నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి.. | Mother And Son Arrested In Blackmail Case In Karnataka | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మెయిల్‌ కేసులో తల్లీ, కొడుకు అరెస్ట్‌

Published Mon, Mar 8 2021 6:26 AM | Last Updated on Mon, Mar 8 2021 3:10 PM

Mother And Son Arrested In Blackmail Case In Karnataka - Sakshi

నిందితురాలు గీత

2019 మార్చిలో  వ్యాపారవేత్తకు, గీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఒక రోజు  ఆయన్ను గీతా తన ఇంటికి ఆహ్వానించి తేనీరు ఇచ్చింది. దీంతో ఆయన మూర్ఛబోయాడు.

హొసపేటె(కర్ణాటక):  వ్యాపారవేత్తను బెదిరించి రూ.15లక్షలు దోచుకున్న మహిళ కటకటాల పాలైంది. టీబీ డ్యాం సీఐ నారాయణ తెలిపిన వివరాలు మేరకు  కొప్పళ్‌లో స్టీల్‌ కంపెనీ పెట్టిన ఓ వ్యాపారవేత్త  హొస్పేటలోని ఎంజే నగర 6వ క్రాస్‌లో  కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎదురుగా ఉన్న ఇంటిలో గీతా అనే మహిళ నివాసం ఉంటోంది. 2019 మార్చిలో  వ్యాపారవేత్తకు, గీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఒక రోజు  ఆయన్ను గీతా తన ఇంటికి ఆహ్వానించి తేనీరు ఇచ్చింది. దీంతో ఆయన మూర్ఛబోయాడు.

గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత గీతా ఫోన్‌ చేసి నీ నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షల ఇచ్చి సీడీ తీసుకెళ్లాలని సూచించింది. దీంతో ఆయన  గీతా బ్యాంకు ఖాతాకు రూ.15లక్షలు జమ చేశాడు. మిగితా డబ్బు కోసం గీతా ఒత్తిడి చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు గీతా ఇంటిలో తనిఖీలు  నిర్వహించగా 2.750 గ్రాముల గంజాయి లభించింది.  గీతాతో పాటు ఆమెకు సహకరించిన కుమారుడు విష్ణును అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ తెలిపారు.
చదవండి:
బంజారాహిల్స్‌: ఫ్లాట్‌లో బంధించి రెండు వారాలుగా..
జగద్గిరిగుట్టలో వ్యభిచార గృహాలపై దాడి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement