తల్లి, కొడుకుపై కత్తితో దుండగుల దాడి | mother and son injured in a knife attack in prakasam district | Sakshi
Sakshi News home page

తల్లి, కొడుకుపై కత్తితో దుండగుల దాడి

Published Sat, Oct 31 2015 7:59 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

mother and son injured in a knife attack in prakasam district

అద్దంకి(ప్రకాశం): నగలు దోచుకునే ప్రయత్నాన్ని అడ్డుకున్న తల్లి, కొడుకుపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ నాలుగో లైనులో జొన్నలగడ్డ భారతి తన కుమారుడు అయ్యప్ప(15)తో కలసి నివాసం ఉంటోంది. శుక్రవారం రాత్రి ఆ ఇంట్లోకి ఓ దుండగుడు ప్రవేశించి నిద్రిస్తున్న భారతి మెడలోని బంగారు గొలుసును లాగేసుకునేందుకు ప్రయత్నించాడు.

అప్రమత్తమైన భారతి ప్రతిఘటించి కేకలు వేయటంతో అయ్యప్ప దుండగుడిని అడ్డుకున్నాడు. అయితే, ఆగంతకుడు తన వద్దనున్న కత్తితో అయ్యప్పను, భారతిని గాయపరిచి ఆమె మెడలోని గొలుసును తెంపుకొని పారిపోయాడు. క్షతగాత్రులను అద్దంకి ఆస్పత్రికి తరలించారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement