
ప్రతికాత్మక చిత్రం
సాక్షి, పెండ్లిమర్రి: మండలంలోని యాదవాపురం గ్రామానికి చెందిన మల్లమ్మ(50), లక్షుమయ్య(22) పిట్టల ఎరువు కొసం గుహలోకి వెళ్లి ఊపిరాడక మంగళవారం మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవాపురం గ్రామంలో ఉన్న యానాదులు మల్లమ్మ, లక్షుమయ్య పెద్దదాసరిపల్లె గ్రామ పొలాల్లోని బోడబండ గుట్టలల్లో ఉన్న గుహలోకి వెళ్లారు.ఎంతసేపటికి వీరు రాకపోడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి కావడంతో మృతదేహాలను వెలికి తీయలేదు.
Comments
Please login to add a commentAdd a comment