
మహిపాల్ లావణ్యల పెళ్లి నాటి ఫొటో
సిరికొండ(నిజామాబాద్ రూరల్) : వరకట్న వేధింపులకు తల్లీకొడుకులు బలయ్యారు. ధర్పల్లి మం డలంలోని పల్లె చెరువు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. ధర్పల్లి మండలంలోని మద్దు ల్ తండాకు చెందిన లావణ్య(24)కు పల్లె చెరువు తండాకు చెందిన మహీపాల్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి అఖిల్(2) అనే కుమా రుడు ఉన్నాడు. మహీపాల్ ఏడాదిన్నర క్రితం ఉ పాధి కోసం దుబాయికి వెళ్లాడు.
అతడి కుటుంబ సభ్యులు లావణ్యను అదనపు కట్నం కోసం తర చూ వేధించేవారు. మహీపాల్ సైతం గల్ఫ్ నుంచి ఫోన్‌లో లావణ్యను వేధించేవాడు. మూడు రోజు ల క్రితం అత్త, తోటి కోడలు, బావ, మరిది అదనపు కట్నం కోసం లావణ్యతో గొడవపడ్డారు. దీంతో కలత చెందిన లావణ్య ఆదివారం రాత్రి కుమారుడికి విషం ఇచ్చి తానూ తాగింది. సోమ వారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి వారిద్దరూ విగతజీవులై కనిపించారు.
విష యం తెలుసుకున్న లావణ్య బంధువులు మద్దుల్ తండా నుంచి పల్లె చెరువు తండాకు చేరుకున్నా రు. అక్కడ లావణ్య అత్త, ఇతర కుటుంబ సభ్యు లు లేకపోవడంతో కోపోద్రిక్తులయ్యారు. వారి గుడిసెకు, వరి ధాన్యానికి నిప్పంటించారు. పోలీసులు ఫైరింజన్‌ను రప్పించి మంటలను ఆర్పి వే యించారు. మృతురాలి కుటుంబ సభ్యులను అప్పగించేంత వరకు మృతదేహాలను తరలించేది లేదని లావణ్య బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
డిచ్ పల్లి సీఐ రామాంజనేయులు, నిజామాబాద్ ఏసీ పీ మంత్రి సుదర్శన్ ఘటనా స్థలానికి చేరుకు ని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతదేహాలను పోస్టుమార్టం ని మిత్తం నిజామాబాద్‌కు తరలించారు. లావణ్య బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment