
సాక్షి, బెంగళూరు: పోలీసుల కేసుకు భయపడి తల్లి కొడుకు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో బుధవారం వెలుగు చూసింది. మోహన్‌గౌడ (18) అనే యువకునిపై బైక్ చోరీ కేసు నమోదు కావడంతో పోలీసులకు భయపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లి లీలావతి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మరణం, మరోవైపు పోలీసులు తనను కూడా విచారణ చేస్తారని భయపడి ఆస్పత్రి బయట ఉన్న కారుకు తలకొట్టుకోవడంతో ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ మేరకు విజయనగర పోలీస్ స్టేషన్ ద్వారా వివరాలు తెలిశాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
చదవండి: శారీరక శ్రమకు దూరంగా.. అనారోగ్యానికి దగ్గరగా
Comments
Please login to add a commentAdd a comment