blackmail case
-
నొయిడాలోనూ కాదంబరి ‘హనీ ట్రాప్’
సాక్షి, అమరావతి : వలపు వల (హనీ ట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే ‘కిలేడీ’ కాదంబరి జత్వానీ మరో బ్లాక్మెయిల్ బాగోతం వెలుగు చూసింది. హనీట్రాప్, ఫోర్జరీ పత్రాలతో మోసం, బ్లాక్‌మెయిలింగ్ ద్వారా అక్రమ సంపాదనే జీవన విధానంగా చేసుకున్న కాదంబరి జత్వానీ ఢిల్లీ శివారులోని నొయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్‌సింగ్‌ను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అక్కడితో ఆగకుండా ఆయన నుంచి మరింతగా డబ్బు గుంజడానికి వేధింపులకు గురి చేసింది. మాఫియాతో సంబంధాలున్నాయని చెప్పి మరీ అమిత్ సింగ్‌ను బెదించింది. బాధితుడు అమిత్ సింగ్ ఫిర్యాదుతో నొయిడా పోలీసులు కాదంబరి జత్వానీ ప్రథమ నిందితురాలిగా కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపైనా కేసు నమోదు చేశారు. సెక్షన్లు 386, 388, 467, 468, 471, 120–బి, 34 కింద ఈ ఏడాది జనవరిలో అభియోగాలు నమోదు చేశారు.రేప్ చేశావని కేసు పెడతా... మాఫియాతో అంతం చేయిస్తానొయిడాకు చెందిన అమిత్‌సింగ్‌ను కాదంబరి జత్వానీ సోదరుడు అంబరీష్ దుబాయిలో కలిసి పరిచయం చేసుకున్నారు. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలున్నాయని, మోడలింగ్, సినీ రంగంలో ఉన్న తన సోదరి కాదంబరి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేస్తుందని చెప్పారు. అమిత్ సింగ్ భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత ఆయనకు కాదంబరి ఫోన్ చేసింది. విలువైన భూములు, ఇతర స్థిరాస్తులు అమ్మకానికి ఉన్నాయని చెప్పి పరిచయం పెంచుకుంది.ఆ తర్వాత అమిత్ సింగ్‌ను కలవాలని చెప్పింది. ‘నేను చూపించే స్థిరాస్తులు నచ్చినా నచ్చకున్నా తన సాంగత్యం కచ్చితంగా నచ్చుతుంది’ అని ఆమె ఆయనతో అన్నది. తరువాత ఓ రెస్టారంట్లో అమిత్‌సింగ్‌ను కలిసి స్థిరాస్తుల విషయాలకంటే ఇతర వ్యవహారాలపైనే ఎక్కువగా మాట్లాడింది. అమిత్ సింగ్‌తో సెల్ఫీలు తీసుకుంది. తరువాత సాంకేతిక కారణాలతో తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని చెప్పి ఆయన నుంచి అప్పు పేరుతో కొంత డబ్బు తీసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు రూ.75 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు అమిత్‌సింగ్ సమ్మతించకపోవడంతో బెదిరింపులకు దిగింది. తనను అత్యాచారం చేశావని, అసహజ రీతిలో లైంగిక వాంఛలు తీర్చమని వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దాంతో భయపడిన అమిత్‌సింగ్ కాదంబరికి పలు వాయిదాల్లో రూ.32 లక్షలు ఇచ్చారు. అయినా మరో రూ.38 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఆమె తల్లి, తండ్రి కూడా డబ్బుల కోసం బెదిరించారు. కాదంబరి సోదరుడు అంబరీష్ కూడా నొయిడా వచ్చి మిగిలిన రూ.38 లక్షలు ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేయిస్తానని హెచ్చరించారు.దీంతో బెంబేలెత్తిన అమిత్ సింగ్ నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కాదంబరికి వివిధ సందర్భాల్లో చెల్లించిన రూ.32 లక్షలు, ఆమె ఆ మొత్తాన్ని డ్రా చేసుకున్నట్టు ఆధారాలను కూడా సమర్పించారు. దాంతో పోలీసులు కాదంబరి జత్వానీ, ఆమె తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ, సోదరుడు అంబరీష్ జత్వానీతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. -
బీచ్‌లో లైంగిక దాడి.. ఆ వీడియోని పదే పదే చూపిస్తూ..
యశవంతపుర(బెంగళూరు): విద్యార్థినిపై అత్యాచారం చేసి, అనంతరం వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చేపల లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్న మునాజ్ అహమ్మద్(30) జులై 27న మంగళూరు ఎన్ఐటీకే బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యార్థినులను బెదిరించాడు. ఒక అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను ఆమెకు పదేపదే చూపించి వేధించటం ప్రారంభించాడు. బాధితురాలు మంగళూరు పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయటంతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: Hyderabad Crime News: భరించలేని తలనొప్పి, వాంతులు, నోట్లో నుంచి నురుగ వచ్చి -
ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో
మహేశ్వరం: కాబోయే భార్య అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడైన కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు. కార్తీక్‌కు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో ఏడాది కిందట వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి రామ్ కార్తీక్ ఆస్ట్రేలియా నుంచి నిత్యం ప్రగతితో వీడియో కాల్స్, వాట్సాప్ ద్వారా మాట్లాడేవాడు. ఈ సందర్భంగా ఫోన్లో ప్రగతి నగ్న వీడియోలు, ఫొటోలను రికార్డు చేశాడు. ఆరు నెలల కిందట కార్తీక్ స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా ప్రగతితో చనువుగా తిరిగాడు. కొంతకాలం తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టిన కార్తీక్.. పెళ్లికి బంగారం, నగదుతో పాటు ప్లాట్, భూమి ఇవ్వాలని ప్రగతి, ఆమె తల్లిపై పలుమార్లు ఒత్తిడి తెచ్చాడు. తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నానని.. వేరే సంబంధమైతే ఇంతకన్నా అధిక కట్నం ఇచ్చేవారని, తాను అడిగినన్ని కట్నకానుకలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ప్రగతి అశ్లీల వీడియోలు, ఫొటోలను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చదవండి: (‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా') ఇదిలా ఉండగా అక్టోబర్ 21న నిశ్చితార్థం ఉండగా, 17వ తేదీన పెద్దల మధ్య కట్నకానుల విషయంలో గొడవ జరగడంతో సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కార్తీక్ తన ఫొటోలు, వీడియోలు బయటపెడితే జీవితం నాశనం అవుతుందని భావించిన ప్రగతి అక్టోబర్ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ప్రగతి, రామ్ కార్తీక్‌ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించగా ఫొటోలు, వీడియోలు, కార్తీక్ బ్లాక్మెయిల్ విషయం వెలుగు చూసింది. ప్రగతి ఆత్మహత్యకు రామ్ బ్లాక్ మెయిల్ కారణమని నిర్ధారించిన పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అశ్లీలంతో ఎర వేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలు చేసే ఎక్స్టార్షన్ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌కు చెందిన 11 మంది నిందితులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ ముఠాపై హైదరాబాద్‌లో పది కేసులు నమోదై ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ వారిపై న్యాయస్థానం నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్లు తీసుకున్నారు. వీటి ఆధారంగా వారిని ఇక్కడకు తీసుకొస్తున్నారు. రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉండే ఆల్వార్, భరత్పూర్, మా«థుర ప్రాంతాలకు చెందిన 11 మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు అల్వార్, భరత్పూర్లలో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నకిలీ వివరాలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఆకర్షణీయమైన మహిళల ఫొటోలతో ఫేస్బుక్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. ఈ ప్రొఫైల్స్ ద్వారా ఫేస్బుక్లో ఉన్న అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. వీటిని యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్స్‌గా మారిన వాళ్లతో సైబర్ నేరగాళ్లు కొన్నాళ్ల పాటు సదరు యువతి మాదిరిగానే మెసెంజర్లో చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్సాప్ నంబర్లు ఇచ్చేలా చేస్తున్నారు. ఇంటర్నెట్ నుంచి సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్ ద్వారా తమ ఫోన్లో ఉంచి టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్లతో మాట్లాడుతూ తామే నగ్నంగా తయారవుతున్నామంటూ ఆ యాప్‌లోని వీడియోను ప్లే చేస్తున్నారు. దీంతో పూర్తిగా తమ వలలో పడిపోతున్న బాధితులను సైబర్ నేరగాళ్లు అనేక రకాలైన మాటలు చెబుతూ తాము చెప్పినట్లు చేసేలా చేస్తున్నారు. ఇలా సేకరించిన ‘వ్యక్తిగత వీడియో’లను యూట్యూబ్ చానల్స్‌లో ఉంచుతున్నారు. ఆ లింకుల్ని బాధితులకు వాట్సాప్ చేసి తాము కోరిన మొత్తం చెల్లిస్తేనే వీటిని తొలగిస్తామని, లేదంటే ఇతర సోషల్ మీడియాలో పెట్టేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా అందినకాడికి పేటీఎం, గూగుల్ పే, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆపై పోలీసుల మాదిరిగా బాధితులకు కాల్స్ చేస్తూ మరో అంకానికి తెరలేపుతున్నారు. ఇలా రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతానికి చెందిన వారినీ ఈ గ్యాంగ్ వేధించింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు మొత్తం 11 మందిని పట్టుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన 10 మంది నుంచి రూ. 89 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఈ మేరకు ఇక్కడ కేసులు ఉండటంతో ఒకటి రెండు రోజుల్లో సిటీకి తీసుకురానున్నారు. చదవండి: అతడి భార్య, ఆమె భర్త మిస్సింగ్.. పోలీసులే అవాక్కయ్యారు! హైదరాబాద్: ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? -
ఉపాధ్యాయుల ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్చి.. ఆపై
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఫోన్ నెంబర్లకు మార్ఫింగ్ చేసిన వారి ఫొటోలు పంపిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పతుడున్న చెన్నైకు చెందిన పి.తమిల్ సెల్వన్‌ను అనే యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సైకియాట్రీ విభాగంలో ఎమ్మెస్సీ చదువుతున్న ఇతగాడు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నేరం చేసినట్లు పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ వెల్లడించారు. విద్యా సంస్థల వెబ్సైట్లను బ్రౌజ్ చేసి... తమిళనాడులోని రేవతిపురం ప్రాంతానికి చెందిన తమిల్ సెల్వన్ ఇంటర్నెట్లోని అనేక వెబ్సైట్లను బ్రౌజ్ చేసేవాడు. ప్రధానంగా విద్యా సంస్థల వెబ్సైట్లలోకి ప్రవేశించే ఉపాధ్యాయుల నెంబర్లు సేకరిస్తాడు. వాటిని తన ఫోన్లో సేవ్ చేసుకోవడంతో పాటు వివిధ సాఫ్ట్వేర్స్ వాడి యజమానుల ఫొటోలు సంగ్రహిస్తాడు. వివిధ రకాలైన యాప్స్‌ను వినియోగించి ఈ ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఆ తర్వాత వాటిని ఆ ఉపాధ్యాయులకే పంపిస్తాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం క్రిప్టో కరెన్సీ రూపంలో పంపాలని బెదిరిస్తాడు. రాచకొండ పరిధిలోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల టెలిగ్రామ్ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో వచ్చింది. ఆపై ఆమెకు ఫోన్ చేసిన సెల్వన్ అభ్యంతరకరంగా మాట్లాడుతూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇతగాడు తన ఉనికి బయటపడకుండా ఉండటానికి వీపీఎన్ సహా వివిధ రకాలైన పరిజ్ఞానాలు వినియోగించాడు. అయినప్పటికీ సాంకేతికంగా ముందుకు వెళ్లిన పోలీసులు నిందితుడైన సెల్వన్‌ను గుర్తించి అరెస్టు చేసి తీసుకువచ్చారు. చదవండి: Blackmail: ‘న్యూడ్ కాల్ చేస్తావా.. ఫొటోస్ అప్లోడ్ చేయలా?’ -
బ్లాక్‌మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను
విద్య(పేరు మార్చడమైనది) పదవ తరగతి చదువుతోంది. ఫోన్లో వచ్చిన మెసేజ్‌లు చూసి, తెగ నవ్వుతుంటే తల్లి మందలిస్తూనే ఉంది. అవేమీ పట్టించుకోని విద్య ఫోన్ చూస్తూ భోజనం ముగించి, తన రూమ్‌కి వెళ్లిపోయింది. ‘ఏం పిల్లలో ఏమో..’ అనుకుంటూ తల్లి పనిలో పడిపోయింది. ఫేస్బుక్లో తన ఫొటోకు వచ్చిన లైక్‌లు చూసుకుంటూ, సంబరపడిపోతూ విద్య, స్నేహితులతో చాట్ చేస్తూ కూర్చుంది. కొత్తగా వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసి వెంటనే యాడ్ చేసుకుంది. ఆ రిక్వెస్ట్ తన క్లాస్మేట్ రమ్యది. వారం రోజులుగా రమ్యతో చాట్ చేస్తూ ఉంది. ఓ రోజు.. విద్య కత్తితో తన చేయి మణికట్టు మీద కట్ చేసుకుంది. తల్లి తండ్రి కంగారు పడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకు చేశావీపని అంటే ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విషయమంతా వివరించింది. విద్య చెప్పింది విన్న తల్లిదండ్రులు షాక్‌కి లోనయ్యారు. విద్యకు ఆన్లైన్లో పరిచయం అయిన వ్యక్తికి తన ఫొటోలే కాకుండా, చెల్లెలు డ్రెస్ మార్చుకుంటుండగా తీసిన ఫొటోలు ఆ బ్లాక్‌మెయిలర్‌కు షేర్ చేయాల్సిన పరిస్థితిని చెప్పి, తల్లిని పట్టుకుని ఏడ్చేసింది విద్య. ఇప్పుడా ఫొటోలు ఆన్లైన్లో షేర్ చేస్తానని చెబుతూ డబ్బుల కోసం తనని బెదిరిస్తున్నాడని చెప్పింది. తన క్లాస్మేట్ ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని, తన క్లాస్మేటే అనుకుని చాట్ చేస్తున్నానని, ఆ బ్లాక్‌మెయిలర్ తనకు తెలియదంది. విద్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. టార్గెట్ టీనేజర్స్ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు సదరు బ్లాక్‌మెయిలర్‌ను పట్టుకున్నారు. అతని టార్గెట్ అంతా 13 –18 ఏళ్ల అమ్మాయిలని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. కేవలం టీనేజ్ అమ్మాయిల ప్రొఫైల్స్ చూస్తూ, వాటిలోని సమాచారాన్ని చదివి, ఫేక్ అకౌంట్లు తెరుస్తుంటాడు. ఆ అకౌంట్ నుంచి సదరు అమ్మాయిల క్లాస్‌మేట్స్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతుంటాడు. ఒక సారి యాడ్ చేసుకోగానే రోజూ ఉదయమే ‘హాయ్..’తో సంభాషణ మొదలుపెడతాడు. అవతలి వ్యక్తి తన క్లాస్మేట్ అమ్మాయే కదా అనుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాడ్ చేసుకున్న అమ్మాయి చాట్ చేస్తుంటుంది. దీంతో, సదరు వ్యక్తి మంచి భాషా నైపుణ్యంతో మాటలు పెంచి, ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారమంతా తెలుసుకుని, అదను చూసి మానసికంగా దగ్గరవుతాడు. ఆ తర్వాత శరీరాకృతి గురించి, వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయడం వరకు వెళుతుంది. అమ్మాయి బాగుంటే ఫిజికల్‌గా, లేదంటే డబ్బు గురించి ట్రాప్ చేయడం మొదలుపెడతాడు. ఇవేవీ లేదంటే, ఇంట్లో ఆడవాళ్లు బాత్రూమ్లో ఉన్న ఫొటోలు, స్నేహితుల న్యూడ్ ఫొటోలు పంపించమని బెదిరిస్తాడు. ఒకసారి ట్రాప్ అయితే ఇక ఏదో ఒక సమస్యలో ఆ అమ్మాయి ఇరుక్కోవాల్సిందే. ఇలాగే ఆ బ్లాక్ మెయిలర్ వందల మందిని ఫేక్ అకౌంట్ ద్వారా మోసం చేశాడు. ఆన్లైన్ మోసగాళ్లు సైబర్ నేరస్థులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టించి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. ఒకసారి స్నేహం మొదలయ్యాక వ్యక్తిగత కథనాలను జోడిస్తారు. నమ్మకాన్ని, సానుభూతిని పొందుతారు. బాధితురాలికి నమ్మకం కలిగించడానికి, మొదట తమ ఫొటోలను పంపుతారు. కొన్నిసార్లు నగ్న చిత్రాన్ని పంపుతారు. మంచి ఫొటో, వీడియోలను పంపమని ప్రేరేపిస్తారు. అవి తమకు చేరిన తర్వాత బ్లాక్ మెయిల్, దోపిడీ ప్రారంభమవుతుంది. సరైన ఫోటోలు, వీడియోలను పంపకపోతే మార్ఫింగ్ పద్ధతిని ఎంచుకుంటారు. దోపిడీ ద్వారా వారికి డబ్బు రాకపోతే, వారు ఈ దుర్మార్గపు నెట్‌వర్క్‌లోకి ఇతర వ్యక్తులను లాగడానికి ఈ ఫొటోలను ఎరగా వాడుతారు. నకిలీ ఖాతాల గుర్తింపు.. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల సంఖ్య ఆకస్మికంగా పెరుగుతుంది ∙అవతలి వ్యక్తి ప్రొఫైల్ తేదీ గమనించాలి ∙చూడాల్సింది పేరు, ప్రొఫైల్ పిక్ కాదు. ప్రొఫైల్‌ను తనిఖీ చేయాలి. ∙ఆ ఫ్రొఫైల్లో పోస్టులు ఏమేం ఉన్నాయో చూడాలి. ఒక కారణం కోసం విరాళాలు కోరడం/ అత్యవసర పరిస్థితుల్లో రుణాలు కోరడం వంటివి ఉన్నాయేమో గమనించండి. ఆన్లైన్ రొమాన్స్‌కు సంబంధించి చిత్రాలు ఉన్నాయేమో చూడండి. సోషల్ మీడియాను సురక్షితంగా.. మీకు బాగా పరిచయం ఉన్న, నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. వారి నిజాయితీని ధృవీకరించుకోకుండా ఆన్లైన్ చాటింగ్, డేటింగ్ వంటివి చేస్తూ మానసికంగా చేరిక కాకూడదు. సన్నిహిత/ స్పష్టమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్లైన్లో ఎప్పుడూ షేర్ చేయవద్దు వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ పంచుకోకూడదు (ఫోన్ నెంబర్, ఉన్న ప్లేస్.. మొదలైనవి) అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మీ పూర్తి సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు. (ఫైనాన్షియల్, లాగిన్ క్రెడెన్షియల్స్ – ఆర్గనైజేషన్.. వంటివి) బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే సోషల్ మీడియా స్నేహితులను వ్యక్తిగతంగా కలవండి. మీ ప్రతి సోషల్ మీడియా ఖాతాకు ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను (ప్రత్యేక అక్షరాలు) ఉపయోగించండి. వాటిని తరచూ మారుస్తూ ఉండండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులకు సరైన కమ్యూనికేషన్ ఉంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు. టీనేజ్ అమ్మాయిలు సోషల్ మీడియా వేదికగా జరిగే మోసాలకు బలవకుండా మొదట్లోనే కనిపెట్టి, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి..
హుబ్లీ/కర్ణాటక: ఓ యువతి నగరానికి చెందిన వ్యక్తికి ఊహించని షాకిచ్చింది. వాట్సప్ వీడియో కాల్ చేసి అతడి అశ్లీల వీడియోను రికార్డ్ చేసి డబ్బు డిమాండ్ చేసింది. వివరాలు.. ఫేస్బుక్లో ఓ యువతి స్థానిక వ్యక్తిని పరిచయం చేసుకుంది. తరచుగా చాట్చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ క్రమంలో, ఈ నెల 13 నుంచి 16వ తేదీ మధ్యలో అతడికి వాట్సప్ వీడియో కాల్స్ చేసింది. అతడు నగ్నంగా ఉన్న సమయంలో వీడియోను రికార్డ్ చేసి దానిని సదరు వ్యక్తికి పంపి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు పంపకపోతే సోషల్ మీడియాలో సదరు వీడియోను అప్లోడ్ చేసి పరువుకు భంగం కల్గిస్తానని బెదిరించింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. చదవండి: రాసలీలల కేసు: ఢిల్లీ నుంచి వీడియో అప్లోడ్ -
నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..
హొసపేటె(కర్ణాటక): వ్యాపారవేత్తను బెదిరించి రూ.15లక్షలు దోచుకున్న మహిళ కటకటాల పాలైంది. టీబీ డ్యాం సీఐ నారాయణ తెలిపిన వివరాలు మేరకు కొప్పళ్‌లో స్టీల్ కంపెనీ పెట్టిన ఓ వ్యాపారవేత్త హొస్పేటలోని ఎంజే నగర 6వ క్రాస్‌లో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎదురుగా ఉన్న ఇంటిలో గీతా అనే మహిళ నివాసం ఉంటోంది. 2019 మార్చిలో వ్యాపారవేత్తకు, గీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఒక రోజు ఆయన్ను గీతా తన ఇంటికి ఆహ్వానించి తేనీరు ఇచ్చింది. దీంతో ఆయన మూర్ఛబోయాడు. గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత గీతా ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షల ఇచ్చి సీడీ తీసుకెళ్లాలని సూచించింది. దీంతో ఆయన గీతా బ్యాంకు ఖాతాకు రూ.15లక్షలు జమ చేశాడు. మిగితా డబ్బు కోసం గీతా ఒత్తిడి చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గీతా ఇంటిలో తనిఖీలు నిర్వహించగా 2.750 గ్రాముల గంజాయి లభించింది. గీతాతో పాటు ఆమెకు సహకరించిన కుమారుడు విష్ణును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఫ్లాట్‌లో బంధించి రెండు వారాలుగా.. జగద్గిరిగుట్టలో వ్యభిచార గృహాలపై దాడి -
చనువుగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి బ్లాక్మెయిల్
సాక్షి, గచ్చిబౌలి : స్నేహంగా ఉన్నప్పుడు తెలియకుండా తీసిన అశ్లీల ఫొటోలను ఇతరులకు పంపిన యువకుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన మేరకు.. మణికొండలో నివాసం ఉండే ఓ యువతి కూకట్‌పల్లిలోని ఫ్రింక్‌ఫిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోస్టెస్‌లో 2012లో శిక్షణ తీసుకుంది. ఆ సమయంలో స్నేహితుల ద్వారా సంగారెడ్డికి చెందిన రాడిసన్ హోటల్లో ఎఫ్ఎంబీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే అరుణ్‌రెడ్డి పరిచయం అయ్యారు. అతనితో కొద్ది రోజులు ఆ యువతి స్నేహంగా ఉండేది. 2013 తరువాత ఇద్దరు ఐదు సంవత్సరాల పాటు కలుసుకోలేదు. అరుణ్ రెడ్డి రెండేళ్లుగా ఎయిర్ హోస్టేస్ స్నేహితురాలితో చనువుగా ఉంటున్నాడు. ఇది ఇలా ఉంటే శిక్షణలో బ్యాచ్‌మేట్ అయిన వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఆరు నెలల క్రితం ఎయిర్ హోస్టెస్‌కు ఎంగేజ్మెంట్ అయ్యింది. జూలై 8న ఆమె కాబోయే భర్తతో కలిసి బర్త్ డే చేసుకుంది. ఆ ఫొటోలను భర్త ఫేస్ బుక్‌లో పెట్టాడు. ఆ ఫొటోలు చూసిన అరుణ్‌రెడ్డి ఎయిర్ హోస్టెస్ అశ్లీలమైన ఫొటోలను తన గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ఇతర స్నేహితులకు పంపాడు. అరుణ్‌రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్ కాబోయే భర్తకు పంపించింది. తనతో స్నేహంగా ఉన్నప్పుడు తనకు తెలియకుండా తీసిన అశ్లీల ఫొటోలను ఇతరులకు పంపించిన అరుణ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆగస్టు 28న రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. గురువారం నిందితుడు అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘ఐయామ్ 420’‘ప్రేమ’ వల వేసి..
గుంటూరు ఈస్ట్: ఇంజనీరింగ్ విద్యార్థిని నగ్న చిత్రాలను ‘ఐయామ్ 420’ పేరుతో ఇన్‌స్ట్ర్రాగామ్‌లో అప్లోడ్ చేసి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో మరో ఏడుగురు నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్‌లను జూన్ 27వ తేదీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి మిగిలిన నిందితుల్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం వెల్లడించారు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్) ‘ప్రేమ’ వల వేసి.. ♦ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వరుణ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి తన సహ విద్యార్థినిని వంచించాడు. ఆమె నగ్న వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు తోటి విద్యార్థులకు ఫార్వార్డ్ చేశాడు. ♦ రెండో నిందితుడైన కౌశిక్ ద్వారా ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ అనే విద్యార్థులకు చేరాయి. ♦ వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ♦ వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్ 420’ అనే పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్ చేశాడు. ♦ ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా కోరగా.. నిందితులు దొరికిపోతామన్న భయంతో అకౌంట్ నంబర్ పంపకుండా మిన్నకుండిపోయారు. ♦ ఆ యువత ధైర్యం చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ♦ ఫేక్ అకౌంట్‌ను ఛేదించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో అర్బన్ టెక్నికల్ అనాలసిస్ టీమ్ ఇన్చార్జి విశ్వనాథరెడ్డి, సాంకేతిక సిబ్బంది విశేష కృషి చేశారని ఎస్పీ చెప్పారు. ♦ నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు. ♦ దీనివల్ల వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన దిశ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ, ఎస్ఐలు కోటయ్య, బాజీ బాబులను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. -
మీరేమన్నా అంటే.. చచ్చిపోతా..!
హిమాయత్‌నగర్ : ‘ఓ వ్యక్తిపై యజమానురాలు ఇంటి అద్దె చెల్లించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఆ వ్యక్తిని పోలీసులు పిలిచి మందలించారు. దీంతో ఆ వ్యక్తి ‘మీరేమన్నా అంటే.. నేను చచ్చిపోతా.. అంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ముగ్గురు క్యాబ్డ్రైవర్లు, ఐదారుగురు ఫుడ్ డెలివరీ బాయ్స్ తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వ్యక్తిని పిలిచి విచారించగా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. నన్ను పీఎస్‌కు పిలిచి మందలిస్తారా.. మీ పద్ధతి ఏం బాగోలేదు’ అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఇదీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిరోజులుగా జరుగుతున్న వ్యవహారం. ఇది మీ పద్ధతి కాదు అని హెచ్చరించినందుకే వీరిద్దరూ పోలీసులపై తిరగబడి వింతగా ప్రవర్తిస్తున్నారు. నీ పేరు రాసి చచ్చిపోతా.. హైదర్‌గూడలో పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ వృద్ధురాలి ఇంట్లో ప్రకాశరావు అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నారు. జనవరిలో వృద్ధురాలి ఇంట్లో కి అద్దెకు దిగారు. అప్పటి నుంచి సరిగ్గా ఇంటి అద్దె కూడా ఇవ్వలేదు. అద్దెకు దిగేప్పుడు రూ.50 వేలకు ఓ చెక్కును ఇచ్చాడు. అసలు ఇతగాడికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. వృద్ధురాలు అద్దె కావాలి అనడంతో అప్పుడప్పుడు రూ.2వేలు ఇచ్చేవాడు. ఈ విషయంపై వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పిలిచి మందలించారు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు ఇస్తావా..? అంటూ వృద్ధురాలిని వేధించడం మొదలు పెట్టాడు. ట్యాంక్‌బండ్‌పై సూసైడ్ స్లిప్‌తో.. తన వేధింపులు భరించలేకపోతున్నా అంటూ వృద్ధురాలు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మళ్లీ ఆ వ్యక్తిని పీఎస్‌కి పిలిపించారు. పద్ధతి మార్చుకుని ఆమెకు అద్దె డబ్బులు ఇవ్వాలని చెప్పారు. దీంతో ‘మీరేమన్నా అంటే నేను చచ్చిపోతా’ అంటూ పోలీసులను బ్లాక్మెయిల్ చేశాడు. ‘నన్ను నారాయణగూడ పోలీసులు వేధిస్తున్నారు. నాకు బతకాలని లేదు.. చచ్చిపోతా’ అంటూ సూసైడ్ నోట్ రాసుకుని లేక్‌పోలీస్ స్టేషన్ ఎదురుగా తిరుగుతున్నాడు. అనుమానం వచ్చిన లేక్ పోలీసులు ఓ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఉన్నతాధికారిని కలిసి సూసైడ్ నోట్ చూపించాడు. విషయం గురించి ఉన్నతాధికారి నారాయణగూడ ఇన్స్పెక్టర్ బండారి రవీందర్‌కు ఫోన్ చేసి అడగడంతో ఇతడి లీలలు వివరించారు. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ వద్దకు పంపారు. ఇది సివిల్ మ్యాటర్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆస్కారం లేదు అని చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను నన్ను వేధిస్తున్నారంటూ వారిపై కేసు వేయాలని లాయర్‌ను కూడా సంప్రదించాడు. క్యాబ్, ఫుడ్ఆర్డర్ డబ్బులు ఎగ్గొట్టాడు నారాయణగూడ పీఎస్ పరిధిలోని బర్కత్‌పుర సిగ్నల్ వద్ద ఓ ఇంట్లో చంద్రశేఖర్ భార్యతో కలిసి ఉంటున్నాడు. పనుల నిమిత్తం పలుమార్లు ఓలా, ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని పని నిమిత్తం నగరంలోని పలు ప్రాంతాలకు తిరిగి ఇంటికి చేరతాడు. పర్సులో డబ్బులు సరిపడా లేవు తీసుకొస్తా అని ఇంటిపైకి వెళ్తాడు. మళ్లీ బయటకు రాడు. నచ్చిన ఫుడ్‌ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు. డెలవరీ బాయ్ ఎంతసేపు పిలిచినా స్పందన ఉండదు. పలుమార్లు కాలింగ్ బెల్ కొడితే భార్య బయటకు వచ్చి ఆయన ఇంట్లో లేరు అని చెబుతుంది. దీంతో క్యాబ్డ్రైవర్లు, ఫుడ్‌డెలివరీ బాయ్స్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరిలా నన్ను నిందించడం సరికాదు క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిని పీఎస్‌కు పిలిపించి విచారించారు. నేను ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదంటూ బదులిచ్చాడు. దీంతో పోలీసులు మందలించడంతో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? పీఎస్‌కు పిలిపించి నిందించడం సరికాదు’ అంటూ పోలీసులపైనే ఎదురు దాడికి దిగడంతో అందరూ అవాక్కయ్యారు. -
బ్లాక్ మెయిల్ కేసులో పోలీసులు అరెస్ట్
చిత్తూరు: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారులే దాన్ని తుంగలో తొక్కుతున్నారు. మదనపల్లిలో ఓ బ్లాక్ మెయిల్ కేసులో రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన ఘటనలో ఒక కానిస్టేబుల్, హోంగార్డు వెంకటరమణతో పాటు శివకుమార్ అనే మరో వ్యక్తి అరెస్టయ్యారు. ఈ ఘటనలో వారి వద్ద నుంచి రెండు కార్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామని మదనపల్లి టూటౌన్ పోలీసులు తెలియజేశారు.