vijayanagara police
-
కేసు భయంతో తల్లీకొడుకు ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: పోలీసుల కేసుకు భయపడి తల్లి కొడుకు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో బుధవారం వెలుగు చూసింది. మోహన్‌గౌడ (18) అనే యువకునిపై బైక్ చోరీ కేసు నమోదు కావడంతో పోలీసులకు భయపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లి లీలావతి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మరణం, మరోవైపు పోలీసులు తనను కూడా విచారణ చేస్తారని భయపడి ఆస్పత్రి బయట ఉన్న కారుకు తలకొట్టుకోవడంతో ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ మేరకు విజయనగర పోలీస్ స్టేషన్ ద్వారా వివరాలు తెలిశాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: శారీరక శ్రమకు దూరంగా.. అనారోగ్యానికి దగ్గరగా -
ఎమ్మెల్సీ కుమారుడి కబ్జాపర్వం: కేసు నమోదు
మైసూరు: బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కుమారుడు అమిత్ దేవరహట్టిపై మైసూరు విజయనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మైసూరు హినకల్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని దేవరహట్టి మద్దతుదారులతో కబ్జా చేసి, కాంపౌండ్ కట్టాడని, అడ్డుకున్న యజమాని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లు కేసు నమోదు అయింది. స్థలం యజమాని యోగీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్, పటేల్, అనూప్, వైకుంఠాచార్ తదితర 8 మందిపై కేసు నమోదు చేశారు. -
కర్నూలు జిల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మైసూరు: కర్నూలు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కర్ణాటకలోని మైసూర్లో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహమైన ఏడాదిలోనే కుటుంబ కలహాల కారణంగా ఆయన ప్రాణాలు తీసుకుని ఉంటారని స్థానిక విజయనగర పోలీసులు గురువారం తెలిపారు. వివరాలు.. * కర్నూలు నగరానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు లక్ష్మీనారాయణ (26) మైసూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే విజయనగర ప్రాంతంలో నివాసముంటున్నారు. ఏడాది కిందట అరుణ అనే యువతిని వివాహం చేసుకున్నారు. అయితే, కొద్ది రోజుల్లోనే వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. దీంతో అరుణ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. * ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ ఫోన్లోనే ఘర్షణ పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో అరుణ మరోసారి లక్ష్మీనారాయణకు ఫోన్ చేసింది. అయితే, ఆయన లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో యజమాని పైఅంతస్తుకు వెళ్లి చూశారు. అయితే, అప్పటికే లక్ష్మీనారాయణ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. * సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృత దేహంతోపాటు తెలుగులో రాసివున్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.