కర్నూలు జిల్లా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య | Kurnool Software Engineer Commit Suicide in Mysore | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Published Fri, Jan 31 2014 12:06 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

కర్నూలు జిల్లా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య - Sakshi

కర్నూలు జిల్లా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

మైసూరు: కర్నూలు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కర్ణాటకలోని మైసూర్‌లో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహమైన ఏడాదిలోనే కుటుంబ కలహాల కారణంగా ఆయన ప్రాణాలు తీసుకుని ఉంటారని స్థానిక విజయనగర పోలీసులు గురువారం తెలిపారు. వివరాలు..

* కర్నూలు నగరానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు లక్ష్మీనారాయణ (26) మైసూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే విజయనగర ప్రాంతంలో నివాసముంటున్నారు. ఏడాది కిందట అరుణ అనే యువతిని వివాహం చేసుకున్నారు. అయితే, కొద్ది రోజుల్లోనే వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. దీంతో అరుణ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.

* ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ ఫోన్‌లోనే ఘర్షణ పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో అరుణ మరోసారి లక్ష్మీనారాయణకు ఫోన్ చేసింది. అయితే, ఆయన లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో యజమాని పైఅంతస్తుకు వెళ్లి చూశారు. అయితే, అప్పటికే లక్ష్మీనారాయణ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

* సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృత దేహంతోపాటు తెలుగులో రాసివున్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం  చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement