
ప్రతీకాత్మక చిత్రం
హుబ్లీ/కర్ణాటక: ఓ యువతి నగరానికి చెందిన వ్యక్తికి ఊహించని షాకిచ్చింది. వాట్సప్ వీడియో కాల్ చేసి అతడి అశ్లీల వీడియోను రికార్డ్ చేసి డబ్బు డిమాండ్ చేసింది. వివరాలు.. ఫేస్‌బుక్‌లో ఓ యువతి స్థానిక వ్యక్తిని పరిచయం చేసుకుంది. తరచుగా చాట్‌చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ క్రమంలో, ఈ నెల 13 నుంచి 16వ తేదీ మధ్యలో అతడికి వాట్సప్ వీడియో కాల్స్ చేసింది.
అతడు నగ్నంగా ఉన్న సమయంలో వీడియోను రికార్డ్ చేసి దానిని సదరు వ్యక్తికి పంపి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు పంపకపోతే సోషల్ మీడియాలో సదరు వీడియోను అప్‌లోడ్ చేసి పరువుకు భంగం కల్గిస్తానని బెదిరించింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment