Mother and son
-
కొడుకుపై కోపంతో 82 ఏళ్ల తల్లి నామినేషన్
జగిత్యాల: ఆమె 82 ఏళ్ళ వృద్ధురాలు .. భర్త స్వాతంత్య్ర సమరయోధుడు.. కుమారుడు విదేశాలకు వెళ్లి వచ్చాడు.. కానీ తల్లికి చెందిన భూమిని ఆమెకు తెలియకుండానే అమ్మేసుకున్నాడు. దాంతో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అష్టకష్టాలు పడుతూ.. న్యాయం చేయాలని ఏకంగా సీఎం కేసీఆర్‌కు సైతం లేఖ రాసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తే పదిమందికీ తెలిసి తన సమస్య పరిష్కారం అవుతుందని ఆ పెద్దావిడ భావించి నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు చీటి మురళీధర్ భార్య, 82ఏళ్ల చీటి శ్యామల మంగళవారం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి తన గోడును వెళ్లబోసుకున్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్ విదేశాలకు వెళ్లి వచ్చి తమకు తెలియకుండానే తమ స్థలాన్ని అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై నిరసనగా.. తన సమస్య పరిష్కారం కావాలనే నామినేషన్ వేశానని ఆమె చెప్పుకొచ్చారు. -
కొడుకు కొట్టాడని.. ఇంటి నుంచి వెళ్లిన తల్లి.. చివరికి శవమై ఇలా..!
మహబూబ్‌నగర్: మద్యం మత్తులో ఉన్న కుమారుడు తల్లిని కొట్టడంతో మనస్తాపానికి గురై మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఆదివారం కోయిల్‌సాగర్ కుడి కాల్వలో శవమై కనిపించిన ఘటన పూసల్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసల్‌పహాడ్‌కు చెందిన రాధమ్మ(45) కుమారుడు శివకుమార్‌రెడ్డి ఈ నెల 14న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇలా రోజూ మద్యం తాగి ఇంటికి వస్తే కుటుంబం ఎలా గడుస్తుందని తల్లి కుమారుడిని నిలదీసింది. ఆగ్రహానికి గురైన కుమారుడు తల్లిని కొట్టాడు. ఆమె మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకి లభించలేదు. బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా లాభం లేకపోయింది. భర్త రాజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చివరకు అనుమానం వచ్చిన గ్రామస్తులు కోయిల్‌సాగర్ కుడి కాల్వకు వస్తున్న నీటిని నిలిపివేయించారు. మూడు రోజుల తర్వాత వెంకటాపూర్ గ్రామ శివారులో కుడి కాల్వ ముళ్లపొదలో చిక్కుకున్న రాధమ్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. నారాయణపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమర్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలియజేశారు. -
42 ఏళ్లకు అమ్మను చూశాడు!
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్ థైడెన్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో ఉంటూ లాయర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్‌లో థైడెన్ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది. -
TS Crime News: సొంత తల్లినే.. మరొకరితో కలిసి గొంతు కోసి, కాళ్లు నరికేసి.. హత్య!
సంగారెడ్డి: మానవత్వం మంటగలిసింది. మాతృప్రేమ, అప్యాయత అనురాగాలు పంచే కన్నతల్లి పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకే కాలయముడయ్యాడు. మరొకరితో కలిసి గొంతు కోసి, కాళ్లు నరికేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ మైలారంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత (తెల్లారితే గురువారం) జరిగింది. పది గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి నిందితులిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను గురువారం గజ్వేల్ రూరల్ సీఐ జానకిరాంరెడ్డి, ములుగు ఎస్సై విజయకుమార్ వెల్లడించారు. బండ మైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ(45) భర్త చనిపోగా, చిన్న దుకాణం నడుపుతూ కొడుకు ఈశ్వర్(23)తో కలిసి ఉంటుంది. కూతురు శైలజకు వివాహమైంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు వెంకటమ్మను హత్యచేశారని కూతురు శైలజకు చిన్నమ్మ ఫోన్‌చేసి చెప్పింది. అక్కడికి చేరుకున్న కూతురు మెడ కోసి, రెండు కాళ్లు నరికేసిన స్థితిలో విగతజీవిగా పడిఉన్న తల్లి మృతదేహాన్ని చూసి బోరుమన్నది. తల్లిని హతమార్చి కాళ్లకున్న వెండి కడియాలు దొంగలించుకుపోయారని ఆమె ములుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లితో తరచూ గొడవపడే సోదరుడు ఈశ్వర్, సమీప బంధువు పర్వతం రాము(21)తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎస్సై విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా రూరల్ సీఐ జానకిరాంరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులైన ఈశ్వర్, రాములను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తనకు పెళ్లి చేయడం లేదనే కారణంతోనే కొత్తూరుకు చెందిన రాముతో కలిసి తల్లిని హత్యచేశానని, ఎవరికీ అనుమానం రాకూడదనే కాళ్లు నరికి వెండి కడియాలు దొంగిలించామని ఈశ్వర్ నేరం అంగీకరించాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకుని కోర్టులో రిమాండ్ చేశామని రూరల్ సీఐ పేర్కొన్నారు. -
Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు..
ఇంఫాల్: మణిపూర్‌లో తవ్వేకొద్దీ దారుణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ చేతికి మొత్తం 20 కేసులను అప్పగించగా తాజాగా వారికి మరో సంచలనాత్మక కేసును అప్పగించారు మణిపూర్ పోలీసులు. ఆనాటి అల్లర్లలో బులెట్ గాయమైన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న తల్లి, మేనత్తలను బిడ్డతో సహా సజీవ దహనం చేసిన ఈ సంఘటన అధికారులను సైతం కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4న టాన్సింగ్(7) సహాయక శిబిరంలో ఉండగా మెయిటీ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో ఒక బులెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. వెంటనే సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడి ఎస్పీతో మాట్లాడి బాలుడి తోపాటు తల్లి, మేనత్తలను మాత్రమే వెంట ఆసుపత్రికి పంపాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కుకీ తెగకు చెందిన వారు కాగా తల్లి మీనా హాంగ్సింగ్ మాత్రం మెయిటీ తెగకు చెందింది. ఆమెనైతే మెయిటీలు ఏమీ చేయరన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు. అధికారి చెప్పినట్టుగానే బాలుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్పీ. అంబులెన్స్ కు తోడుగా ఇంఫాల్ వెస్ట్ సూపరింటెండెంట్ సహా పోలీసుల ఎస్కార్టును కూడా పంపించారు ఆర్మీ ప్రతినిధులు. సరిగ్గా ఇంఫాల్ సరిహద్దుకు చేరుకోగానే సుమారు 2000 మంది గుంపు చుట్టూ మూగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంచెం వెనక్కి తగ్గినట్టే తగ్గి అలరిమూక ఒక్కసారిగా దాడి చేసి అంబులెన్సుకు నిప్పు పెట్టేశారు. పోలీసులు చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో చిక్కుకోగా అందులోని బాలుడు, అతడి తల్లి, మేనత్త సజీవ దహనమయ్యారు. బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కాంగ్పోక్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. లాంఫెల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే కేసు నమోదైంది. దీంతో సీబీఐ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి రెండు కేసులు ఒక్కటేనని తేల్చి దర్యాప్తు చేసే పనిలో పడింది. మణిపూర్‌లో రెండున్నర నెలలుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
భూమికోసం తల్లిని చంపిన తనయుడు
కరీంనగర్: కన్న కొడుకే కాలయముడయ్యాడు. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లి తమ్మనవేణి కనుకవ్వ(60)ను భూమికోసం దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తమ్మనవేణి కనుకవ్వ(60)కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు వినోద్ ఉన్నాడు. భర్త గతంలోనే చనిపోవడంతో అన్నీతానై పిల్లలను సాకి ప్రయోజకులను చేసింది. కూతుళ్లు, కుమారుడి వివాహలు చేసింది. భర్త తరఫున వచ్చిన ఎకరం భూమిని తన కొడుకు వినోద్ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. తనతల్లిగారి తరఫున వచ్చిన రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్నకూతురుతో కలిసి ఉంటోంది. కొద్దిరోజులుగా తల్లిగారిల్లు రేణికుంటలో ఒక్కతే అద్దెకు ఉంటోంది. రెండెకరాలపై కన్నేసిన కొడుకు.. తండ్రి తరఫున వచ్చిన ఎకరం తీసుకున్న కొడుకు వినోద్.. కనుకవ్వ పుట్టింటివారు ఇచ్చిన భూమి కూడా తనకే కావాలని రెండేళ్లుగా గొడవ పడుతున్నాడు. అది కూతుళ్లకు ఇస్తుందనే అనుమానంతో గతేడాది పంటలు వేయకుండా అడ్డుకున్నాడు. అయినా తల్లి భూమి రిజిస్ట్రేషన్ చేయలదు. దీంతో ఈ ఏడాది బలవంతంగా భూమి లాక్కుని, కౌలుకు ఇచ్చాడు. దీంతో గొడవలు పెద్దవయ్యాయి. గండ్లు పూడ్చేందుకు వెళ్లి.. ఇటీవల కురిసిన వర్షాలకు వరద పోటెత్తడంతో జంగపల్లి శివారులోని వ్యవసాయ భూమిలో గండ్లుపడ్డాయి. వాటిని పూడ్చేందుకు వినోద్ బుధవారం ఉదయం వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కనుకవ్వ కూడా పొలం వద్దకు వెళ్లింది. తన భూమిలో ఎందుకు సాగు చేస్తున్నావని కొడుకును అడిగింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆవేశానికి లోనైన వినోద్.. తన చేతిలోని పారతో తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో కనుకవ్వ తీవ్రగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. కూతుళ్లు ఇచ్చిన సమాచారం మేరకు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎల్ఎండీ, గన్నేరువరం ఎస్సైలు ప్రమోద్‌రెడ్డి, నర్సింహారావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
కర్మకాండలు సైతం పూర్తి..తిరిగొచ్చిన అమ్మ...
-
అమ్మ మృతదేహంతో ఆరు నెలలు
ఒక వ్యక్తి గడచిన ఆరు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఉంటున్నాడు. ఇరుగుపొరుగువారికి తన తల్లి విదేశాల్లో ఉంటున్నదని ఇన్నాళ్లూ అబద్ధం చెబుతూ వచ్చాడు. అయితే అతని వ్యవహారం ఎట్టకేలకు పోలీసుల చొరవతో బహిర్గతమయ్యింది. ఆ వ్యక్తి గత ఆరేళ్లుగా తల్లి మృతదేహాన్ని ఎందుకు అలానే ఉంచాడో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పెన్షన్ అందుకునేందుకే తాను తన తల్లి మృతదేహాన్ని ఉంచానని తెలిపాడు. అతను తన తల్లి రిటైర్మెంట్ ఫండ్ సొమ్మును ప్రతినెలా అందుకుంటున్నాడు. నిందితుని వయసు 60 ఏళ్లు. అతని పేరు వెల్లడికాలేదు. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుని తల్లి పేరు హెల్గా మారియా హ్యాంబర్త్. ఈ ఉదంతం ఇటలీలో చోటుచేసుకుంది. అతను తన ఇరుగుపొరుగువారితో తన తల్లి హెల్గా తమ దేశమైన జర్మనీకి తిరిగి వెళ్లిపోయిందని చెబుతూ వస్తున్నాడు. తల్లి మృతదేహంతో పాటు ఉంటూ నిందితుడు ఇప్పటివరకూ 156,000 పౌండ్లు (సుమారు రూ. 1.59 కోట్లు) అందుకున్నాడు. పోలీసులు ఇటీవలే ఇతని గుట్టును రట్టు చేశారు. మే 25న పోలీసులు ఎమర్జెన్సీ సర్వీస్ కోసం అతను ఉంటున్న బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నిందితుడు తన తల్లి హెల్గా మృతదేహాన్ని ఒక బ్యాగులో దాచి, బెడ్‌పైన ఉంచాడు. అతను ఇంటిలో లేడు. హెల్గా కరోనా వైరస్‌కు సంబంధించి తన హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డు కోసం అప్పటివరకూ దరఖాస్తు చేయలేదు. ఈ నేపధ్యంలోనే పోలీసులు ఆమెను సంప్రదించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమానంతో ఇంటిలో తనిఖీలు చేశారు. అప్పుడు వారికి హెల్గా మృతదేహం లభ్యమయ్యింది. వెంటనే వారు హెల్గా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరణించిన తల్లి పెన్షన్‌ను నిందితుడు ఎలా తీసుకుంటున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి: బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే.. -
తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్ రావడంతో..
కర్ణాటకలోని ఓ రైల్వేస్టేషన్లో... త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక తల్లి కొడుకులు ట్రైయిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో తల్లి మరో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లేందుకని.. రైల్వే ట్రాక్ క్రాస్ చేసి తొందరగా వెళ్లిపోవచ్చు అనుకుంది. అందులో భాగంగానే రైల్వే పట్టాలపైకి వచ్చింది. అంతే ఇంతలో అటువైపుగా ఒక గూడ్స్ రైలు వేగంగా వస్తోంది. దీన్ని గమినించిన కొడుకు వెంటనే స్పందించి...తల్లిని కాపాడుకునేందకు పట్టాలపై దిగాడు. రైల్వే ఫ్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులంతా ఆ తల్లి కొడుకులు అయిపోయారనుకుని.. నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని కల్బుర్డిలోని రైల్వే ఫ్లాట్‌ఫాంలో చోటు చేసుకుంది. ఐతే ఆ తల్లికొడుకులిద్దరు పట్టాలకు, ఫ్లాట్‌ఫాంకికు మధ్యలో కదలకుండా ఒకవైపుకి ఒకరినొకరు పట్టుకుని ఒరిగిపోయి కుర్చొన్నారు. పాపం వాళ్లు ట్రైయిన్ వెళ్లేంతవరకు అలా ఊపిరి బిగబెట్టుకుని కుర్చొన్నారు. స్టేషన్లో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా టెన్షన్‌గా చూస్తున్నారు. ఇంతలో ట్రైయిన్ వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ తల్లి కొడుకులు బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన నెట్టింట వైరల్ అవుతోంది. Narrow Escape For Karnataka Mother, Son Caught Between Train, Platform https://t.co/VldSfF18fq pic.twitter.com/MXiLp72p9C — NDTV News feed (@ndtvfeed) December 8, 2022 (చదవండి: గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్ చార్లెస్) -
కొడుకు ఒడికి చేరిన తల్లి
కర్లపాలెం(బాపట్ల): ఊరు కాని ఊరు.. భాష రాక, తిరిగొచ్చే దారి తెలీక నాలుగేళ్ల క్రితం తప్పిపోయి ఓ మారుమూల రాష్ట్రంలో నరకయాతన అనుభవిస్తున్న 62ఏళ్ల వృద్ధురాలికి బాపట్లకు చెందిన ఓ వ్యక్తి జవాను ఆదుకున్నాడు. ఆమెను తన కుమారుడి దగ్గరకు చేర్చాడు. తెలంగాణలోని గద్వాల్ జిల్లా కుర్తిరవాళ్ గ్రామానికి చెందిన సోంబార్ నాగేశమ్మ 2018లో తన ఇంటి నుంచి అదృశ్యమై అసోంలోని చకోర్ జిల్లా చిల్‌చార్ సిటీకి చేరుకుంది. అక్కడి భాష రాక మానసిక వేదనతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. అయిన వారు లేక నాగేశమ్మ రోజురోజుకీ మానసికంగా కుంగిపోతోంది. ఇంతలో ఓ రోజు అక్కడే జవానుగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నక్కలవానిపాలెం గ్రామానికి చెందిన ఎన్. వెంకట నరేష్ తోటి జవాన్లతో కలిసి ఆ వృద్ధాశ్రమానికి ఈ నెల 21న వెళ్లాడు. అక్కడున్న వృద్ధ మహిళల మంచిచెడులు తెలుసుకుంటుండగా నాగేశమ్మ గురించి తెలిసింది. ఆమెను నరేష్ తెలుగులో పలకరించి ధైర్యం చెప్పాడు. ఆమె వివరాలు తెలుసుకుని తెలంగాణలోని ఓ న్యూస్ చానెల్ ప్రతినిధికి తెలియబర్చి వారిద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. వీడియో కాల్ ద్వారా తన తల్లిని గుర్తించిన ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు హుటాహుటిన అసోం వెళ్లి తన తల్లిని తీసుకుని వచ్చాడు. -
హృదయవిదారకం.. తల్లి ప్రేమ ఓడింది
గుంటూరు: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న 13నెలల కొడుకుతో కలిసి నవ్వుతూ.. తుళ్లుతూ ద్విచక్రవాహనంపై ఊరు బయలుదేరిన ఆ తల్లిదండ్రుల ఆనందం అంతలోనే ఆవిరైంది. అప్పటివరకు అమ్మఒడిలో కేరింతలు కొడుతూ ముద్దుముద్దు పలుకులుతో మురిపించిన పుత్రుడు క్షణకాలంలో లారీ రూపంలో వచ్చిన మృత్యుఒడిలోకి జారిపోతుంటే తల్లడిల్లిన ఆ తల్లి కాపాడుకునేందుకు ఒక్క ఉదుటన కిందకు దూకినా ఫలితం లేకపోయింది. పసివాడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ తల్లీ మృత్యువుతో పోరాడుతోంది. ఓ వైపు విగతజీవిగా మారిన కొడుకు, మరోవైపు తీవ్రగాయాలతో రక్తమోడుతున్న భార్యను చూసి ఆ భర్త ఘటనా స్థలంలోనే తీవ్రంగా విలపించాడు. ఈ హృదయవిదారక ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్ల మండలం కామేపల్లికి చెందిన ఏపూరి కొండలరావు, యశోద దంపతులు. వీరు కొడుకు తేజ ఈశ్వర్‌ఆదిత్య(13నెలలు)ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొండలరావు శుక్రవారం భార్య యశోద, కుమారుడు తేజ ఈశ్వర్ ఆదిత్యతో కలిసి కళ్లేపల్లిలోని అత్తగారింటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. పొందుగల సమీపంలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై తల్లి ఒడిలో ఉన్న తేజ ఈశ్వర్‌ఆదిత్య కిందపడిపోయాడు. అతడిని కాపాడేందుకు తల్లి యశోద కూడా కిందకు దూకింది. అంతలోనే ఇద్దరిపై నుంచి లారీ వెళ్లటంతో తేజ ఈశ్వర్‌ఆదిత్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. యశోద తీవ్రంగా గాయపడింది. కొండలరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కొడుకు మృతిచెందటం.. భార్య తీవ్రంగా గాయపడటంతో కొండలరావు ఘటనాస్థలంలో విలపించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది. స్థానికులు వెంటనే స్పందించి యశోదను 108 వాహనం ద్వారా చికిత్స కోసం పిడుగురాళ్లకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ఘటన స్థలాన్ని సీఐ షేక్ బిలాలుద్దీన్, ఎస్ఐ దాసరి నాగరాజు, సంధ్యారాణి, ఏఎస్ఐ కృష్ణారావు పరిశీలించారు. తేజ ఈశ్వర్ ఆదిత్య మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్ ట్విస్ట్
దొండపర్తి (విశాఖ దక్షిణ): తన వద్ద పైసా లేనప్పటికీ... రూ.30 లక్షలు ఉన్నాయని గౌరమ్మ అందరికీ గొప్పలు చెప్పుకుంది. బంగారాన్ని ఓ ఫైనాన్స్ సంస్థ లో పెట్టినట్లు హెచ్చులకు పోయింది. దీంతో ఆ డబ్బులపై కన్నేసిన ఇద్దరు స్నేహితులు ఆమెతోపాటు కుమారుడు పోలారెడ్డిని సైతం హత్య చేశారు. అనంతరం ఆమె ఇళ్లంతా వెతకగా కేవలం రూ.2 వేలు మాత్రమే దొరకడంతో వారు చెన్నైకు పారిపోయారు. చదవండి: టాలీవుడ్ నటిపై అత్యాచారం! దువ్వాడలో జరిగిన తల్లీకొడుకు మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. అయిదు రోజులపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి హంతకులను చెన్నైలో పట్టుకున్నారు. వ్యాపారంలో నష్టపోయిన పెదగంట్యాడకు చెందిన సలివెందుల చైతన్య(32), అతని స్నేహితుడు గుంటూరు నివాసి మంద కిశోర్‌బాబు(32)ను అరెస్ట్ చేశారు ఈ కేసు∙వివరాలను మంగళవారం పోలీస్ కమిషనరేట్‌లో మీడియా సమావేశంలో కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మంగి గౌరమ్మ (52) తన కుటుంబంతో కలిసి పెదగంట్యాడ సమీప మదీనాబాగ్ ప్రాంతంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ బ్లాక్ నంబర్– 3లో నివాసముంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మస్కట్‌లో ఉండగా.. మిగిలిన వారందరూ అదే బ్లాక్‌లో వేర్వేరు ఫ్లాట్లలో నివాసముంటున్నారు. గౌరమ్మ, ఆమె ఎదురు ఫ్లాట్‌లో ఉంటున్న ఒక కుమారుడు మంగి పోలారెడ్డి(36) మదీనాబాగ్‌లో ఉన్న గవర్నమెంట్ వైన్‌షాప్ పక్కన చికెన్ కబాబ్, ఫిష్ ఫ్రై అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రూ.30 లక్షలు ఉన్నట్లు గొప్పలు గౌరమ్మ తన వద్ద డబ్బులు లేకపోయినప్పటికీ రూ.30 లక్షలు ఉన్నాయని, భూమిని కూడా కొనుగోలు చేయడానికి చూస్తున్నానని అందరికీ చెప్పుకుంటూ ఉండేది. అలాగే తన వద్ద భారీగా బంగారం ఉందని, వాటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో పెట్టినట్లు ప్రచారం చేసుకునేది. ఇదేవిధంగా ఆ వైన్‌షాప్‌నకు వచ్చిన సలివెందుల చైతన్య, మందకిషోర్బాబుకు కూడా చెప్పింది. క్యాంటీన్ నిర్వహణకు డబ్బుల కోసం... సలివెందుల చైతన్య ఏడాది క్రితం ఎస్టీబీఎల్‌లో రాయలసీమ రుచులు అనే రెస్టారెంట్ పెట్టి రూ.16 లక్షలు నష్టపోయాడు. అనంతరం ఇంట్లో గొడవలు జరగడంతో రెండు నెలల క్రితమే మదీనాబాగ్‌కు మకాం మార్చాడు. గౌరమ్మ దుకాణం పక్కన ఉన్న వైన్‌షాప్‌నకు వచ్చి మద్యం కొనుగోలు చేసేవాడు. ఇదే క్రమంలో గౌరమ్మ, అతడి కుమారుడు పోలారెడ్డితోపాటు మస్కట్‌లో ఉంటున్న గౌరమ్మ కుమార్తె సంతోషితో కూడా పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే చైతన్య స్టీల్‌ప్లాంట్ క్యాంటీన్ కాంట్రాక్ట్‌ను రూ.12 లక్షలకు పాడగా రూ.6 లక్షలు వెంటనే కట్టాల్సి వచ్చింది. దీంతో అంతకు ముందే గౌరమ్మ తన వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని చెప్పడంతో వాటిని చేబదులుగా ఇవ్వాలని ఆమెను కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు. చైతన్య తనకు పరవాడలో కొంత స్థలం ఉందని, దానిని కొనుగోలు చేసి డబ్బు ఇవ్వమని అడిగాడు. దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె వద్ద ఉన్న డబ్బులు ఎలాగైనా కాజేయాలని స్నేహితుడు కిషోర్‌బాబుతో కలిసి పథకం వేశాడు. క్లోరోఫామ్ పెట్టి చంపాలనుకొని.. గౌరమ్మను హత్య చేసి డబ్బు కాజేయాలని చైతన్య, కిషోర్‌బాబు అనేక రకాలుగా ప్లాన్లు వేసుకున్నారు. ముందుగా క్లోరోఫామ్ పెట్టి చంపాలని భావించారు. అయితే అది డాక్టర్ ప్రి్రస్కిప్షన్ లేకుండా దొరకదని తెలుసుకున్నారు. అదే సమయంలో ఈ నెల 7న రాత్రి పోలారెడ్డి తన అక్క సంతోషితో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఫోన్ మధ్యలో కట్ అయింది. దీంతో అక్కడే ఉన్న చైతన్య తన మొబైల్ నుంచి వీడియో కాల్ చేసి అందరూ మాట్లాడారు. అనంతరం మద్యం తాగడానికి వెళ్దామని చెప్పి పోలారెడ్డిని చైతన్య, కిషోర్‌బాబు తీసుకెళ్లారు. వైన్షోప్లో మద్యం కొనుగోలు చేసి కొంత తాగాక... పథకం ప్రకారం మిగిలినది ఇంట్లో తాగుదామని చెప్పారు. దీంతో దుకాణం మూసి వేసిన తర్వాత చైతన్య, కిశోర్‌బాబు తమ బైక్‌ల మీద గౌరమ్మ, పోలిరెడ్డిలను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఇద్దరూ పోలిరెడ్డి చేతులను టవల్‌తో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. కూరగాయల కత్తితో అతడితోపాటు గౌరమ్మను కూడా హత్య చేశారు. అనంతరం ఇళ్లంతా వెతకగా కేవలం రూ.2 వేలు మాత్రమే దొరికింది. అలాగే బీరువాలో ఉన్న నగలను కూడా తీసుకొని ఇంట్లో కారం చల్లి తమ బైక్‌లపై వెళ్తూ మధ్యలో ఆగి వస్తువులను తనిఖీ చేయగా అవి రోల్డ్‌గోల్డ్‌గా గ్రహించారు. వాటితోపాటు హత్యకు ఉపయోగించిన కత్తి, వారు తాగిన మందుబాటిల్, గ్లాసులు, కారం డబ్బాను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి తుప్పల్లో పడేసి యలమంచిలి వైపుగా వెళ్లిపోయారు. కుమార్తె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. మస్కట్‌లో ఉన్న సంతోషి తన తల్లి గౌరమ్మకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆ విషయాన్ని తన సోదరుడి కుమారుడు కల్యాణ్ రెడ్డికి చెప్పింది. దీంతో కల్యాణ్ ఇంటికి వెళ్లి చూడగా.. లోపల వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించారు. బెడ్రూమ్లో గౌరమ్మ, పోలిరెడ్డి రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించాడు. దీంతో అతడు 8వ తేదీన దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులను తప్పుదోవ పట్టించిన కోడలు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించారు. గౌరమ్మ కుటుంబ సభ్యులు ఆమె కోడలు దేవిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు చెప్పింది. హత్యకు గల కారణాలపై ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. మరోసారి తన భర్త హత్య చేశాడని, ఇంకోసారి అదే ప్రాంతంలో ఉన్న మరో నలుగురు హత్యచేశారని చెప్పింది. దీంతో పోలీసులు వారందరినీ విచారించగా ఈ హత్యలతో వారికి సంబంధం లేనట్లు నిర్ధారణైంది. ఒక్కోసారి ఒక్కో విధంగా ఆమె చెబుతుండడంతో కేసు ముందుకు సాగలేదు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనట్లు గ్రహించిన పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో తిరిగిన వారిని గుర్తించారు. చెన్నైలో హంతకుల అరెస్ట్ తల్లీ కొడుకులను హత్య చేసిన అనంతరం చైతన్య తన భార్యకు ఫోన్ చేసి గుంటూరులో పని ఉందని, అర్జెంట్‌గా రెడీ అవ్వాలని చెప్పాడు. గుంటూరులో ఆమెను పుట్టింట్లో వదిలేసిన చైతన్య, స్నేహితుడు కిషోర్‌బాబుతో కలిసి చెన్నైకు పారిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలు, వారి ఫోన్ నంబర్లు ఆధారంగా వారు తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.500 నగదు, రెండు బుల్లెట్ వాహనాలు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో అవాంతరాలు ఎదురైనా చాకచక్యంగా హంతకులను పట్టుకున్న ఏసీపీ(క్రైమ్) సీహెచ్.పెంటారావు, సౌత్ డివిజన్ క్రైమ్ సీఐ పి.సూర్యనారాయణ, సీసీఎస్ సీఐ బి.ఎం.డి.ప్రసాద్, హార్బర్ సీఐ ఎం.అవతారం, దువ్వాడ క్రైమ్ ఎస్ఐ కె.నరసింగరావు, టెక్ సెల్ ఎస్ఐ ఆర్.సోమేశ్వరరావు, గాజువాక క్రైమ్ ఎస్ఐ ఇ.మహేశ్వరరావు, స్టీల్‌ప్లాంట్ క్రైమ్ ఎస్ఐ ఎల్.శ్రీనివాసరావు, సీసీఎస్ హెచ్‌సీ సీహెచ్.మధు, గాజువాక క్రైమ్ పీసీ ఎన్.ఘాటిల్లను సీపీ అభినందించారు. సమావేశంలో డీసీపీ (క్రైమ్) నాగన్న, ఏడీసీపీ గంగాధరం, ఏసీపీ(క్రైమ్) పెంటారావు, సౌత్ డివిజన్ క్రైమ్ సీఐ పి.సూర్యనారాయణ, సీసీఎస్ సీఐ బి.ఎం.డి.ప్రసాద్, హార్బర్ సీఐ ఎం.అవతారం పాల్గొన్నారు. -
తల్లిని వేధించిన వ్యక్తిని చంపిన తనయుడు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తన తల్లిని వ్యంగ్యంగా మాట్లాడి వేధించడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు. మృతదేహాన్ని తీసుకొచ్చి తన తల్లి కాళ్ల ముందు పడేశాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని అల్లిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం ప్రాంతానికి చెందిన గొంతిన శ్రీను(45) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. పనులకు ఎవరు పిలిస్తే వారితో వెళ్తాడు. ఇందుకోసం రోజూ అల్లిపురం మెయిన్ రోడ్డులో గల ఎలైట్ ఇన్ లాడ్జీ జంక్షన్ వద్ద కూర్చుంటాడు. యథావిధిగా ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీను ఎలైట్ ఇన్ లాడ్జీ జంక్షన్‌కు చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన గౌరీ అనే మహిళ పాచిపనుల కోసం అటుగా వెళ్తోంది. ఆమెతో శ్రీను వ్యంగ్యంగా మాట్లాడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. గౌరీ ఈ విషయాన్ని తన కుమారుడు ప్రసాద్‌కు ఫోన్ చేసి చెప్పింది. ప్రసాద్ వెంటనే అక్కడకు చేరుకుని ‘నా తల్లిని అవమానిస్తావా..’ అంటూ శ్రీనును ఇటుకతో కొట్టాడు. పరుగులు తీస్తున్న శ్రీనుని వెంటాడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. శ్రీను చనిపోయిన తర్వాత నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు. ఆవేశంతో కాళ్లతో కసిగా తన్ని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తల్లీకొడుకులు పరారయ్యారు. ఈ వ్యవహారం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దాని ఆధారంగా సీతంపేట గుడి వద్ద సాయంత్రం తల్లీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. -
అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!
కేరళలో తల్లి, కొడుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చింది. ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చింది’ అన్నాడు తల్లి దగ్గరకు వెళ్లి. ‘నాక్కూడా బాబూ’ అని జవాబు చెప్పిందా తల్లి. ఇద్దరూ ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యారు. వారిని ఉత్సాహపరిచిన తండ్రి ఆనందంతో కళ్లు తుడుచుకున్నాడు. ఇంత మంచి కుటుంబ కథా చిత్రం ఈ మధ్య చూళ్లేదు మనం. కొబ్బరిచెట్లు సంతోషంతో తలలు ఊపాయి. వీధి అరుగులు చప్పట్లు కొట్టాయి. ఒక సామాన్యమైన ఇంటిలో హటాత్తుగా రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి ఈ సంబరం మనదే అన్నట్టుగా ఊరు ఉంది. దానికి కారణం మొన్న ఆగస్టు 3న కేరళలో ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మలప్పురంలో అరిక్కోడ్ అనే ఉళ్లోని తల్లీకొడుకులు న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. తల్లి బిందు ‘లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్’ (ఎల్.జి.ఎస్.) విభాగంలో 92వ ర్యాంక్ సాధిస్తే కొడుకు వివేక్ ‘లోయర్ డివిజినల్ క్లర్క్’ (ఎల్.డి.సి.) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు. తల్లి వయసు 42. కొడుకు వయసు 24. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు 40 ఏళ్లు పరిమితిగా ఉన్నా కొన్ని వర్గాలకు 42 ఏళ్లు మరికొన్ని వర్గాలకు 46 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంది. తన సామాజికవర్గాన్ని బట్టి పరీక్ష రాయడానికి అర్హత ఉన్న బిందు 42 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం సాధించింది. ఈసారి కాకపోతే ఇంకేముంది... జాతీయస్థాయిలో ఇది విశేష వార్తగా మారింది. లాస్ట్ చాన్స్ బిందు చాలా కాలంగా అంగన్వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంది. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంతో ఆమెకు సంతృప్తి లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకునేది. కొడుకు వివేక్ పదో క్లాసుకు వచ్చినప్పటి నుంచి ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతూ ఉంది. అంతే కాదు కొడుకుతో కూడా నువ్వు గవర్మెంట్ ఉద్యోగం సాధించాలిరా అని తరచూ చెప్పేది. చిన్నప్పటి నుంచి అతని చేత పత్రికలు చదివించేది. కొడుకు డిగ్రీ అయ్యాక అతనూ ఉద్యోగానికి ప్రిపేర్ అవడం మొదలెట్టాడు. బిందు పట్టుదల చూసి ఆమె భర్త పూర్తిగా మద్దతు పలికాడు. కోచింగ్ లో చేరండి అని చేర్పించాడు. ఇంతకు మునుపు చేసిన అటెంప్ట్స్ ఫలించలేదు. ఈసారి బిందుకు లాస్ట్ చాన్స్. ఈసారి మిస్సయితే ఇక ఎగ్జామ్ రాసే వయసు ఆమె వర్గానికి సంబంధించి దాటేస్తుంది. ఎలాగైనా సాధించాలి అనుకుందామె. కోచింగ్ చేరి బిందు, వివేక్ ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో చేరారు. కలిసి వెళ్లి కోచింగ్ తీసుకుని వచ్చేవారు. ఆ తర్వాత ఎవరికి వారు ప్రిపేర్ అయ్యేవారు. ‘మేము మా గదుల్లోకి వెళ్లి చదువుకునేవాళ్లం. మధ్యలో మాత్రం డౌట్స్ వస్తే ఒకరినొకరం అడిగేవాళ్లం. నోట్సులు ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్లం’ అన్నాడు వివేక్. సంకల్పం వృధా కాలేదు. ‘ఉద్యోగం వచ్చిందమ్మా’ అని కొడుకు పరిగెత్తుకుని వెళితే ‘నాక్కూడారా’ అని నవ్విందామె. భలే ఉంది కదా... ఈ కుటుంబ కథా చిత్రం. -
Hyderabad: రెస్టారెంట్లో పెట్టుబడులంటూ రూ.13 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసి క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను చూపిస్తూ అందులో పెట్టుబడుల పేరుతో అనేక మంది నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో తల్లీకుమారులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహించే నాగెల్లి రూపస్ ఆయన భార్య నాగెల్లి సుకన్య, కుమారుడు జసింత్ జీటీఎఫ్‌ఎల్ మినిస్ట్రీస్ పేరుతో చర్చిల్ని నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చిన వారిని నమ్మించిన ఈ త్రయం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేశారు. 2017–18ల్లో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వమని అడిగిన వారిని బెదిరించడం వారిపైనే కేసులు పెట్టడం చేస్తున్నారు. వీరికి రూ.కోటి వరకు ఇచ్చి మోసపోయిన కేవీ ప్రసాద్ అనే బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఏసీపీ సందీప్‌కుమార్ బుధవారం సుకన్య, జసింత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రూపస్ కోసం గాలిస్తున్నారు. వీళ్లు విదేశాల్లోని వారి నుంచి డబ్బు తీసుకున్నారని, తెనాలీలోనూ వీరిపై కేసులు ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. టెన్షన్.. అటెన్షన్! -
కలెక్టర్ అవుదామని కలలు కని.. రియల్ ఎస్టేట్‌ను నమ్ముకుని..
కేపీహెచ్‌బీకాలనీ: సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. జోగులాంబగద్వాల జిల్లాకు చెందిన గోగినేని వరప్రసాద్ భార్య సరళ(58), కుమారుడు సందీప్ చంద్ర(38)లతో కలిసి కేపీహెచ్‌బీ పరిధిలోని బృందావన్‌కాలనీలో గల రిషితాకల్యాణ్ అపార్టుమెంట్‌లోని 208 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వ్యాపార రీత్యా రైస్ మిల్లులు నిర్వహిస్తున్న వరప్రసాద్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అయితే మూడు రోజుల కిందట వరకు అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడిన సరళ, సందీప్‌ల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడం, ఇంట్లోను నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అపార్టుమెంట్ వాచ్‌మెన్‌ను వెళ్లి చూడాలని కోరారు. దీంతో వారు సరళ, సందీప్‌లు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లి తలుపు తట్టినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోగా దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: (సర్పాలతో మేలే.. రాష్ట్రంలో విషపూరిత సర్ప జాతులు నాలుగే) కేపీహెచ్‌బీ పోలీసులు వెళ్లి తలుపు గడియ పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా కిచెన్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు సరళ, మరో గదిలోని సీలింగ్ ప్యాన్‌కు సందీప్‌లు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. అంతేకాకుండా ఇద్దరి మృతదేహాలు కూడా ఢీ కంపోజ్డ్ స్థితికి చేరడాన్ని బట్టి మూడు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భర్త వరప్రసాద్ వచ్చి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తేనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. కలెక్టర్ అవుదామని.. సందీప్ చంద్ర కలెక్టర్ కావాలని కళలు కని అందుకు తగిన విధంగా సిద్ధమయ్యాడు. అయితే రెండు సార్లు ఇంటర్వ్యూ స్థాయికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రియల్ ఎస్టేట్‌ను నమ్ముకున్నాడు. తాము పోగు చేసుకున్న సొమ్ముతో పాటు తెలిసిన వారి వద్ద కూడా కొంత మొత్తం అప్పుగా తీసుకొని ఓ భూమిని కొనుగోలు చేశాడని, అది వివాదాల్లో చిక్కుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని సందీప్‌చంద్ర స్నేహితులు పేర్కొనడం గమనార్హం. స్థానికంగా పలువురి వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేకపోవడం, జీవితంలో స్థిరపడకపోవడం వంటి పలు ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు సైతం భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తల్లీకొడుకుపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి
ఇల్లెందు: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ వేరే వార్డులోని రెండు కుటుంబాల మధ్య గొడవలో కలగజేసుకోవడమేకాక తల్లీకొడుకులపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులోని సత్యనారాయణపురంలో తల్లీకొడుకులు ఎస్.కె.సోందుబీ, షేక్ ఫకీర్ సాహెబ్ నివసిస్తున్నారు. వీరి ఇంటి పక్కన ఉండే మీరా సాహెబ్ ప్రహరీ నిర్మిస్తుండగా, శనివారం ఉదయం హద్దుల విషయమై సోందూబీ, ఫకీర్ సాహెబ్ ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో రెండు కుటుంబాలమధ్య వాగ్యుద్ధం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని గొడవలకు దిగొద్దని రెండు పక్షాలకు సూచించారు. కాసేపటికి ఒకటో వార్డు కౌన్సిలర్ రవి తన అనుచరులతో అక్కడకు వచ్చి సోందుబీ, ఫకీర్ సాహెబ్‌ను పిలిచి పంచాయితీ పెట్టాడు. కాగా, కౌన్సిలర్ చెప్పినట్లుగా వినడం లేదంటూ తమపై దాడి చేశాడని బాధితులు వాపోయారు. ఏదైనా సమస్య ఉంటే తమ కౌన్సిలర్‌కు చెప్పుకుంటామంటున్నా వినకుండా దాడి చేశాడని తెలిపారు. కౌన్సిలర్ రవితో తమకు ప్రాణ హాని ఉందని అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్‌నైన తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ కాదని బెదిరించాడని చెప్పారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై చంద్రశేఖర్ సత్యనారాయణపురం వెళ్లి విచారణ చేపట్టారు. -
జంట హత్యల కలకలం: చెల్లిని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు..
సాక్షి, వైఎస్సార్ కడప: నగరంలోని నకాశ్ వీధిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. కూతురు అధిక సమయం మొబైల్ చూస్తుందని తల్లి మందలించింది. ఈ క్రమంలో తల్లి ఖుర్షీదా, కూతురు హలీం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన తల్లి.. కూతురు మెడకు చున్నీ బిగించి హత్యకు పాల్పడింది. చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. పెళ్లి పేరుతో! అయితే చెల్లెలు హత్యను చూసి తట్టుకోలేక కుమారుడు జమీర్ కోపంతో తల్లి ఖుర్షీదాను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చదవండి: సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి బలవన్మరణం -
తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు
సాక్షి, బెంగళూరు (దొడ్డబళ్లాపురం): విషపూరిత బజ్జీలు తిని తల్లీకొడుకు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి (53), కుమారుడు సోమనింగప్ప (28) కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. సోమవారం ఇద్దరూ ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. రాత్రికి ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందారు. బజ్జీల్లో పురుగులు మందు కలిసి ఉంటుందని, ఇది అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా కుట్ర పన్ని చేశారా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (నటి సంజన వీరంగం..!) -
విషాదం: చెరువులో దూకిన తల్లి, కొడుకు
కర్నూలు: కర్నూలు జిల్లా సంజామ మండలం నోస్సం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహలను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యలకు కుటుంబ కలహలు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య -
అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను..
సాక్షి,కర్నూలు: ‘అమ్మా.. నాకు ఊహ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. అయినా కష్టం విలువ తెలియకుండా పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు నువ్వూ వదిలిపోతే నేనెలా బతికేది. నువ్వు లేని ఈ లోకంలో నేనుండలేను’ అంటూ ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన అవుకు మండల పరిధిలోని నిచ్చెన మెట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండి వెంకటరాముడు (31) ఆరేళ్ల వయస్సులో ఉండగా తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి లక్ష్మీదేవి అన్నీ తానై రెక్కల కష్టంతో కుమారుడిని పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసింది. వెంకటరాముడికి కూతుళ్లు ఆరేళ్ల సిరివెన్నెల, నాలుగేళ్ల శ్రీజ, రెండేళ్ల వర్షిత ఉన్నారు. ప్రస్తుతం భార్య జ్యోతి గర్భిణి. ఈక్రమంలో రెండు నెలల క్రితం లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతిచెందింది. చిన్నప్పుడే తండ్రి మృచెందినా ఏ లోటూ రానివ్వకుండా చూసుకున్న తల్లి దూరం కావడంతో దిగులు చెందేవాడు. ఈక్రమంలో ఈ నెల 23న రాత్రి కలుపు మొక్కల నివారణ మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక 24న మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. మృతుని కూతుళ్లు, భార్య రోదించిన తీరును చూసి గ్రామస్తులు కంట తడి పెట్టుకున్నారు. చదవండి: ఉసురు తీసిన మద్యం మత్తు -
కేసు భయంతో తల్లీకొడుకు ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: పోలీసుల కేసుకు భయపడి తల్లి కొడుకు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో బుధవారం వెలుగు చూసింది. మోహన్‌గౌడ (18) అనే యువకునిపై బైక్ చోరీ కేసు నమోదు కావడంతో పోలీసులకు భయపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లి లీలావతి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మరణం, మరోవైపు పోలీసులు తనను కూడా విచారణ చేస్తారని భయపడి ఆస్పత్రి బయట ఉన్న కారుకు తలకొట్టుకోవడంతో ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ మేరకు విజయనగర పోలీస్ స్టేషన్ ద్వారా వివరాలు తెలిశాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: శారీరక శ్రమకు దూరంగా.. అనారోగ్యానికి దగ్గరగా -
వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డపై దారుణం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వివాహేతర సంబంధం మోజులో పడి కన్న కుమారుడినే తల్లి హతమార్చిన ఘటన రాజమహేంద్రవరం సీతంపేటలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న మల్లెమొగ్గల లక్ష్మి తన కుమారుడు మంజునాథ్ (6) మంచంపై నుంచి పడిపోయి, గాయపడినట్టు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆ బాలుడు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆ బాలుడి తల, మెడ, ముఖంపై గాయాలుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నివేదికతో పాటు, స్థానికుల నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మంజునాథ్‌ను అతడి తల్లి లక్ష్మి, ప్రియుడు బోనం దాసు హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. -
రైలు కింద పడి తల్లి కొడుకు ఆత్మహత్య
సాక్షి, ఒంగోలు: ఏం జరిగిందో తెలియదుగానీ తల్లి, కొడుకు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సమాచారం శనివారం వేకువ జామున 3 గంటల సమయంలో రైల్వే పోలీసులకు అందింది. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానిక ఒంగోలు రైల్వే ఫ్లయి ఓవర్ బ్రిడ్జి నుంచి 300 మీటర్ల దూరంలో పోతురాజు కాలువకు సమీపంలో వెలుగు చూసింది. మృతుల వద్ద ఎటువంటి ఆధారాలూ లభించలేదు. తల్లి తలకింద చేతులు పెట్టుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించడంతో చూపరులను కలచి వేస్తోంది. శరీరంలో సగభాగం నుజ్జునుజ్జుగా కాగా కుమారుని కాలు తెగిపోయింది. మృతురాలికి సుమారు 30 ఏళ్లు ఉంటాయి. కుమారుడికి ఆరేళ్లు ఉంటాయని అంచనా. మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించిన అనంతరం రైల్వే పోలీసులు ఆ ఫొటోలతో నగరంలోని పలు ప్రాంతాల్లో విచారించినా ఎటువంటి సమాచారం లభించలేదు. మృతులు ఎవరైంది తెలిస్తేగానీ వారి ఆత్మహత్యకు కారణాలు వెలుగు చూసే అవకాశం లేదని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది
పెద్దపల్లి: దివ్యాంగుడైన కుమారుడికి పద్నాలుగేళ్లు సపర్యలు చేసింది. వయసు, శరీరం పెరుగుతున్నా అతడి మానసిక స్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఇటీవల కొంతకాలంగా విపరీత ప్రవర్తన మరింత పెరిగిపోవడంతో విసిగిపోయింది. కొడుకు బతికుండగానే బావిలోకి తోసి చంపేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రదీప్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణంలోని మొఘల్‌పురకు చెందిన శేఖర్, శ్యామల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు యశ్వంత్ (14) పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. శేఖర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. శ్యామల ఇంట్లోనే ఉంటూ యశ్వంత్ బాగోగులు చూసుకుంటోంది. యశ్వంత్ వయసు, శరీరం పెరుగుతున్నా మానసిక స్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. అతని ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అనేక ఆస్పత్రులు తిరిగారు. ప్రస్తుతం నెలకు రూ.7 వేల విలువైన మందులు వాడుతున్నారు. మందులు వాడినప్పుడు మాత్రమే యశ్వంత్ బాగుంటున్నాడు. మందులు లేకపోతే అతని ప్రవర్తనలో మార్పు వస్తోంది. శేఖర్‌కు తగిన స్థోమత లేకపోవడంతో డబ్బులు ఉన్నపుడే మందులు తెచ్చి వాడేవారు. మందులు వేయని సమయంలో యశ్వంత్‌కు మల, మూత్ర విసర్జన కూడా తెలియడం లేదు. పైగా విపరీత ప్రవర్తన పెరిగిపోవడంతో శ్యామల కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి.. యశ్వంత్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, విపరీత మానసిక ప్రవర్తనతో కాలనీవాసులు కూడా ఇబ్బందిపడుతున్నారని శ్యామల సోమవారం భర్తకు చెప్పింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పి శేఖర్ ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు. యశ్వంత్‌ను తీసుకుని బయల్దేరిన శ్యామల, పట్టణ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అందులోకి తోసేసింది. దీంతో నీటిలో మునిగిపోయిన యశ్వంత్ మృతి చెందాడు. సాయంత్రం ఒంటరిగా ఇంటికొచ్చిన శ్యామలను.. భర్త, కుటుంబసభ్యులు యశ్వంత్ గురించి ఆరా తీయగా బావిలోకి తోసి చంపేశానని తెలిపింది. దీంతో వారు బావి వద్దకు వెళ్లి చూసి అప్పటికే చీకటి పడడంతో మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం యశ్వంత్ మృతదేహం బావిలో తేలడంతో శేఖర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బావిలో తోసేశానని చెప్పింది స్థానికుల సహాయంతో పోలీసులు యశ్వంత్ మృతదేహాన్ని బయటకు తీయించారు. శేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్యామలను అదుపులోకి తీసుకున్నారు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయి తానే బావిలో తోసేశానని శ్యామల అంగీకరించిందని సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఓ తల్లి దయనీయగాథ.. భుజాలపై పిల్లాడితో
సాక్షి, యశవంతపుర: భర్తతో గొడవ పడిన ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును తీసుకుని 90 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన కర్ణాటకలో దావణగెరెలో వెలుగులోకి వచ్చింది. శివమొగ్గ జిల్లా గాడికొప్పకు చెందిన నాగరత్న ఏదో విషయమై భర్తతో తగాదా పడింది. దిక్కుతోచని స్థితిలో కొడుకును, బట్టల సంచిని తీసుకుని బిజాపుర (విజయపుర) జిల్లా హరప్పనహళ్లి తాలూకా తుంబికెరెలోని అక్క ఇంటికి బయలుదేరింది. బస్సులు లేవు, చేతిలో డబ్బులు కూడా కరువు. దీంతో ఆమె నడకనే నమ్ముకుంది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు దావణగెరె నగరంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా నాగరత్న ఎస్ఎస్ ఆస్పత్రి వద్ద కంటపడ్డారు. పోలీసులు ప్రశ్నించగా భర్తతో కొట్లాడి కొడుకును భుజాలపై మోసు కుంటూ అక్క ఇంటికి కాలినడకన వెళ్తున్నట్లు వారికి వివరించింది. ఇలా ఆమె 90 కిలోమీటర్లు నడిచినట్లు తెలిసి పోలీసులే విస్తుపోయారు. తల్లి, కొడుకుకు పోలీసులు భోజనం పెట్టించి తమ వాహనంలో తుంబికెరెలోని ఆమె సోదరి ఇంటికి పంపించారు. -
తల్లీకొడుకులపై పిడుగు
పెందుర్తి: విశాఖపట్నం పెందుర్తి సమీపంలోని పులగానిపాలెం నల్లక్వారీ కాలనీలో మంగళవారం తల్లీకొడుకులపై పిడుగుపడింది. కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి కొట్టే ప్రవీణ్‌కుమార్, పావని దంపతులు గాజువాకలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు రోహిత్ (6) ఉన్నాడు. పావని, రోహిత్ కొద్దిరోజుల కిందట పెందుర్తిలోని ఆమె పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో మేడపై ఆరబెట్టిన దుస్తులు తీసేందుకు పావని వెళ్లింది. ఆమెతో పాటు రోహిత్ కూడా వెళ్లాడు. అదేసమయంలో వీరిపై పిడుగుపడింది. రోహిత్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. పావని తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు పావనిని 108లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మమ్మ ఇంట్లో సరదాగా గడిపేందుకు వచ్చిన రోహిత్ అకాల మరణంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. -
తల్లీకొడుకు అనుమానాస్పద మృతి
బనగానపల్లె రూరల్(కర్నూలు జిల్లా): మండలంలోని నందవరం గ్రామానికి చెందిన తలారి సరస్వతి (30), కుమారుడు మధుశంకర్ (12) అనుమానాస్పద స్థితి మృతి చెందారు. వారి మృతదేహాలు బుధవారం రాళ్లకొత్తూరు సమీపంలోని దెయ్యాలకుంట వద్ద శ్రీశైలం కుడి ఉప కాలువ (ఎస్ఆర్బీసీ)లో లభ్యమయ్యాయి. ఇద్దరూ ఉదయమే పొలం వద్దకు వెళ్లారని, ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా సమీపంలోని కాలువలో కొట్టుకుపోతూ కని్పంచారని సరస్వతి మామ ఎర్రమద్దయ్య తెలిపాడు. అయితే.. ఆస్తి విషయంలో హత్య చేశారంటూ సరస్వతి తల్లి జి.లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి కుమార్తె సరస్వతిని 13 క్రితం నందవరం గ్రామానికి చెందిన ఎర్రమద్దయ్య కుమారుడు మద్దిలేటికి ఇచ్చి వివాహం చేశారు. మద్దిలేటి లారీ క్లీనర్‌గా వెళ్తుంటాడు. వీరికి మధుశంకర్, మణికంఠ అనే ఇద్దరు కుమారులు. మధుశంకర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా.. వివాహం అయినప్పటి నుంచి సరస్వతిని భర్త, మామతో పాటు కొలిమిగుండ్లలో ఉంటున్న ఆడబిడ్డ మహేశ్వరి, ఆమె భర్త వేధింపులకు గురి చేసేవారు. తండ్రి ఎర్ర మద్దయ్య పేరుతో ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో తనకూ వాటా కావాలంటూ మహేశ్వరి గతంలో పలుమార్లు గొడవ పడింది. ఆస్తి ఇస్తేనే పుట్టింటికి వస్తానని తెగేసి చెప్పింది. అయితే.. ఇందుకు సరస్వతి అంగీకరించదనే ఉద్దేశంతో మామ, భర్త కలిసి ఆమెను, కుమారుడు మధుశంకర్‌ను హత్య చేసి కాలువలో పడేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని లక్ష్మీదేవి ఆరోపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ జీవన్ గంగనాథ్‌బాబు తెలిపారు. చదవండి: చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి ప్రైవేటు ల్యాబ్‌ల దందా: మోసం గురో..! -
తల్లీకొడుకులను బలితీసుకున్న కరోనా
కేశంపేట: కరోనాతో తల్లీ కొడుకులు మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొండారెడ్డిపల్లికి చెందిన శంకర్ (55)కు పది రోజుల క్రితం కరోనా రావడంతో మహబూబ్‌నగర్‌లోని ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శంకర్ తల్లి చంద్రమ్మ (75) కూడా మూడు రోజుల క్రితం కరోనాతోనే మృతి చెందింది. తల్లి కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. (చదవండి: హైదరాబాద్‌లో కిక్కిరిసిపోతున్న ఐసోలేషన్ కేంద్రాలు) -
ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి
పెద్దపల్లి రూరల్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండుప్రాణాలను బలిగొంది. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దేవగూడకు చెందిన ఎతిరాజు స్వామి కుటుంబం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడింది. స్వామికి «జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన మమత (27) తో వివాహం జరిగింది. వీరికి శివకృష్ణ (3), శ్రీకృతి (14 నెలలు) సంతానం. స్వామి తోబుట్టువు పద్మ భర్త చనిపోవడంతో ఆమె వీరి వద్దే ఉంటోంది. ఆడపడుచు పద్మతో స్వామి భార్య మమతకు తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం స్వామి కూలిపనికి వెళ్లిన తర్వాత ఏదో విషయమై ఆడపడుచుతో గొడవపడ్డ మమత తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వామి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాపిల్లలు కనపడక పోవడంతో పద్మను అడగ్గా తనకు తెలియదని చెప్పింది. తర్వాత అత్తింటివారిని, బంధువులను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోగా, తమ వద్దకు రాలేదని చెప్పారు. బుధవారం ఉదయం వారిని వెతికేందుకు బయల్దేరేలోగా మృతదేహాలు సమీపంలోని బావిలో తేలాయని తెలియడంతో హతాశులయ్యారు. ఈ సమాచారం అందడంతో డీసీపీ రవీందర్, ఏసీపీ నితికపంత్, సీఐ ప్రదీప్.. సిబ్బందితో వెళ్లి మృతదేహాలను వెలికి తీయించారు. కాగా, తమ కూతురు అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని మమత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. -
నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..
హొసపేటె(కర్ణాటక): వ్యాపారవేత్తను బెదిరించి రూ.15లక్షలు దోచుకున్న మహిళ కటకటాల పాలైంది. టీబీ డ్యాం సీఐ నారాయణ తెలిపిన వివరాలు మేరకు కొప్పళ్‌లో స్టీల్ కంపెనీ పెట్టిన ఓ వ్యాపారవేత్త హొస్పేటలోని ఎంజే నగర 6వ క్రాస్‌లో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎదురుగా ఉన్న ఇంటిలో గీతా అనే మహిళ నివాసం ఉంటోంది. 2019 మార్చిలో వ్యాపారవేత్తకు, గీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఒక రోజు ఆయన్ను గీతా తన ఇంటికి ఆహ్వానించి తేనీరు ఇచ్చింది. దీంతో ఆయన మూర్ఛబోయాడు. గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత గీతా ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షల ఇచ్చి సీడీ తీసుకెళ్లాలని సూచించింది. దీంతో ఆయన గీతా బ్యాంకు ఖాతాకు రూ.15లక్షలు జమ చేశాడు. మిగితా డబ్బు కోసం గీతా ఒత్తిడి చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గీతా ఇంటిలో తనిఖీలు నిర్వహించగా 2.750 గ్రాముల గంజాయి లభించింది. గీతాతో పాటు ఆమెకు సహకరించిన కుమారుడు విష్ణును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఫ్లాట్‌లో బంధించి రెండు వారాలుగా.. జగద్గిరిగుట్టలో వ్యభిచార గృహాలపై దాడి -
స్నేహితుడి మృతిపై అనుమానం.. కత్తితో హత్య
నాగోలు: తాగుడుకు బానిపై డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్న తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసిన కుమారుడిని, హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఖననం చేసిన తల్లిని శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా, తుంగతూర్తి మండలం తుర్పుగుడెం(వి) చెందిన గుండ్ల మల్లయ్య(45) భార్య వీరమ్మ తో పాటు కుమారుడు వెంకటేష్, మల్లయ్య తల్లి రాములమ్మతో కలసి ఎల్బీనగర్ శివగంగాకాలనీలో రాఘవేంద్ర ఎన్విరాన్మెంట్ అపార్ట్‌మెంట్స్‌లో వాచ్మెన్ ఉంటున్నాడు. కుమారుడు వెంకటేష్ ప్రసుత్తం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. మల్లయ్య మద్యానికి బానిసై తరుచు మద్యం సేవిస్తూ డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఈనెల 15వ తేదీన మద్యం సేవించేందుకు తన తల్లి రాములమ్మ దగ్గర బలవంతంగా రూ.100 తీసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో మళ్లీ గొడవ పడటంతో సమాచరం అందుకున్న వెంకటేష్ ఇంట్లో ఉన్న కత్తితో మల్లయ్య ఛాతీ, గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు వెంకటేష్, తల్లి వీరమ్మలు కలసి రక్తం మరకలు పూర్తి తుడిచేసి బట్టలు మార్చి మృతదేహాన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అక్కడ నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తన సొంత గ్రామ మైన తుర్పుగుడెం శ్మశానవాటికలో కొంత మంది బంధువులు, గ్రామస్తులుతో కలసి అంత్యక్రియలు చేశా రు. ఈనెల 17వ తేదీన మల్లయ్య మృతి చెందినట్లు మృతుడి స్నేహితుడు నర్సింహ తెలుసుకున్నాడు. తన స్నేహితుడి మృతిపై అనుమానం ఉన్నట్లు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని విచారించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చదవండి: కొత్త రథం తీసుకొస్తుండగా విద్యుత్ ప్రమాదం చదవండి: ట్రాన్స్‌జెండర్ అని తెలిసే ప్రేమాయణం -
తల్లీకుమారుడి దారుణ హత్య
సాక్షి, చందూరు (నిజామాబాద్): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చందూరు శివారులో తల్లీకుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. హుమ్నాపూర్ వాసి సావిత్రి(30) సహా రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన నిందితుడు.. చందూరు శివారు అటవీ ప్రాంతంలో పాతిపెట్టాడు. గత నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఘన్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. వివాహేతర సంబంధ వ్యవహారమే హత్యకు గల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు.. పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. -
ఆపరేషన్ ముష్కాన్‌తో తల్లి చెంతకు బిడ్డ
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితాలు ఇస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ ఫలితంగా నాలుగేళ్ల తర్వాత తల్లి చెంతకు కొడుకు చేరనున్నాడు. 2016లో ఇంటి నుంచి పారిపోయి విజయవాడ చేరిన బాలుడు బొబ్బా శ్రీనివాస్‌ను పోలీసులు సంరక్షించి చైల్డ్ హోమ్‌కు తరలించారు.హోమ్ నిర్వాహకులు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. శ్రీనివాస్ నాలుగో తరగతి చదువుతున్నాడు. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బాలుడి తల్లిని ఆపరేషన్ ముస్కాన్ బృందం ట్రేస్ చేసింది. తల్లితో వీడియో కాల్లో మాట్లాడించారు. నాలుగేళ్ళ తర్వాత బిడ్డ ఆచూకీ తెలియడంతో తల్లి శ్రీలత ఉద్వేగానికి గురై ఆనందబాష్పాలు కార్చింది. దూరమైన కుమారుడిని చెంతకు చేర్చిన పోలీసులకు , చైల్డ్ హోమ్ నిర్వాహకులకు తల్లి కృతఙ్ఞతలు తెలిపింది. (ఆపరేషన్ ముస్కాన్‌తో స్వేచ్ఛ దొరికింది) -
బిడ్డను విసిరి.. తనూ దూకి
కర్నూలు: చిన్నచిన్న కారణాలకే కొందరు క్షణికావేశానికి లోనై మృత్యుమార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారితో పాటు అన్నెంపుణ్యం ఎరుగని పిల్లలనూ బలి చేస్తున్నారు. భర్తతో గొడవ పడి మనస్తాపానికి గురైన ఓ మహిళ బుధవారం తనబిడ్డను బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరి, తానూ దూకేసింది. అదృష్టం బాగుండి ఇద్దరూ ప్రాణాలతో బయటపడినా బాధితురాలు చేయి కోల్పోయింది. నగరంలోని బళ్లారి చౌరస్తాలో భర్త విశ్వనాథ్‌రెడ్డితో గొడవ పడి భార్య వాసవి తన బిడ్డతో సహా బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథ్‌రెడ్డికి, వెల్దుర్తికి చెందిన వాసవితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఆదర్శ ఉన్నాడు. కుటుంబ కలహాలతో కొంతకాలంగా వీరు దూరముంటున్నారు. విశ్వనాథ్‌రెడ్డి ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేస్తూ కర్నూలులోని స్కందన్షీ హౌసింగ్ కాలనీలో నివాసముంటున్నాడు. వాసవి బుధవారం యాడికి నుంచి కర్నూలుకు వచ్చి బస్టాండ్ నుంచి భర్తకు ఫోన్ చేయగా, ఎందుకొచ్చావంటూ మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందుకు మనస్తాపంతో ఆమె రెండేళ్ల కుమారున్ని బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరి, తనూ దూకింది. ప్రమాదంలో ఆమె చెయ్యి విరిగిపోయింది. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. సంవత్సర కాలంగా భర్తతో దూరంగా ఉంటడం వల్లే గొడవపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీ కొడుకును కలిపిన లాక్డౌన్..
పెరంబూరు : అననుకూల పరిస్థితులు ఒక్కోసారి మంచి చేస్తాయి.. అలాంటి తాజా పరిస్థితి ఒక కొడుకును తల్లి వద్దకు చేర్చింది. అదే లాక్డౌన్. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది 15 ఏళ్ల క్రితం విడిపోయిన ఒక తల్లీకొడుకును మళ్లీ కలిపింది. విరుదునగర్ జిల్లా, సాంత్తూర్, నందవనపట్టి వీధిలో లక్ష్మి నివశిస్తోంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు. పౌష్టికాహార సమాఖ్య సభ్యురాలైన లక్ష్మి భర్త మరణించడంతో ఆర్థిక సమస్యల కారణంగా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేక పనికి పంపించింది. కొడుకుల్లో మూడో వాడైన పాండిరాజన్(33) సినిమాల్లో నటించాలన్న ఆశతో తల్లికి చెప్పకుండా చెన్నైకి వచ్చాడు. నటుడిగా ఇతను చేసిన ప్రయత్నాలు ఫలించక జీవనాధారం కోసం పాత పేపర్ల దుకాణంలో పనికి చేరాడు. లాక్డౌన్ ప్రకటించడంతో పనిలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన తల్లి గుర్తుకొచ్చి వెంటనే చెన్నై నుంచి సాంత్తూర్‌కు కాలిబాట పట్టాడు. గత 11వ తేదీన బయలు దేరాడు. మధ్య మధ్యలో లారీలు వంటివి ఎక్కి, మొత్తం మీద 17వ తేదీ రాత్రికి సొంత ఊరుకు చేరుకుని తల్లిని కలుసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లి పోయిన కొడుకు తిరిగి రావడంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. ఆ ప్రాంత ప్రజలు కరోనా టెస్ట్‌లు చేయించమని సలహా ఇవ్వడంతో పాండిరాజన్‌ను సాంత్తూర్‌లోని ఆరోగ్య శిబిరానికి తీసుకెళ్లింది. అతన్ని పరీక్షించిన వైద్యులు కరోనా వ్యాధి సోకలేదని నిర్ధారించారు. చదవండి : పురుడు పోసిన సినీ రచయిత -
ఆడతనం కాదు... అమ్మతనం చూడాలి
తండ్రికన్నాకొడుకు శరీరం వేరు, కూతురు శరీరం వేరు. కానీ యదార్థానికి అమ్మకన్నాకూడా బిడ్డ శరీరం వేరు కాదు. నా గోరు తీసి అక్కడ పెట్టాననుకోండి... నానుంచి వేరుచేసినా అది నా గోరే. మనం అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాం. అమ్మ తిన్న అన్నంలోంచి ఈ సప్త ధాతువులు వచ్చాయి. ప్రసవ వేదనపడి, ఎంత కష్టపడి ఈ శరీరాన్ని కన్నదో.. అమ్మ శరీరం లోని ఒక అంతర్భాగం బయటికొచ్చింది తప్ప... గోరు ఊడివచ్చినా అది నాదే అయినట్లు, అమ్మ శరీరంలో ఒక ముక్క ఈ శరీరం కాబట్టి ఇది ఎప్పటికీ మన అమ్మదే తప్ప మనది మాత్రం కాదు. అందుకే అమ్మ అమ్మే. అబ్దుల్ కలాంగారు రాష్ట్రపతి పదవిని చేసి దేశానికి ఖ్యాతి తెచ్చినవాడు. అలాంటి శాస్త్రవేత్త తన స్వీయ రచన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’కి ఉపోద్ఘాతం రాసుకుంటూ ...‘‘అమ్మా! రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు తినడానికి రొట్టెలు లేని రోజుల్లో నేను వచ్చి రొట్టెలు తింటుంటే... నీవు పెడుతూ పోయావు. రుచిగా ఉన్నాయని నీవు చేసినవన్నీ తినేసాను. అన్నయ్య వచ్చి – అసలే యుద్ధంతో గోధుమలు దొరకడం లేదు, రుచిగా ఉన్నాయని నువ్వు తినేస్తుంటే అమ్మ తను తినకుండా అన్నీ నీకు పెట్టేసింది. ఈ రాత్రికి అమ్మ పస్తుండాలి. చూస్కోక్కరలేదా...అమ్మా! నీకున్నాయా అని అడగక్కరలేదా’’ అని కోప్పడ్డాడు –అయ్యో, అమ్మా! నువ్వు తినాల్సినవి కూడా నేనే తినేసానా – అని బేలగా నీకేసి చూస్తుంటే... నీవు చటుక్కున వంగి నా రెండు బుగ్గలమీద ముద్దు పెట్టుకుని –నాన్నా! నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా– అన్నావు. నువ్వు నా కడుపు తడుముతూ పెట్టిన రొట్టెలతో ఏర్పడిన ఈ శరీరం ఈ దేశానికి ఎంత సేవ చేయాలో అంత సేవా చేసిందమ్మా, చేస్తూనే ఉంటుంది. భగవంతుడు అంతిమమైన తీర్పిచ్చే రోజు ఒకటి వస్తుందమ్మా. అప్పుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడున్నా మొట్టమొదట వచ్చి నీ పాదాల దగ్గర వంగి నమస్కారం చేస్తానమ్మా’’ అని రాసుకున్నారు. అమ్మ అన్నమాటలో అంత త్యాగం ఉంది. లోకంలో ఎవరయినా ఏదయినా పదార్ధాన్ని వండి పెట్టారనుకోండి. మనం దానిని తినకపోతే..‘‘ఏవండీ మీరు వంకాయ కూర తినరా’’ అని అడుగుతారు. అదే అమ్మయితే అలా అనదు...‘‘ఏం నాన్నా, బాగా వండలేదా... తినలేదే... రెండో సారి కూడా వడ్డించుకోలేదు. బహుశః కాయలు బాగా లేవేమో, కనరొచ్చాయి ఉంటాయి. నేను బాధపడతానని చెప్పడం లేదు కదూ, రేపు జాగ్రత్తగా చూసి వండుతాలే..’’అని తెగ బాధపడిపోతుంది. అమ్మలా సాకగల వ్యక్తి లోకంలో మరొకరు లేరు. ఆ అమ్మతనం ఎక్కడుందీ అంటే అమ్మతనంలోనే ఉంది. లోకంలో ఆడతనాన్ని మాత్రమే చూసినవాడు దుర్మార్గుడు. అమ్మతనాన్ని చూసినవాడు ధన్యజీవి. ఆడతనం చూసిన వాడు పాలగిన్నె కింద మంట పెట్టిన వాడు. వాడి మనసు పొంగుతుంటుంది. అమ్మతనం చూసినవాడు పొంగుతున్న పాలమీద నీళ్ళు చల్లుకున్నవాడు. మనిషికి సంస్కారం వచ్చేది–ఆడతనంలో అమ్మతనం చూడడంలోనే. అమ్మతనం చూడకుండా ఆడతనం చూడడం దౌర్భాగ్యం. ఈ జాతి అమ్మతనాన్ని ప్రబోధం చేసింది తప్ప ఆడతనాన్ని బజారుకెక్కించుకున్న తత్త్వం ఈ దేశానిది కాదు. ‘‘అటువంటి స్థితి ఈ దేశానికి కలుగకుండా రోజులు సంస్కరింపబడుగాక’’ అని పరమేశ్వరుడిని ప్రార్థించడం మినహా చేయగలిగిందేమీ లేదు. -
అమ్మ తీర్చిదిద్దిన మాస్టర్
విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే... అపజయం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఓటములను విజయాలుగా మార్చుకోవాలంటే కఠోర శ్రమతోపాటు చెదరని ఆత్మస్థైర్యం కూడా నీకుండాలని అమ్మ, శిక్షకులు చెప్పిన మాటలు ఆ చిన్నారిని ఎన్నో అవరోధాలు అధిగమించి విజయ శిఖరం చేరుకునేలా చేశాయి. హంగేరిలో జరిగిన అంతర్జాతీయ స్ప్రింగ్ ఫెస్టివల్ పోటీల్లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సొంతం చేసుకునేలా చేశాయి. దీంతో ఇండియన్ రైల్వేస్ హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. 2008లో మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరెడ్డి నిండు మనస్సుతో వృద్ధిలోకి వస్తావని ఇచ్చిన ఆశీర్వచనం ఆ యువకుడిలో ఎంతో స్ఫూర్తిని నింపడమే కాకుండా అది నిజమయ్యిందని ఆ కుటుంబం ఎంతో మురిసిపోతోంది. నాన్న ఆశయం... అమ్మ కష్టం గుంటూరుకు చెందిన చింతగుంట శివరామ్ రెడ్డి, భారతిల రెండో కుమారుడు మెహర్ చిన్నారెడ్డి. శివరామ్‌కు చెస్ అంటే ప్రాణం కావడంతో తన కుమారుడైన మెహర్‌కు ఆరేళ్ళ ప్రాయంలో ఆయనే చెస్ శిక్షణలో చేర్పించారు. రోజూ దగ్గరుండి శిక్షణకు తీసుకెళ్ళే వారు. మెహర్‌కు ఏడేళ్ళు వచ్చేసరికి 2002లో అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెదారు. తల్లి భారతికి పెద్దగా చదువులేదు. ఎప్పుడూ గడప దాటి బయటకు వచ్చింది లేదు. ఇద్దరు చిన్న బిడ్డలతో ఏం చేయాలో తెలీని పరిస్థితి. మరోవైపు భర్త ఇచ్చిన బాధ్యతతోపాటు ఆశయాలను నెరవేర్చాలి. ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముతూ తన బిడ్డలను ఉన్నదాంట్లో పోషించుకుంటూ ముందుకెళ్ళింది. బిడ్డల పోషణతోపాటు మెహర్‌ను ఇతర ప్రాంతాలకు పోటీలకు తీసుకెళ్ళేది. తల్లి కష్టాన్ని చూసిన మెహర్ కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగాడు. ఆట కోసం శిక్షణనిస్తూ... మెహర్ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరుకునే సరికి మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పిల్లలకు ఆన్లైన్ చెస్ పాఠాలు బోధిస్తూ అంతో ఇంతో సంపాదించడం ప్రారంభించాడాయువకుడు. అలా తన పోటీలకు తానే సంపాదించుకోవడంతోపాటు రాంకీ లాంటి సంస్థలు కొంత ఆర్థిక చేయూతనందించాయి. దీంతో సుమారు 15 దేశాల్లో అంతర్జాతీయ పోటీలలో పాల్గొని తన రేటింగ్‌ను మెరుగుపరచుకున్నాడు. ఈ ఏడాది మేలో హంగేరీలో జరిగిన స్ప్రింగ్స్ ఫెస్టివల్ అంతర్జాతీయ చెస్ పోటీల్లో పాల్గొని తొలిసారి 2400 రేటింగ్‌ను అధిగమించడంతో ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదా సాధించాడు. బలహీనతలు ఆవరిస్తే ... అది 2015 బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీలు అవతలవైపు రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఇయాన్ చెపరినాతో మ్యాచ్. అందరూ విజయం ఏకపక్షమే అనుకున్నారు. మరొకరైతే ఒత్తిడికి లోనయ్యే వారే అయితే మెహర్ మాత్రం చిరునవ్వుతో గేమ్‌ను ప్రారంభించాడు. దాదాపు విజయానికి చేరువలోకి వచ్చిన సమయంలో చేసిన చిన్నపొరపాటుతో మ్యాచ్ డ్రా అయ్యింది. చెపరినాకు చెమటలు పట్టినంత పనయ్యింది. దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు మెహర్ ఆటను చూసి విస్మయం చెందారు. మెహర్‌కు ఆర్థిక వెసులుబాటు ఉండి అన్ని టోర్నమెంట్లు ఆడగలిగితే ఈ పాటికే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకునే వాడు. అయితే తన రేటింగ్ ప్రస్తుతం 2426 ఉంది. – మురమళ్ళ శ్రీనివాసరావు సాక్షి, గుంటూరు వెస్ట్ ఫోటోలు: గజ్జల రామ్‌గోపాల్ రెడ్డి. సాధించిన విజయాలు ►2006 ఇరాన్లో జరిగిన అండర్–12 బాలుర టోర్నమెంట్లో బంగారు పతకం. ►2007లో డిల్లీలో జరిగిన కామన్ వెల్త్ అండర్–14 విభాగంలో రజత పతకం. ►2011లో నాగ్‌పూర్‌లో జరిగిన 12వ జాతీయ నేషనల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం. ►2014లో దిండిగల్‌లో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం. ►2015లో కాకినాడలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చాంపియన్‌షిప్‌లో ప్ర«థమ స్థానం. అదే ఏడాది విజయవాడలో జరిగిన ఇదే టోర్నమెంట్లోనూ ప్రథమ స్థానం. ►దీంతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. -
గుహలోకి వెళ్లి తల్లి, కొడుకు మృతి
సాక్షి, పెండ్లిమర్రి: మండలంలోని యాదవాపురం గ్రామానికి చెందిన మల్లమ్మ(50), లక్షుమయ్య(22) పిట్టల ఎరువు కొసం గుహలోకి వెళ్లి ఊపిరాడక మంగళవారం మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవాపురం గ్రామంలో ఉన్న యానాదులు మల్లమ్మ, లక్షుమయ్య పెద్దదాసరిపల్లె గ్రామ పొలాల్లోని బోడబండ గుట్టలల్లో ఉన్న గుహలోకి వెళ్లారు.ఎంతసేపటికి వీరు రాకపోడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి కావడంతో మృతదేహాలను వెలికి తీయలేదు. -
కొడుకు పాఠశాలకు వెళ్లడం లేదని..100కు డయల్ చేసిన తల్లి
యాదగిరిగుట్ట (ఆలేరు) : తన కొడుకు పాఠశాలకు వెళ్ల డం లేదని.. ఓ తల్లి 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన యాదగిరిగుట్టలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణం లోని అంగడిబజార్‌కు చెందిన గంధమల్ల మంజు ల భర్త గత ఐదేళ్ల క్రితం మరణించాడు. దీంతో పిల్లలను మంచిగా చదివించి ప్రయోజకులను చేయాలని ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కుమారుడు లోకేష్ (14)ను మేడ్చల్‌లోని గురుకుల హాస్టల్లో 8వ తరగతిలో చేర్పించింది. దీంతో లోకేష్ 5 రోజుల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. తిరిగి పాఠశాలకు వెళ్లమంటే మారం చేస్తున్నాడు. తన కుమారుడిని భయపెట్టడానికి మంజుల మంగళవారం 100కు డయల్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థి లోకేష్‌ను, తల్లి మం జులను యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడివిగా కావా లని విద్యార్థికి పోలీసులు సూచించారు. -
68 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : రెండూ మూడేళ్ల క్రితం తప్పిపోయిన లేదా దూరమైన పిల్లవాడిని కలుసుకుంటే ఓ తల్లి హృదయం తన్మయత్వంతో పరవశించి పోతుంది. ఇక 68 ఏళ్ల క్రితం తన నుంచి దూరమైన కొడుకును కలసుకుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉప్పొంగిపోతుందో చెప్పలేం! అది ఆ తల్లికే తెలియాలి. 68 ఏళ్ల క్రితం కొరియన్ల యుద్ధం కారణంగా ఉత్తర కొరియాలోనే ఉండిపోయిన తన కొడుకు లీ సంగ్ చుల్‌ను దక్షిణ కొరియాకు తరలిపోయిన తల్లి లీ కియమ్ సియంకు అదృష్టవశాత్తు లభించింది. ప్రస్తుతం 92 ఏళ్ల వయస్సు గల ఆ తల్లి 72 ఏళ్ల వయస్సు గల తన కొడుకును సోమవారం నాడు కలుసుకొంది. ఆ వృద్ధ తల్లి తన రెండు చేతులను ఆప్యాయంగా చాచగా, కొడుకు వచ్చి తల్లిని హత్తుకుంటాడు. తనతోనే ఉత్తర కొరియాలో ఉండిపోయి ఎప్పుడో చనిపోయిన తన తండ్రి ఫొటోను కూడా లీ సంగ్ ఈ సందర్భంగా తల్లికి చూపిస్తారు. ఆ ఫొటోను చూసిన తల్లికి పాత జ్ఞాపకాలతో కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ తల్లీ తనయుల అరుదైన కలయికకు సంబంధించిన సన్నివేశాన్ని వీడియో తీసిన సీఎన్ఎన్ ఛానల్ దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కొరియన్ల యుద్ధం సందర్భంగా విడిపోయిన రక్త సంబంధీకులు తిరిగి కలుసుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అయితే గత మూడేళ్ల కాలంలో రక్త సంబంధీకులు ఇలా కలుసుకోవడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో 89 మంది వృద్ధులు ఇలా తమ పిల్లలను కలుసుకోవడం కోసం నిరీక్షిస్తున్నారు. వారిలో నుంచి లాటరీ పద్ధతి ద్వారా లీ కియమ్‌కు తనయుడిని కలుసుకునే అవకాశం లభించింది. అది గట్టి నిఘా మధ్యన. తల్లి కొడుకులు కలుసుకున్న ఆనందం కూడా వారికి ఎక్కువ సేపు ఉండదు. మూడు రోజుల్లో రోజుకు కొన్ని గంటలు మాత్రమే రక్తసంబంధీకులను కలుసుకునే అవకాశాన్ని దక్షిణ కొరియా కల్పిస్తోంది. ఆ తర్వాత దక్షిణ కొరియా పౌరులు తమ దేశానికి తరలిపోవాల్సిందే. -
68 ఏళ్ల తర్వాత తల్లీ తనయుల అరుదైన కలయిక
-
కొడుకులను దొంగలుగా మార్చిన అమ్మ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఏ తల్లైనా పిల్లలకు సుద్ధులు చెబుతుంది. చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని హితబోధ చేస్తుంది. అయితే చాంద్రాయణగుట్ట షహీన్‌నగర్‌కు చెందిన సనా బేగం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. తన ముగ్గురు కుమారుల్లో ఇద్దరిని దొంగలుగా మార్చింది. డబ్బు అవసరమైనప్పుడల్లా చోరీ చేసుకురమ్మంటూ పంపిస్తుంటుంది. దొంగతనం చేసుకువచ్చిన బంగారం అమ్మడంలో సహకరిస్తుంది. ఈ తల్లీ కొడుకులు గడిచిన మూడున్నరేళ్ల కాలంలో మొత్తం 33 నేరాలు చేశారు. వీరికి చెక్ చెప్పిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 1.65 కేజీల బంగారంతో సహా రూ.75 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్.. వెస్ట్ జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, పి.రాధాకిషన్‌రావుతో కలిసి పూర్తి వివరాలు వెల్లడించారు. ఓ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉంటూ.. పశ్చిమ మండలంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సనాబేగం(35) అలియాస్ నజమున్నీసాకు పదకొండో ఏటనే సయ్యద్ సర్వర్‌తో వివాహమైంది. పెళ్లైన తర్వాత భర్త ప్రోద్భలంతో పదో తరగతి వరకు చదివింది. ఆపై భర్తతో స్పర్థలు రావడంతో 21వ ఏట విడాకులు తీసుకుంది. అప్పటికే ఈమెకు ముగ్గురు కొడుకులు (సయ్యద్ మహ్మద్, సయ్యద్ సొహైల్, సయ్యద్ సాహిల్) పుట్టారు. చాంద్రాయణగుట్టలోని షహీన్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ అబ్దుల్ షకీల్‌ను రెండో వివాహం చేసుకున్న సనా.. తన మకాంను అక్కడకు మార్చింది. ప్రస్తుతం కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎమ్మెల్యేకు, ఈమెకు మధ్య నిత్యం ఆధిపత్యపోరు సాగుతోంది. కేవలం తొమ్మిది, పదో తరగతులు మాత్రమే చదివిన తన ముగ్గురు కుమారులకు వివాహాలు చేసిన సనా.. కోడళ్లతో కలిసి నివసిస్తోంది. ఎనిమిది మందితో కూడిన ఈ సంసారాన్ని నడపడానికి సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో తొలినాళ్లల్లో ఇబ్బందులు ఎదుర్కొంది. తన భర్త ఆటో నడపడం, రెండో కుమారుడు సోహైల్ కారు నడపటం ద్వారా వచ్చే సొమ్ముతో బతుకీడ్బటం కష్టంగా మారింది. దీంతో చోరీల పంధా ఎంచుకొంది. మూడున్నరేళ్ల నుంచి చోరీల బాట.. విలాసవంతమైన జీవితం గడపాలనే తన కోరిక తీర్చుకోవడానికి పెద్ద, చిన్న కుమారులైన మహ్మద్ (20), సాహిల్(18)ను దొంగలుగా మార్చింది. అవసరాల కోసం చోరీలు చేస్తే తప్పులేదంటూ నూరిపోసింది. దీంతో వీరిద్దరూ 2015 మార్చి నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ద్విచక్ర వాహనంతో పాటు హోండా అకార్డ్ కారులో తిరుగుతూ ఖరీదైన కాలనీల్లో రెక్కీలు చేస్తారు. తాళం వేసున్న ఇల్లు కనిపిస్తే చాలు పగలు, రాత్రి తేడా లేకుండా కిటికీ, గ్రిల్స్ పగులకొట్టి లోపలకు ప్రవేశిస్తారు. బంగారం, వెండి, నగదుతో పాటు ఇతర ఖరీదైన వస్తువులూ చోరీ చేసి ఉడాయిస్తారు. కారులో వెళ్లినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఉన్న టీవీ తదితరాలు ఎత్తుకువస్తారు. అలా కానప్పుడు కేవలం వెండి, బంగారం, నగదుతో ‘సర్దుకుపోతారు’. ఇలా చోరీ చేసిన సొత్తును తమ తల్లితో కలిసి చార్మినార్ ప్రాంతంలో నూర్ జ్యువెలర్స్ దుకాణం నిర్వహిస్తున్న మహ్మద్ నూరుద్దీన్‌కు విక్రయిస్తుంటారు. ఈ పంథాలో గడిచిన మూడున్నరేళ్ల కాలంలో వీరు హైదరాబాద్, సైబరాబార్ కమిషనరేట్ల పరిధిలో 33 నేరాలు చేశారు. ఎట్టకేలకు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్.. ఇలా వరుస పెట్టి నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ తల్లీకొడుకులు విలాసవంతంగా బతుకుతున్నారు. పెద్ద కుమారుడి పుట్టిన రోజు కోసం ఏకంగా సనాబేగం రూ. 6 లక్షలు ఖర్చు చేసి పార్టీ చేసింది. ఈ కేసులను ఛేదించేందుకు రంగంలోకి దిగిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి. గట్టుమల్లు నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలు సేకరించింది. వీరి వ్యవహారశైలి పైనా సమాచారం అందిన నేపథ్యంలో శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు వెలుగులోకి రావడంతో సనా, మహ్మద్, సాహిల్‌తో పాటు నూర్ మహ్మద్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి నేరాలు చేయడానికి వాడిన కారు, ద్విచక్ర వాహనంతో పాటు 1.65 కేజీల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులతో కలిపి మొత్తం రూ.75 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంది. ఘరానా నేర చరిత్ర ఉండి, తొలిసారిగా చిక్కిన ఈ ముగ్గురి పైనా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని కొత్వాల్ అంజనీ కుమార్ తెలిపారు. వీరి దారి.. వెనుక దారి సనాబేగం డైరెక్షన్లో యాక్షన్‌లోకి దిగి చోరీలు చేసే కుమారులు సయ్యద్ మహ్మద్, సయ్యద్ సాహిల్ వ్యవహారశైలి ఆసక్తికరంగా ఉంది. చోరీ చేసే ప్రాంతాన్ని బట్టి కారు లేదా ద్విచక్ర వాహనంపై వెళ్లే ‘పుత్ర ద్వయం’ నిత్యం తమ వెంట ఓ కిట్ తీసుకెళుతుంది. అందులో స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్, గ్రిల్ కట్టర్ వంటివి ఉంటాయి. తాళం వేసున్న ఇంటిని ఎంచుకునే వీరు దాని వెనుక కిచెన్ లేదా స్టోర్స్ ద్వారాన్ని పగులకొట్టి, గ్రిల్స్ తొలగించి, కిటికీ ఊచలు విరిచి లోనికి ప్రవేశిస్తారు. వెంటనే ముందు ప్రధాన ద్వారానికి లోపల నుంచి బోల్ట్ పెట్టేస్తారు. ఇలా చేయడం ద్వారా చోరీ చేస్తున్నప్పుడు ఇంటి యజమానులు వచ్చి తాళం తీసినా.. తలుపు రాకపోవడంతో కాసేపు గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ అలికిడి వినే ఇరువురూ వెనుక వైపు నుంచి పారిపోతారు. దాదాపు 10 సందర్భాల్లో ఈ ద్వయం ఇలా తమ కాళ్లకు బుద్ధి చెప్పింది. ఘనంగా 18వ పుట్టిన రోజు.. తేలిగ్గా వచ్చే డబ్బుతో జల్సాలు చేస్తున్న సనా బేగం తన పెద్ద కుమారుడికి 2016లో అతడి 18వ పుట్టిన రోజును సెవెన్ టూంబ్స్ వద్ద ఉన్న ఎఫ్ఎఫ్ ఫంక్షన్ హాల్లో రూ.6 లక్షలు వెచ్చించి మరీ వేడుక చేసింది. తన ముగ్గురి కుమారుల పెళ్లిళ్లనూ చోరీ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతోనే విలాసవంతంగా నిర్వహించింది. తన ఇద్దరి కుమారులతో కలిసి చోరీలు చేస్తున్నప్పటికీ ఈ విషయాన్ని తన రెండో కుమారుడు, డ్రైవర్ అయిన సోహైల్‌కు తెలియకుండా జాగ్రత్త పడింది. తస్కరించిన చోరీ సొత్తును చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్ వద్ద నూర్ జ్యువెలర్స్ నిర్వహించే మహ్మద్ నూరుద్దీన్‌కు అమ్మేవారు. ఆ సొత్తుకు ఇవ్వాల్సిన డబ్బును ఇతగాడు చెక్కుల రూపంలో ఇచ్చాడు. దీంతో నూరుద్దీన్‌ను కూడా అరెస్టు చేశారు. మూడున్నరేళ్లుగా నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అన్నదమ్ముల కదలికలు బంజారాహిల్స్‌లోని ఓ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు మరో కీలక సమాచారం అందింది. షహీన్‌నగర్‌లో నివసిస్తున్న సనా అనే మహిళ, ఆమె కుమారులు ఎలాంటి పనీ చేయరని, అయితే విలాసవంతంగా బతుకుతారని వేగుల ద్వారా తెలిసింది. కేసులో కీలక పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు, ఎస్సైలు వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి తదితరుల్ని కొత్వాల్ అభినందించి రివార్డులు అందించారు. -
కర్నూలు: తల్లి,కొడుకుల అనుమానస్పద మృతి
-
తల్లీకొడుకుల ఆత్మహత్య
సిరికొండ(నిజామాబాద్ రూరల్) : వరకట్న వేధింపులకు తల్లీకొడుకులు బలయ్యారు. ధర్పల్లి మం డలంలోని పల్లె చెరువు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. ధర్పల్లి మండలంలోని మద్దు ల్ తండాకు చెందిన లావణ్య(24)కు పల్లె చెరువు తండాకు చెందిన మహీపాల్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి అఖిల్(2) అనే కుమా రుడు ఉన్నాడు. మహీపాల్ ఏడాదిన్నర క్రితం ఉ పాధి కోసం దుబాయికి వెళ్లాడు. అతడి కుటుంబ సభ్యులు లావణ్యను అదనపు కట్నం కోసం తర చూ వేధించేవారు. మహీపాల్ సైతం గల్ఫ్ నుంచి ఫోన్లో లావణ్యను వేధించేవాడు. మూడు రోజు ల క్రితం అత్త, తోటి కోడలు, బావ, మరిది అదనపు కట్నం కోసం లావణ్యతో గొడవపడ్డారు. దీంతో కలత చెందిన లావణ్య ఆదివారం రాత్రి కుమారుడికి విషం ఇచ్చి తానూ తాగింది. సోమ వారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి వారిద్దరూ విగతజీవులై కనిపించారు. విష యం తెలుసుకున్న లావణ్య బంధువులు మద్దుల్ తండా నుంచి పల్లె చెరువు తండాకు చేరుకున్నా రు. అక్కడ లావణ్య అత్త, ఇతర కుటుంబ సభ్యు లు లేకపోవడంతో కోపోద్రిక్తులయ్యారు. వారి గుడిసెకు, వరి ధాన్యానికి నిప్పంటించారు. పోలీసులు ఫైరింజన్‌ను రప్పించి మంటలను ఆర్పి వే యించారు. మృతురాలి కుటుంబ సభ్యులను అప్పగించేంత వరకు మృతదేహాలను తరలించేది లేదని లావణ్య బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డిచ్ పల్లి సీఐ రామాంజనేయులు, నిజామాబాద్ ఏసీ పీ మంత్రి సుదర్శన్ ఘటనా స్థలానికి చేరుకు ని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతదేహాలను పోస్టుమార్టం ని మిత్తం నిజామాబాద్‌కు తరలించారు. లావణ్య బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. -
విధి వంచితులు.!
వారు కడు నిరుపేదలు.. ఒకరు మూర్ఛ వ్యాధితో అల్లాడుతుంటే.. మరొకరు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు.. ఎవరైనా దయతలచి కాస్త అన్నం పెడితే వారు ఆకలి తీర్చుకుంటారు.. లేదంటే కడుపు మాడ్చుకోవాల్సిందే.. అత్యంత దుర్భరంగా బతుకీడుస్తూ.. మానవతా వాదుల చేయూత కోసం ఎదురు చూస్తున్న తల్లీబిడ్డల దీనగాధ ఇది. అట్లూరు:అట్లూరు మండల పరిధిలోని మణ్యవారిపల్లి బీసీ కాలనీలో కత్తి సుబ్బమ్మ(70), కత్తి పుల్లయ్య(40) అనే తల్లీ కొడుకు నివాసముంటున్నారు. సుబ్బమ్మకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, కుమార్తెలతో పాటు ఒక కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు పుల్లయ్యకు మూర్ఛ వ్యాధితోపాటు బుద్ధి మాంద్యం కూడా ఉంది. దీంతో అతనికి పెళ్లి కూడా చేయలేదు. పుల్లయ్య బద్వేలు పట్టణంలో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతూ వారానికో.. లేదా నెలకో ఒకసారి తల్లి వద్దకు వచ్చి వెళ్లేవాడు. తల్లి సుబ్బమ్మ కూలీపనులు చేసుకుని జీవనం సాగించేది. ఆమెకు ఏడేళ్ల క్రితం పక్షవాతం సోకింది. ఫలితంగా ఒక కాలు, ఒక చేయి పనిచేయక పోవడంతో కదలలేక మంచానికే పరిమితమైంది. ఈ పరిస్థితిలో కుమారుడు కూడా తల్లి వద్దకే చేరుకున్నాడు. అయితే తలదాచుకునేందుకు వీరికి కనీసం గూడు కూడా లేకపోవడంతో పట్టలు కప్పిన ఓ చిన్న గుడారంలో వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ కనాకష్టంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు అనారోగ్యంతో అడుగు ముందుకేయలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మానవతావాదులపై ఉంది. అర్హులైన వారికి వృద్ధాప్య.. వికలాంగ పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పుకునే పాలకులు ఇలాంటి వారి విషయంలో సానుకూలంగా స్పందించాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. -
సీఐ సోదరితో ప్రేమాయణం: అసలేం జరిగింది?
సాక్షి, కర్ణాటక(కృష్ణరాజపురం) : అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి పడిపోయి తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన కేఆర్.పురం పరిధిలోని కాడుగోడి వార్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదగిరికి చెందిన మౌనేశ్ (36) కేఎస్ ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తుండేవాడు. మూడు సంవత్సరాల కింద తుమకూరు జిల్లా స్పెషల్ పోలీస్ బృందం సీఐ చంద్రప్ప సోదరితో మౌనేశ్‌కు పరిచయమైంది. బీఎడ్ పరీక్షల కోసం మౌనేశ్ యాదగిరికి శిక్షణ తీసుకోవడానికి బస్సులో వెళ్తుండగా సీఐ చంద్రప్ప సొదరితో పరిచయం ఎర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కాగా మౌనేశ్‌కు అప్పటికే వివాహమై పిల్లలు ఉండడంతో సీఐ చంద్రప్ప వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడికి చంద్రప్ప సోదరి కొంత కాలంగా మౌనేశ్‌కు దూరంగా ఉంటుంది. అయితే కొద్ది రోజుల నుంచి చంద్రప్ప సోదరి కనిపించడం లేదంటూ కాడుగోడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని వెనక మౌనేశ్ హస్తం ఉండొచ్చనే అనుమానంతో సీఐ చంద్రప్ప మాట్లాడాలంటూ మౌనేశ్‌తో పాటు అతని తల్లి సుందరమ్మ(60)ను కాడుగోడిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. గత కొన్ని రోజుల నుంచి వారిని చంద్రప్ప గృహనిర్భంధం చేసి సోదరి గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మౌనేశ్, సుందరమ్మలు అపార్ట్మెంట్ నుంచి పడిపోయి మృతి చెందడంతో వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్ సింగ్, వైట్‌ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ వహాద్, కాడుగోడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. మృతుల శరీరాలపై గాయాలు ఉండడం అనుమానాలను మరింత పెంచుతోంది. కాడుగోడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీ, కుమారుడి ఆత్మహత్య
అన్నానగర్: తల్లి, కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం తూత్తుకుడిలో చోటుచేసుకుంది. తూత్తుకుడి జార్జ్రోడ్డు థామస్నగర్ 4వ వీధికి చెందిన సహాయనాథన్. ఇతని భార్య సహాయమేరి (47). వీరి కుమారుడు సహాయరాజ్ (27) అవివాహితుడు. సహాయనాథన్ మృతిచెందాడు. సహాయరాజ్ తూత్తుకుడి హార్బర్లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సహాయరాజ్ ఇంటి తలుపులు చాలాసేపైనా తెరుచుకోలేదు. అనుమానించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు సీఐ ముత్తు, ఎస్ఐ వేలాయుధం, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం స్థానికుల సహాయంతో సహాయరాజ్ ఇంటి తలుపులు పగులగొట్టి పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ సహాయరాజ్, తల్లి సహాయమేరి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందడం చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వీరి ఆత్మహత్యకు కందువడ్డి వేధింపులు కారణమా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
విషాదం: తల్లీ, కుమారుడు మృతి..
వత్సవాయి: కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా.. విద్యుదాఘతానికి గురై తల్లీ కుమారుడు మృతిచెందారు. ఈ సంఘటన వత్సవాయి మండలం మాచినేనిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి ఇంద్రాణి(50) ఉతికిన బట్టలను ఇనుప దండెంపై ఆరేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. ఇది గుర్తించిన కుమారుడు వాసు(32) ఆమెను రక్షించడానికి యత్నిస్తుండగా.. అతనికి కూడా విద్యుత్‌షాక్ తగలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. -
కిరోసిన్ పోసుకుని తల్లీ కొడుకు ఆత్మహత్య
-
మృత్యుంజయులు ఆ తల్లీబిడ్డ
సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలినా ఓ తల్లీకొడుకు మాత్రం మృత్యుంజయులుగా బయటపడ్డారు. అయితే కూలిన భవనానికి ఉత్తరం వైపున మరో భవనం ఉంది. ఆ భవనాన్ని ఆనుకొని శాంతాబాయికి చెందిన భవనం ఉంది. అక్కడ శిథిలాల్లో కొందరు ఉండే అవకాశముందని స్థానికులు అధికారులకు సూచించారు. దీంతో పక్కనున్న భవనాన్ని కొద్ది మేర కూల్చి, సమాంతరంగా గొయ్యి తవ్వారు. డాగ్‌స్క్వాడ్ కూడా అక్కడ ఎవరో ఉన్నట్లుగా సూచించింది. గురువారం అర్ధరాత్రి అనంతరం 2 గంటల సమయంలో మహిళ, చిన్నారి ఏడుపులు వినిపించడంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తమైంది. చిన్నపాటి రంధ్రం చేయగా రేఖ (25) కనిపించింది. అక్కడే ముగ్గురం ఉన్నామని, తమను త్వరగా కాపాడాలని అర్థించింది. అధికారులు మరో మూడు గంటల పాటు శ్రమించి, మెల్లమెల్లగా శిథిలాలను తొలగించి ఆమెతోపాటు కుమారుడు దీపక్ (3)ను ప్రాణాలతో బయటకు తీశారు. అయితే రేఖ భర్త శివ (30) మాత్రం మృతిచెందాడు. అయితే రేఖ వెన్నెముక, కాలు, మోకాలికి తీవ్రగాయాలుకాగా.. దీపక్ ఎడమ కాలు విరగింది, తలకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవైపు భర్త మరణించడం, కుమారుడు తీవ్రగాయాలపాలై తనతోపాటు ఆస్పత్రిలో ఉండడంతో రేఖ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. (ప్రధానవార్త: మృత్యుఘోష) -
ఆస్ట్రేలియాలో తల్లీకొడుకుల అనుమానాస్పదమృతి
ఆర్మూర్ అర్బన్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సుప్రజ (28)తోపాటు ఆరు నెలల కుమారుడు అనుమానాస్పదస్థితిలో 20 అంతస్తుల భవనంపై నుంచి పడి మృతి చెందారు. ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గంగాధర్‌కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్‌కు హైదదాబాద్ శేరిలింగంపల్లికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కూతురు సుప్రజతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అనంతరం భార్యాభర్తలు హైదరాబాద్‌లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు. కాగా, వీరు గతంలో లండన్‌లోని కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు చేశారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ కుటుంబంతో ఆస్ట్రేలియా వెళ్లాడు. సుప్రజ గర్భిణిగా ఉండడంతో గతేడాది డిసెంబర్లో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర మెల్బోర్న్ వెళ్లారు. సుప్రజకు ఆరు నెలల క్రితం కుమారుడు జన్మిం చాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే ఆర్మూర్‌కు తిరిగి వచ్చారు. శ్రీని వాస్, సుప్రజలు సైతం ఈ నెలలోనే ఇక్కడికి రావాల్సి ఉంది. -
కాకరకాయ కూరలో మత్తుమందు పెట్టి..
- 9 తులాల బంగారంతో ఉడాయించిన తల్లీకొడుకులు మేడ్చల్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : రెండు రోజుల క్రితం అద్దెకు దిగి.. అదే ఇంట్లో ఉన్న అత్తాకోడళ్లకు కాకరకాయ కూరలో మత్తుమంది కలిపి ఇచ్చి వారి ఒంటిపై ఉన్న మంగళసూత్రాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం పూడూర్లో మంగళవారం చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన తోకల రవికి భార్య నీరజ(35),ముగ్గురు పిల్లలు(శివాణి,మణికంఠ,వెంకటేశ్)లతో పాటు తల్లి రాములమ్మ(65),తండ్రి వెంకయ్యలు ఉన్నారు. వీరికి ఉన్న ఇంటిలో కింది భాగంలో వీరు ఉంటుండగా.. పై అంతస్థును అద్దెకు ఇచ్చారు. వాటిలో ఒక గది ఖాళీగా ఉండడంతో ఇంటి ముందు టులెట్ బోర్డు పెట్టారు. దీంతో గత 15 రోజుల క్రితం ఇద్దరు వచ్చి తాము వరంగల్ జిల్లా ఆలేరు జనగాంకు చెందిన వారమని, ఇంట్లో అద్దెకు ఉంటామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. రెండు రోజుల క్రితం ఇంట్లో అద్దెకు దిగిన తల్లీకుమారులు సోమవారం రాత్రి ఇంటి యుజమాని రవి డ్యూటీకి వెళ్ళడంతో ఇదే అదునుగా భావించి ఇంటి ఇంట్లో ఉన్న రాములమ్మ(65), నీరజ(35)లకు మత్తు మందు ఇచ్చి వారి ఒంటిపై ఉన్న 9 తులాల మంగళసూత్రాలను దోచుకుని పారిపోయారు. కూరలో మత్తుమందు కలిపి.. దొంగతనానికి ఒడిగట్టిన తల్లీకుమారులు.. ఇంటి యజమాని రవి నైట్ డ్యూటీ చేసేందుకు రాత్రి 8 గంటలకు ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి.. తమ వద్ద కాకరకాయలు ఉన్నాయని, వాటిని వండి ఇవ్వమని రవి భార్య నీరజను అడగగా ఆమె కూర చేసి ఇచ్చింది. ఆ సమయంలో మహిళ.. ఇంటి యజమాని రవి తల్లి రాములమ్మతో మాటలు చెప్పి దోస్తీ కుదుర్చుకుంది. ఇంట్లో ఉన్న పిల్లలతో కల్లు, కూల్‌డ్రింక్ తెప్పించుకుని కల్లును రాములమ్మ, మహిళ త్రాగగా.. పిల్లలు,నీరజ కూల్‌డ్రింక్ సేవించారు. కూర అయిన తర్వాత తన కుమారుడికి వడ్డించి వస్తానని కూర తీసుకెళ్ళిన మహిళ కూరలో మత్తుమందు కలిపి మరో గిన్నెలో వేసుకుని కొద్దిసేపటి తర్వాత యజమానుల ఇంట్లోకి వచ్చి వారిని తినమని చెప్పింది. దీంతో రాములమ్మ, నీరజలు మత్తుమందు కలిపిన కూరను వేసుకుని తింటుండగా కూర ఏదో రకంగా అనిపిస్తుందని నీరజ అనగా కూర కొంచెం చేదుగా ఉండడంతో తాను బెల్లం కలిపానని ఆ మహిళ వారికి నచ్చజెప్పింది. మీరు కూడా కూర వేసుకోమని నీరజ ఆ మహిళను కోరగా తన కంచంలో కూడా అదే కూర ఉందని వారికి నచ్చజెప్పి తినిపించింది. అనంతరం తాను కూడా మీ ఇంట్లోనే పడుకుంటానని మహిళ మాయమాటలు చెప్పి ఇంట్లోనే నిద్రించింది.అప్పటికే పిల్లలు కూడా నిద్రపోవడంతో పాటు రాములమ్మ,నీరజలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. తల్లీ కుమారులు పథకం ప్రకారం వారి ఒంటిపై ఉన్న 9తులాల బంగారు మంగళసూత్రాలను దోచుకుని వెళ్ళిపోయారు. మంగళవారం ఉదయం డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన రవి ఇంటి తలుపులు తెరచి ఉన్నాయని చూసి ఇంట్లోకి వెళ్లి చూడగా భార్య,తల్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లారని గమనించడంతో పాటు చిన్నారులు రాత్రి ఇంట్లోనే పడుకుంటానని చెప్పిన మహిళ లేదని తెలుపడంతో దొంగతనం జరిగిందని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రాములమ్మ, నీరజలను 108 వాహనంలో మొదట స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి,ఎస్ఐ పవన్,గోపరాజు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు.తల్లీకుమారులు అద్దెకు ఉన్న ఇంట్లో వెతకగా క్షుద్రపూజల తరహాలో పూజలు చేసి ఉండడంతోపాటు గదిలో ఒక సిమ్‌కార్డును లభ్యమైంది. మత్తు నుండి కొంచెం స్పృహలోకి వచ్చిన నీరజను ఎలా జరిగిందని అడగగా కాకరకాయ కూర తినిపించిందని తెలిపింది. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి మృతితో కుమారుడు ఆత్మహత్య
తిరుచానూరు : కన్నతల్లి అనారోగ్యంతో మృతి చెందగా, మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముని జాజమ్మ (54) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు పుష్కరనాథ్ (30) అనే కుమారుడు ఉన్నాడు. గురువారం సాయంత్రం జాజమ్మ మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె కూడా అనారోగ్యంతో గతంలో మృతి చెందారు. దీంతో తల్లి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన పుష్కరనాథ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా గురువారం ఉదయం గుర్తించారు. అమ్మ, నాన్న, చెల్లి లేకుండా ఉండలేనంటూ అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అగ్నిప్రమాదంలో తల్లీ కొడుకు మృతి
గుండాల: తల్లీ, కుమారుడు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరశురాములు హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి బండకొత్తపల్లిలో పౌల్ట్రీఫారం ఉంది. ఈ నేపథ్యంలో పరశురాములు తన భార్య కల్పన, కుమారుడు అభినందన్ (8)లను రెండు రోజుల క్రితం బండకొత్తపల్లికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో కరెంటు లేకపోవడంతో కల్పన పక్కనే ఉన్న అత్తింట్లో కొంత కిరోసిన్ తెచ్చుకుని వంట చేసుకుంది. రాత్రి సమయంలో వీరి ఇంటి నుంచి పొగలు రావడాన్ని కల్పన అత్త గమనించి స్థానికులకు తెలిపింది. వారొచ్చేసరికే కల్పన, అభినందన్ మంటల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడి అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ తల్లీ, కుమారుడు మృతి చెందారు. అగ్ని ప్రమాదం వెనుకనున్న కారణాలు ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి, కొడుకుపై కత్తితో దుండగుల దాడి
-
తల్లి, కొడుకుపై కత్తితో దుండగుల దాడి
అద్దంకి(ప్రకాశం): నగలు దోచుకునే ప్రయత్నాన్ని అడ్డుకున్న తల్లి, కొడుకుపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ నాలుగో లైనులో జొన్నలగడ్డ భారతి తన కుమారుడు అయ్యప్ప(15)తో కలసి నివాసం ఉంటోంది. శుక్రవారం రాత్రి ఆ ఇంట్లోకి ఓ దుండగుడు ప్రవేశించి నిద్రిస్తున్న భారతి మెడలోని బంగారు గొలుసును లాగేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన భారతి ప్రతిఘటించి కేకలు వేయటంతో అయ్యప్ప దుండగుడిని అడ్డుకున్నాడు. అయితే, ఆగంతకుడు తన వద్దనున్న కత్తితో అయ్యప్పను, భారతిని గాయపరిచి ఆమె మెడలోని గొలుసును తెంపుకొని పారిపోయాడు. క్షతగాత్రులను అద్దంకి ఆస్పత్రికి తరలించారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ చౌరస్తాలోని లక్ష్మీవిలాస్ వద్ద వ్యాగనార్ కారు డివైడర్‌కు ఢీకొన్న సంఘటనలో తల్లీకొడుకు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. బీహెచ్ఈఎల్ మ్యాక్స్ సొసైటీ కాలనీకి చెందిన దుర్గయ్య కుటుంబ సభ్యులు పాతబస్తీలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దుర్గయ్య కొడుకు శ్రీనాథ్(34), దుర్గయ్య భార్య పద్మ అక్కడికక్కడే మృతిచెందగా, దుర్గయ్య సహా మిగిలిన ఏడుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (మియాపూర్) -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి
నిజామాబాద్: వేగంగా ప్రయాణిస్తున్న కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన తల్లి కొడుకులు కృష్ణవేణి, మహేష్ హైదరాబాద్ వెళ్లి వస్తుండగా కారు సికింద్రాపూర్ సమీపానికి చేరుకోగానే రోడ్డు పక్కనే నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి
రాప్తాడు (అనంతపురం): అనంతపురం జిల్లా రాప్తాడులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం తల్లి కొడుకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. రాప్తాడు మండలంలోని హంపాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ నారయణమ్మ(35), తన కుమారుడు దినేశ్(15)తో కలిసి ద్విచక్రవాహనంపై పొలానికి వెళుతుండగా, బెంగుళూరు వైపు వెళ్లే కారు వీరిని ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన బాధితులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషం తాగి కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్: చేసిన అప్పులు తీరడం లేదు... వాటికి వడ్డీలు మాత్రం పెరిగిపోతున్నాయి. అప్పలు తీర్చాలని ఒత్తిడి రోజురోజూకు అధికమవుతుంది. రోజు గడవడమే కష్టంగా ఉంది. ఇంకా అప్పులు ఏలా తీరుస్తామనుకున్నట్లు ఉన్నారు. దాంతో మరణమే శరణ్యమని ఆ కుటుంబం భావించింది. అంతే ఆ కుటుంబంలోని భార్యాభర్తతోపాటు కుమారుడు విషం తాగి మరణించారు. ఆ ఘటన నగర శివారుల్లోని కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు ఆ విషయాని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నాగార్జున నగర్ కాలనీలోని మృతుల ఇంటికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృతులకు 8 లక్షలు ఎక్స్‌గ్రేషియా: టీటీడీ
తిరుపతి: తిరుమల టీబీసీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో మరణించిన తల్లీకొడుకులకు టీటీడీ మంగళవారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతులకు రూ. 8 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో ఎం.జీ.గోపాల్ మంగళవారం ప్రటించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా రామంజెర్రికి చెందిన అయిదుగురు కుటుంబ సభ్యులు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి సోమవారం వచ్చారు. ఆ క్రమంలో మొక్కులు సమర్పించుకున్నారు. దేవుడ్ని దర్శించుకునేందుకు ఆ కుటుంబమంతా క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే ఏడాది వయస్సు ఉన్న కుమారుడు మహేశ్‌ని ఎత్తుకున్న తల్లి లక్ష్మికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే విగత జీవులుగా పడి ఉన్నారు. దాంతో వారిని టీటీడీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించారని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతులకు రూ. 8 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల దుర్మరణం
బొండపల్లి : అర్ధరాత్రి సమయం.. అప్పటి వరకూ అయిన వారి ఇంట పెళ్లిలో సందడిగా గడిపారు. మనిషికి మనిషి తోడున్నాము కదా అని.. రాత్రయినా తమ ఇళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. తాము వచ్చిన ఆటోలోనే తిరుగు ప్రయూణమయ్యూరు. పెళ్లి ఇంటిని వదిలి.. ఆ ఊరిని దాటి కాస్త సమయమైనా కాలేదు. ఇంతలోనే ఉరుములా వచ్చింది ఎక్కడి నుంచో మాయదారి లారీ. మృత్యువై మీద పడింది. చూస్తుండగానే ఇద్దరి ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ విషాదకర ఘటన అందరినీ కలిచివేసింది. తీవ్రంగా బాధించింది. ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరూ తల్లీకొడుకులు. మృత్యువులోనూ వీడని వారి బంధాన్ని చూసి అక్కడి వారు తల్లడిల్లిపోయూరు. గొట్లాం మధుర గ్రామం జియన్నవలస జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 సమయంలో(తెల్లవారితే గురువారం) ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఈ ఘటనలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యూరుు. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రితోపాటు, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గొట్లాం మధుర గ్రామం జియన్నవలసలో పెళ్లి ఉండడంతో పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన కొంతమంది అదే మండలానికి చెందిన ఆటోలో బయల్దేరారు. పెళ్లి చూసుకుని తమ స్వగ్రామానికి రాత్రి 1.30 సమయంలో బయల్దేరారు. గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ఆటో వస్తుండగా.. గుర్తు తెలియని లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయూడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన గొడ్డు సంతోషి(39), ఆమె కుమారుడు అప్పలరాజు(4) తీవ్ర గాయూలపాలై సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన వడ్డి సీతయ్య, వి.అసిరినాయుడు, రీసు గౌరి, చందు, పి.రాజమ్మ, జి.గౌరి తీవ్ర గాయూలపాలయ్యూరు. -
మృత్యువులోనూ వీడని బంధం
బొండపల్లి :అర్ధరాత్రి సమయం.. అప్పటి వరకూ అయిన వారి ఇంట పెళ్లిలో సందడిగా గడిపారు. మనిషికి మనిషి తోడున్నాము కదా అని.. రాత్రయినా తమ ఇళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. తాము వచ్చిన ఆటోలోనే తిరుగు ప్రయూణమయ్యూరు. పెళ్లి ఇంటిని వదిలి.. ఆ ఊరిని దాటి కాస్త సమయమైనా కాలేదు. ఇంతలోనే ఉరుములా వచ్చింది ఎక్కడి నుంచో మాయదారి లారీ. మృత్యువై మీద పడింది. చూస్తుండగానే ఇద్దరి ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ విషాదకర ఘటన అందరినీ కలిచివేసింది. తీవ్రంగా బాధించింది. ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరూ తల్లీకొడుకులు. మృత్యువులోనూ వీడని వారి బంధాన్ని చూసి అక్కడి వారు తల్లడిల్లిపోయూరు. మండలంలోని గొట్లాం మధుర గ్రామం జియన్నవలస జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 సమయంలో(తెల్లవారితే గురువారం) ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఈ ఘటనలో తల్లీకొడుకు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యూయి. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రితోపాటు, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నారుు. గొట్లాం మధుర గ్రామం జియన్నవలసలో పెళ్లి ఉండడంతో పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన కొంతమంది అదే మండలానికి చెందిన ఆటోలో బయల్దేరారు. పెళ్లి చూసుకుని తమ స్వగ్రామానికి రాత్రి 1.30 సమయంలో బయల్దేరారు. గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ఆటో వస్తుండగా.. గుర్తు తెలియని లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయూడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన గొడ్డు సంతోషి(39), ఆమె కుమారుడు అప్పలరాజు(4) తీవ్ర గాయూలపాలై సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన వడ్డి సీతయ్య, వి.అసిరినాయుడు, రీసు గౌరి, చందు, పి.రాజమ్మ, జి.గౌరి తీవ్ర గాయూలపాలయ్యూరు. వీరిని 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అదే విధంగా రీసు రాజేష్, రీసు చిన్న, హేమలత, పి.నాగమణి, ఇ.అప్పయ్యమ్మ, రెల్లివలస గ్రామానికి చెందిన ఆటో డ్రవర్ ఇజ్జురోతు ఈశ్వరరావులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే బొండపల్లి ఎస్సై జె.తారకేశ్వరరావు సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శోక సంద్రంలో యూతపేట పూసపాటిరేగ : గొట్లాం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృత్యువాత పడడంతో మండలంలోని యూతపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులతోపాటు క్షతగాత్రులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.