California Female Corrections Officer Jailed: Shocking Things Revealed In Investigation - Sakshi
Sakshi News home page

లేడీ ఆఫీసర్‌ కాదు.. ఆమె ఒక కామపిశాచి!

Jul 4 2021 1:37 PM | Updated on Jul 6 2021 4:50 AM

Female California Corrections Officer Jailed for Forced Inmates For Physical Relation - Sakshi

విధి నిర్వహణ పక్కకుపెట్టిన ఆ అధికారిణి.. విరహంతో రగిలిపోయి అకృత్యాలకు పాల్పడింది. మూడేళ్ల పాటు జైల్లోనే దారుణాలకు తెగించింది. ఆమె కామ దాహానికి బలైన బాధితులతో పాటు అధికారుల వాంగ్మూలంతో ఎట్టకేలకు నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఖైదీల లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎట్టకేలకు నిందితురాలికి శిక్ష పడింది. 

టీనా గోన్‌జలెజ్‌.. వయసు 27. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసేది. ఆ మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై నమోదైన ప్రధాన ఆరోపణ. నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడాలని, ఫోన్‌ కాల్స్‌లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. కొందరు ఖైదీలు తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరవేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేసిన అధికారులు.. గత మే నెలలో ఆమెను అరెస్ట్‌ కూడా చేశారు.

వికృత చేష్టలు.. 
దర్యాప్తు సమయంలో గోన్‌జలెజ్‌ జైల్లో పాల్పడ్డ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అధికారులు.. ఆ వివరాల్ని జడ్జి ముందు ఉంచారు. ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్‌ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్‌ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు. 

జీవితం నాశనం చేసుకున్నావ్‌
గోన్‌జలెజ్‌ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేదని, ‘సెక్స్‌ రిటర్న్‌ గిఫ్ట్‌’లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్‌ మెక్‌కోమాస్‌ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్‌ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్‌ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి’ అని వేడుకున్నాడు.

అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక ‘కామ పిశాచి’గా వర్ణించడం విశేషం. ‘నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్‌. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు’ అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు. కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్‌ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. ఏ జైల్లో అయితే అధికారిణిగా అకృత్యాలకు పాల్పడిందో.. అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement