన్జలెజ్.. వయసు 27. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసేది. ఆ మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై నమోదైన ప్రధాన ఆరోపణ. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని, ఫోన్ కాల్స్‌లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. కొందరు ఖైదీలు తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరవేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు.. గత మే నెలలో ఆమెను అరెస్ట్ కూడా చేశారు. వికృత చేష్టలు.. దర్యాప్తు సమయంలో గోన్జలెజ్ జైల్లో పాల్పడ్డ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు.. ఆ వివరాల్ని జడ్జి ముందు ఉంచారు. ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు. జీవితం నాశనం చేసుకున్నావ్ గోన్జలెజ్ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్ సప్లై చేసేదని, ‘సెక్స్ రిటర్న్ గిఫ్ట్’లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్ మెక్కోమాస్ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి’ అని వేడుకున్నాడు. అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక ‘కామ పిశాచి’గా వర్ణించడం విశేషం. ‘నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు’ అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు. కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. ఏ జైల్లో అయితే అధికారిణిగా అకృత్యాలకు పాల్పడిందో.. అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా వెళ్లింది. -
నిన్న సస్పెన్షన్.... రేపు రిటైర్మెంట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: 1985లో జైలువార్డన్‌గా విధుల్లో చేరిన చేరిన గోవిందరాజ్ అంచలంచెలుగా ఉన్నతాధికారిగా ఎదిగారు. సుదీర్ఘకాలం పదోన్నతికి నోచుకోని ఆయనకు 2009లో డీఐజీగా ఒక్కసారిగా పదోన్నతి లభించింది. ఆరేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్న గోవిందరాజ్ ప్రస్తుతం కోవైలోని సెంట్రల్‌జైలు డీఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జైలులో గంజార, హెరాయిన్ తదితర నిషేధిత మత్తుపదార్థాలతోపాటూ ఖైదీలకు సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, చార్జర్లు యథేచ్ఛగా సరఫరా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా సీబీసీఐడీతో విచారణ జరి పించగా ఆరోపణలు రుజువయ్యూయి. డీఐజీ గోవిందరాజ్తోపాటూ మరో 17 మంది జైలు అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే మత్తుపదార్థాలు సరఫరా అయినట్లు సీబీసీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో డీఐజీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్దోషిని సీబీసీఐడీ పోలీసులు ఇచ్చిన నివేదిక తనను దోషిగా పేర్కొన్నా, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని గోవిందరాజ్ పేర్కొన్నారు. తన 30 ఏళ్ల సర్వీసుల్లో ఎన్నడూ ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొనలేదని అన్నారు. తనతోపాటూ మరో 17 మంది అధికారులను సీబీసీఐడీ తప్పుపట్టినా తనను మాత్రమే సస్పెండ్ చేయడం బాధాకరమని అన్నారు. మరో రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి చర్యకు పాల్పడటం తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు.