
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితాలు ఇస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ ఫలితంగా నాలుగేళ్ల తర్వాత తల్లి చెంతకు కొడుకు చేరనున్నాడు. 2016లో ఇంటి నుంచి పారిపోయి విజయవాడ చేరిన బాలుడు బొబ్బా శ్రీనివాస్‌ను పోలీసులు సంరక్షించి చైల్డ్ హోమ్‌కు తరలించారు.హోమ్ నిర్వాహకులు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. శ్రీనివాస్ నాలుగో తరగతి చదువుతున్నాడు. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బాలుడి తల్లిని ఆపరేషన్ ముస్కాన్ బృందం ట్రేస్ చేసింది. తల్లితో వీడియో కాల్‌లో మాట్లాడించారు. నాలుగేళ్ళ తర్వాత బిడ్డ ఆచూకీ తెలియడంతో తల్లి శ్రీలత ఉద్వేగానికి గురై ఆనందబాష్పాలు కార్చింది. దూరమైన కుమారుడిని చెంతకు చేర్చిన పోలీసులకు , చైల్డ్ హోమ్ నిర్వాహకులకు తల్లి కృతఙ్ఞతలు తెలిపింది.
(ఆపరేషన్ ముస్కాన్‌తో స్వేచ్ఛ దొరికింది)