
ఆస్ట్రేలియాలో తల్లీకొడుకుల అనుమానాస్పదమృతి
ఆర్మూర్ అర్బన్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సుప్రజ (28)తోపాటు ఆరు నెలల కుమారుడు అనుమానాస్పదస్థితిలో 20 అంతస్తుల భవనంపై నుంచి పడి మృతి చెందారు. ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గంగాధర్‌కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్‌కు హైదదాబాద్ శేరిలింగంపల్లికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కూతురు సుప్రజతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.
అనంతరం భార్యాభర్తలు హైదరాబాద్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవారు. కాగా, వీరు గతంలో లండన్‌లోని కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు చేశారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ కుటుంబంతో ఆస్ట్రేలియా వెళ్లాడు. సుప్రజ గర్భిణిగా ఉండడంతో గతేడాది డిసెంబర్‌లో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర మెల్‌బోర్న్ వెళ్లారు. సుప్రజకు ఆరు నెలల క్రితం కుమారుడు జన్మిం చాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే ఆర్మూర్‌కు తిరిగి వచ్చారు. శ్రీని వాస్, సుప్రజలు సైతం ఈ నెలలోనే ఇక్కడికి రావాల్సి ఉంది.