
సాక్షి, ఒంగోలు: ఏం జరిగిందో తెలియదుగానీ తల్లి, కొడుకు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సమాచారం శనివారం వేకువ జామున 3 గంటల సమయంలో రైల్వే పోలీసులకు అందింది. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానిక ఒంగోలు రైల్వే ఫ్లయి ఓవర్ బ్రిడ్జి నుంచి 300 మీటర్ల దూరంలో పోతురాజు కాలువకు సమీపంలో వెలుగు చూసింది. మృతుల వద్ద ఎటువంటి ఆధారాలూ లభించలేదు. తల్లి తలకింద చేతులు పెట్టుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించడంతో చూపరులను కలచి వేస్తోంది.
శరీరంలో సగభాగం నుజ్జునుజ్జుగా కాగా కుమారుని కాలు తెగిపోయింది. మృతురాలికి సుమారు 30 ఏళ్లు ఉంటాయి. కుమారుడికి ఆరేళ్లు ఉంటాయని అంచనా. మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించిన అనంతరం రైల్వే పోలీసులు ఆ ఫొటోలతో నగరంలోని పలు ప్రాంతాల్లో విచారించినా ఎటువంటి సమాచారం లభించలేదు. మృతులు ఎవరైంది తెలిస్తేగానీ వారి ఆత్మహత్యకు కారణాలు వెలుగు చూసే అవకాశం లేదని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment