Operation Muskan
-
ఆపరేషన్ ముస్కాన్‌కు సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులు, వెట్టిచాకిరీ, యాచన చేసే చిన్నారులు, అదృశ్యమైన బాలలను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట జూలై 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కూడిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిబ్బందితోపాటు కార్మికశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ, పాఠశాల విద్య, ప్రజారోగ్య, లీగల్ సరీ్వస్ అథారిటీతోపాటు ఎన్జీవోలు ఈ స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటాయి. మొత్తం 120 సబ్ డివిజనల్ కమిటీలు ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఈనెల 31 వరకు కొనసాగించనున్నాయి. నెలపాటు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌కు సంబంధించి సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో అన్ని భాగస్వామ్య విభాగాల అధికారులు పాల్గొని క్షేత్ర స్థాయి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న దర్పణ్ పరిజ్ఞానాన్ని సైతం ఈ డ్రైవ్‌లో అధికారులు వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో గుర్తించే చిన్నారుల వివరాలు నమోదు చేయడంతోపాటు అదృశ్యమైన చిన్నారుల కేసుల గణాంకాలను సరిపోల్చి చూస్తారు. ఇలా చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అదృశ్యమైన చిన్నారుల కేసులు సైతం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. -
210 మంది చిన్నారులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులుగా మారిన చిన్నారులను కనిపెట్టేందుకు జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్–9 స్పెషల్ డ్రైవ్ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, ఖార్ఖానాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో మొత్తం 210 మంది చిన్నారుల జాడను అధికారులు గుర్తించారు. వీరిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 125 మంది, వికారాబాద్‌లో 14, ఆదిలాబాద్‌లో 12, నిజామాబాద్‌లో 8, వరంగల్‌లో 11, నల్లగొండలో 9, నారాయణపేట్‌లో 8 మంది, భూపాలపల్లిలో ఏడుగురు, కామారెడ్డిలో ఇద్దరు, మహబూబాబాద్‌లో ఇద్దరు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు, మెదక్‌లో నలుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురు, ఆసిఫాబాద్‌లో ఇద్దరు చొప్పున చిన్నారుల జాడను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఏటా జూలైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమం, ఆరోగ్య, వైద్య, కార్మిక, రెవెన్యూ శాఖల నుంచి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. -
జువైనల్ హోం నుంచి 10 మంది బాలలు పరార్..!
హైదరాబాద్: సైదాబాద్ జువైనల్ హోం నుంచి 10 మంది బాలలు పరారయ్యారు. వెంటపడి నలుగురు బాలలను జువైనల్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. మరో ఆరుగురు బాలల తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న బాలల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తప్పించుకున్న వారంతా ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసులు రక్షించిన బాల కార్మికులని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులకు సైదాబాద్ బాలుర గృహం ఫిర్యాదు చేయలేదని సమాచారం. -
పెద్దయ్యాక సీఎం అవుతా..
సాక్షి, తిరుపతి: వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ఓ బాలిక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో సీఎంను అవుతానని పోలీసులతో చెప్పింది. తిరుపతి అర్బన్ పోలీసులు బుధవారం ఏఆర్ పరేడ్ పోలీస్ గ్రౌండ్లో అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మూడో తరగతి చదువుతున్న అలకనంద(7) అనే బాలిక తల్లిదండ్రులు 8 నెలల కిందట హైదరాబాద్ నుంచి తిరుపతికి వలస వచ్చి బియ్యం వ్యాపారి వద్ద కూలి పనులు చేసుకుంటూ బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా ఈ పాప కూడా పనిచేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. దాంతో అర్బన్ ఎస్పీ ఆ పాపను విచారిస్తూ పెద్దయ్యాక ఏం చేస్తావ్? అని అడిగితే ఆ చిన్నారి పైవిధంగా సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు చిన్నారి బదిలిస్తూ.. హైదరాబాద్‌లో చదువుకుంటే తమకు అమ్మ ఒడి రాదంది. ఏపీలో తన లాంటి చిన్నారులను ప్రోత్సహించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది. -
వీధిబాలల గుర్తింపులో వినూత్న మలుపు
ప్రభుత్వం దృష్టికి వస్తున్న సమస్యకు వెనువెంటనే పరిష్కారం వెతకడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న కొత్తధోరణి. ఎప్పటి మాదిరి గానే ఈ ఏడాది ఇది జరిగినా ఈసారి అది ఒక సరికొత్త సంస్కరణకు దారితీసింది. అక్టోబర్ 21 పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో నాలుగు రోజులపాటు నిర్వహించిన ‘మిస్సింగ్’ పిల్లల గాలింపు చర్యల్లో 16,400 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లల్ని ‘వీధి బాలలు’గా గుర్తించి రక్షణ కల్పించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఈ పిల్లల్లో పెద్ద సంఖ్యలో బాలికలు కూడా ఉన్నారు. వీరంతా మన రాష్ట్రంలో పలు పరిశ్రమలు, రెస్టారెంట్లలోనూ, వ్యవసాయ పనులలోనూ, మరికొందరు బిక్షాటనలోనూ ఎటువంటి భద్రతలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో నిర్వహించిన ఆరవ ‘డ్రైవ్’లో 4,800 మంది పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామనీ, అయితే ఈ ఏడవ ‘డ్రైవ్’లో 16,400 మంది దొరకడం అంటే, ఇది దేశంలోనే పెద్ద సంఖ్య అనీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ అంటున్నారు. ఈ పరిణామం మూలాల కోసం ఇక్కణ్ణించి మనం ఆరేడు నెలలు వెనక్కి వెళ్లి చూసినప్పుడు, అప్పటికి మన దేశం ‘కోవిడ్ కారణంగా ‘లాక్డౌన్’లో వుంది. ఏప్రిల్–మే నాటికి వలస కార్మికుల దుస్థితి, పరిష్కారానికి అలవికాని స్థాయికి చేరింది. ఈ దశలో అందరూ కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూసినప్పటికీ, ‘అస్సలు వాళ్ళంతా ఏ రాష్ట్రాల వారు, వాళ్ళు ఎక్కడికి వలస వెళ్లి ఏమి పనిచేస్తున్నారు వంటి గణాంకాలు ఏవీ తమ వద్ద లేవు’ అని ప్రభుత్వం పార్లమెంట్‌లోనే తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. అయితే పనిస్థలం నుంచి స్వస్థలాలకు తిరుగు ప్రయాణానికి ఇటు దక్షిణ రాష్ట్రాలకు అటు సెంట్రల్ ఇండియాకు భౌగోళికంగా మధ్యన వున్న ఏపీ.. వలస కార్మికులకు ఒక ‘వారధి’గా నిలి చింది. విజయవాడ జంక్షన్ అందుకు సాక్షి కావడమే కాదు, అది అన్నార్తులైన బాటసారులను అక్కున చేర్చుకున్న– ‘అమ్మఒడి’ అయింది. అయితే ఇది జరిగిన ఆరు నెలలలోనే మళ్ళీ అవే రాష్ట్రాలకు చెందిన బాలలు పెద్ద సంఖ్యలో ఇక్కడ బతుకుదెరువు వెతుకులాటలో, అమానవీయ పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగం నిఘా దృష్టికి రావడం, ఇప్పుడు లోతైన అధ్యయనం అవసరమైన అంశం అవుతున్నది. ఐతే గడచిన 3 దశాబ్దాల్లో ఇక్కడ సామాజిక శాస్త్రాల చదువులు అటకెక్కడం కూడా మనం మర్చిపోకూడదు. కరోనా వైరస్ సమస్య ‘ఎపిడమిక్’ స్థాయికి చేరాక, మొదట ఈ పిల్లల తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలకు ఆంధ్రప్రదేశ్ మజిలీ స్థావరం కావడానికి, దీని భౌగోళిక ‘ప్రాధాన్యతా స్థానం’ ఒక్కటే కాకుండా, ఇతర కారణాలూ ఉన్నాయి. 1. తూర్పు కనుమలలో ఈ రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా వర్గీకరించడం 2. ఈ బాలలు పెద్ద ఎత్తున ఖనిజ వనరుల తవ్వకాలు జరుగుతున్న రాష్ట్రాలకు చెందినవారు కావడం 3. ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఇంకా కొందరికి ప్రభుత్వ రికార్డుల్లో చోటు లేక సహాయం అందకపోవడం 4. స్థానిక సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఈ కుటుంబాలకు ఉపాధి భద్రత లేకపోవడం 5. ఆంధ్రప్రదేశ్‌లో వేతనాలు ఎలా ఉన్నప్పటికీ ఉపాధి, స్పందించే పౌర సమాజం, జీవన భద్రతకు మెరుగైన పోలీసింగ్ ఇక్కడ ఉండడం వంటివి కొన్ని స్థూలంగా కనిపిస్తున్నాయి. లోతుల్లోకి వెళితే తెలియనివి ఎన్నో ఉండొచ్చు. అయితే, అందుబాటులో ఇంత పెద్ద సంఖ్యలో వీధి బాలలు ఉంటే, రేపు వీరి నిస్సహాయతను ‘క్యాష్’ చేసుకునేవారికి వీరు చౌకైన కూలీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్నప్పుడు, హిందీ భాష మాట్లాడగలిగిన ఈ పిల్లల్ని మున్ముందు ఇక్కడి చీకటి శక్తులు అసాంఘిక చర్యలకు వాడుకోవడం తేలిక. ప్రతిపాదిత పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తర్వాత కోస్తాంధ్రలో రూపుతీసుకునే నేరమయ సామాజిక ముఖచిత్రం పట్ల, మన ముందస్తు అప్రమత్తత అవసరాన్ని ఈ ‘2020 ఆపరేషన్ ముస్కాన్’ వెలుగులోకి తెచ్చింది. ఈ దశలో సీఎం చొరవతో ప్రభుత్వం రాష్ట్రంలో ‘జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) 2015’ చట్టం అమలుకు ఉపక్రమించింది. ఈ చట్టంలోని సెక్షన్ 107 ప్రకారం, ప్రతి పోలీస్ స్టేషన్లో ‘చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్’ పోస్ట్ ఉండాలి. వీరు స్టేషన్లో విధుల్లో ఉన్నప్పుడు గులాబీ రంగు ‘టీ–షర్టు’తో ఉంటారు. ఇందులో భాగంగా ముందుగా కృష్ణాజిల్లాలో ఐదు ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేష న్లను ప్రత్యేకంగా రూపొందించారు. సమస్య మూలాల్లోకి చూసినప్పుడు, భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ఆర్ – ఆర్ – 2013 ప్యాకేజీ’ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలోనే తయారైంది. అది రూపొందించిన ‘సామాజిక ప్రభావిత అంచనా’ ప్రమాణాలు దక్షిణ ఆసియాలోనే అత్యంత సమగ్రమైనవిగా ప్రపంచ బ్యాంక్ గుర్తించింది. అటువంటప్పుడు, దానిపట్ల ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ స్పృహ ఉంటుందనీ, ఉండాలనీ మనం ఆశిస్తాం. పోలవరం ఆదివాసీ నిర్వాసితుల పునరావాసం విషయంలో ఈ చట్టం స్ఫూర్తిని నిజాయితీతో మనం అమలు చేయాలి. అటువంటిదే, నల్లమల అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కూడా. అటువంటి సున్నిత స్పృహ కనుక లేకపోతే జరిగేది ఏమిటో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల అసంపూర్ణ పునరావాస చర్యలు నుంచి తెలుసుకోవడం అవసరం. పాతికేళ్ళ క్రితం నల్లగొండ జిల్లా దేవరకొండ మండల గ్రామాల్లోని సుగాలీ తండాల్లో తల్లులు జీవిక కోసం తమ ఆడశిశువుల్ని అమ్ముకొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కలెక్టర్ శ్రీమతి నీలం సాహ్నీ (1996–99) చొరవతో, సమస్య మూలాల్లోకి వెళితే, డొంక కదిలి చివరికి వెలుగులోకి వచ్చిన విషయం– వాళ్ళంతా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు అని! అయితే, ‘కోవిడ్–19’ తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ మీదుగా తమ స్వస్థలాలకు వెళుతున్న వలసకార్మికుల విషయంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అనుసరించిన మానవీయ ధోరణితోపాటు, పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శ్రీమతి నీలం సాహ్నీ ఉండడం కేవలం యాదృచ్ఛికమే! వ్యాసకర్త: జాన్సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత ఈ–మెయిల్ : johnson.choragudi@gmail.com -
సీఐడీకి రెండు స్కోచ్ జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి రెండు స్కోచ్ జాతీయ అవార్డులు వచ్చినట్టు అడిషనల్ డీజీ, ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ చెప్పారు. సీఐడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19, ఈ–నిర్దేశ కార్యక్రమాలకు రజత పతకాలు వచ్చినట్టు శనివారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► జాతీయ స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక వినియోగం, అత్యుత్తమ నూతన ఆవిష్కరణలకు ఏటా స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను అందజేస్తుంది. ► ఈ ఏడాది దేశ వ్యాప్తంగా టెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు 84 అవార్డులు అందజేయగా అందులో 48 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకు దక్కడం గర్వకారణం. ► ఏపీ పోలీస్ విభాగంలో వచ్చిన అవార్డుల్లో ఏపీ సీఐడీకి రెండు జాతీయ రజత పతకాలు రావడం విశేషం. జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమంలో సీఐడీ తరఫున రెండు రజత పతకాలు అందుకున్నాం. ► సీఐడీ విభాగం అధ్వర్యంలో రూపొందించిన ఈ–నిర్దేశ, ఆపరేషన్ ముస్కాన్–కోవిడ్ 19 ప్రాజెక్టులకు రజత పతకాలు గెలుపొందగా ఏపీ సీఐడీ ‘ఫర్ ఎస్ ఫర్ యూ’, ఈ–రక్షాబంధన్’ కార్యక్రమాలు స్కోచ్ ఆర్డర్ అఫ్ మెరిట్లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. ► శాంతి భద్రతల పరిరక్షణలో, కేసుల ఛేదింపు, వివిధ పోలీసింగ్ విధుల్లో టెక్నాలజీ వినియోగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ► వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు తోడు సైబర్ నేరాలు అదే స్థాయిలో సవాల్‌గా మారాయి. సైబర్ నేరాలను అదుపు చేయాలంటే అత్యున్నత స్థాయిలో మన టెక్నాలజీ వినియోగం, రూపకల్పనలు ఉండాలి. అటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న సీఐడీ విభాగం ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులను గెలుచుకోగలిగింది. ► సీఐడీని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. -
బాలమిత్ర పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తాం
సాక్షి, విజయవాడ: జువైనల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననుండగా.. డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెబినార్ ద్వారా పాల్గొన్నారు. పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి గల కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేదానిపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. వీధి బాలలను రక్షించడం పోలీసుల విధి నిర్వహణలో భాగం అని స్పష్టం చేశారు గౌతమ్ సవాంగ్. (చదవండి: ఆ దాడి చేసింది టీడీపీ కార్యకర్తే) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అనేక మంది చిన్నారులకు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలమిత్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సెమినార్లో అనేక అంశాలు చర్చించాము. చర్చించిన ప్రతి అంశాన్ని పరిష్కారం అయే విధంగా చర్యలు తీసుకుంటాం అని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. -
‘ముస్కాన్ పనితీరుకు సీఎం జగన్ ప్రశంస’
సాక్షి, విజయవాడ: ఆపరేష్ ముస్కాన్ కోవిడ్-19 ఫేజ్ 6వ విడత ముగింపు కార్యక్రమం మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ‘గత ఐదు విడతల్లో జరిగిన ముస్కాన్ ఒక ఎత్తు. ఈ సారి జరిగిన ముస్కాన్ ఇంకో ఎత్తు. వారం రోజులు జరిగిన ముస్కాన్ కోవిడ్-19 ఎంతో సక్సెస్స్ సాధించింది. ఆపరేషన్ ముస్కాన్ బృందం పనితీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. వేలాదిమంది పిల్లలను రక్షించటం ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. ఆపరేషన్ ముస్కాన్‌తో నాలుగేళ్ళ తర్వాత తల్లి దగ్గరకి కొడుకును చేర్చాము. కరోనా టెస్టుల ద్వారా చాలా మందిని కోవిడ్ నుంచి కాపాడగలిగాము. ఆపరేషన్ ముస్కాన్‌ను చాలెంజ్‌గా తీసుకొని పనిచేసిన సీఐడీకి అభినందనలు’ అన్నారు. టెలికాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాలో రెస్క్యూ చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. అంతేకాక సమన్వయంతో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించిన ముస్కాన్ బృందాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం 4806 మందిని కాపాడామని తెలిపారు. బాల కార్మికులుగా ఉన్న 278 మంది పిల్లలను రక్షించామన్నారు. పట్టుబడ్డవారిలో 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. చిరునామా ఉన్న 4,703 మంది వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
4,806 మంది వీధి బాలల సంరక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19’ సోమవారంతో ముగిసింది. వారం రోజులపాటు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో 4,806 మంది వీధి బాలలను సంరక్షించారు. వారిలో 1,121 మంది బాలలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ► ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా మొత్తంగా 4,806 మందిని సంరక్షించారు. వారిలో 4,075 మంది బాలురు, 731 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 72 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు. ► మొత్తం 4,703 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మరో 103 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ► 1,121 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి.. అందరికీ కోవిడ్ కిట్ (శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు) అందజేశారు. ► చట్టాలను అతిక్రమించి వీధి బాలలతో పనులు చేయిస్తున్న వారిపై 22 కేసులు నమోదు చేశారు. ఏడుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. -
విజయవాడలో ఆపరేషన్ ముస్కాన్
-
ఆపరేషన్ ముష్కాన్‌తో తల్లి చెంతకు బిడ్డ
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితాలు ఇస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ ఫలితంగా నాలుగేళ్ల తర్వాత తల్లి చెంతకు కొడుకు చేరనున్నాడు. 2016లో ఇంటి నుంచి పారిపోయి విజయవాడ చేరిన బాలుడు బొబ్బా శ్రీనివాస్‌ను పోలీసులు సంరక్షించి చైల్డ్ హోమ్‌కు తరలించారు.హోమ్ నిర్వాహకులు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. శ్రీనివాస్ నాలుగో తరగతి చదువుతున్నాడు. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బాలుడి తల్లిని ఆపరేషన్ ముస్కాన్ బృందం ట్రేస్ చేసింది. తల్లితో వీడియో కాల్లో మాట్లాడించారు. నాలుగేళ్ళ తర్వాత బిడ్డ ఆచూకీ తెలియడంతో తల్లి శ్రీలత ఉద్వేగానికి గురై ఆనందబాష్పాలు కార్చింది. దూరమైన కుమారుడిని చెంతకు చేర్చిన పోలీసులకు , చైల్డ్ హోమ్ నిర్వాహకులకు తల్లి కృతఙ్ఞతలు తెలిపింది. (ఆపరేషన్ ముస్కాన్‌తో స్వేచ్ఛ దొరికింది) -
ఆపరేషన్ ముస్కాన్‌లో 3,636 మంది బాలల గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు శనివారం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి 3,636 మంది బాలబాలికలను రక్షించారు. వీరిలో బాలురు 3,039 మంది, బాలికలు 597 మంది ఉన్నారు. రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు రెండురోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం ఈ ఆపరేషన్‌లో పోలీసులతోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, క్రీడా శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కమిటీలు కూడా భాగస్వాములయ్యాయి. ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జనసామర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను తనిఖీ చేసి చిన్నారులను గుర్తించాయి. ఆపరేషన్ ముస్కాన్ అంటే.. తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చినవారు మరికొందరు అనాథల్లా జీవితం గడుపుతుంటారు. ఇలాంటివారిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో బహిరంగ ప్రదేశాల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాన్నే ఆపరేషన్ ముస్కాన్ అంటారు. ఆపరేషన్ ముస్కాన్ ఇలా.. - ఈ కార్యక్రమం కోసం ప్రతి సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ఒక మహిళ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టారు. - బృంద సభ్యులు పోలీస్ యూనిఫాం ధరించకుండా సివిల్ డ్రస్‌లో ఉంటారు. - తనిఖీల సందర్భంగా గుర్తించిన పిల్లల ఫొటోలతో కూడిన సమాచారాన్ని చైల్డ్ ట్రాక్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. - గుర్తించిన పిల్లలను 24 గంటల్లోపు ఆయా జిల్లాల్లోని శిశు సంరక్షణ కమిటీలకు అప్పగిస్తారు. - సరైన చిరునామా లభించని పిల్లలను షెల్టర్ హోమ్‌లలో ఉంచుతారు. - హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో బాల కార్మికులు దొరికినట్లైతే యజమానులపై బాలకార్మిక నిషేధ చట్టం, వెట్టిచాకిరి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. -
245 మంది చిన్నారుల గుర్తింపు!
సాక్షి, కృష్ణాజిల్లా: బడి వయసు పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఎస్పీ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్లు, దుకాణాలల్లో మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించామని, వారిలో 183 మంది బాలురు, 62 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని పాపను గుర్తించి.. ఆ చిన్నారిని తిరిగి బడికి వెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మైలవరం సర్కిల్ పరిధిలో బడి బయట ఉన్న 29 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు స్టేషన్లో కౌన్సిలింగ్ ఇప్పించి పంపించినట్లు ఆయన తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ : డీజీపీ
సాక్షి, అమరావతి : బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకోసం అన్ని జిల్లాల మహిళా శిశు సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖ, న్యాయ సేవా సంస్థ, చైల్డ్‌లైన్ ఎన్జీవోల సమన్వయంతో ఈ దాడులు చేసినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 794 బృందాలతో తనిఖీలు కొనసాగాయన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సినిమా హాల్స్ బయట, పార్కుల్లో ...అనాధ బాలలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాల, బాలికలను గుర్తించామని డీజీపీ తెలిపారు. చిరునామా ఉన్నవారిని తల్లిదండ్రులకు, చిరునామా లేనివారిని సీడబ్ల్యూసీకి అప్పచెప్పడం జరిగిందన్నారు. ఆపరేషన్ ముస్కాన్ రెస్క్యూలో పట్టుబడిన చిన్నారులను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చుతామన్నారు. ఈ దాడుల్లో 2378మంది బాలురు, 396మంది బాలికలు మొత్తం 2774 మంది దొరికినట్లు డీజీపీ తెలిపారు. అలాగే బాలకార్మికులు, మిస్సింగ్, వీధి బాలలు, డ్రాప్ అవుట్స్, బిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి వారికి పునరావాసం కల్పించనున్నట్లు చెప్పారు. -
ఆపరేషన్ ముస్కాన్‌తో స్వేచ్ఛ దొరికింది
సాక్షి, నెల్లూరు: అక్షరాలు నేర్చుకుంటూ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన కొందరు బాలలు చీకట్లో మగ్గిపోతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం పోలీసు అధికారులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, క్వారీలు, ఇటుకబట్టీలు, హోటల్స్, ధాబాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలో 25 మంది, నెల్లూరు రూరల్‌లో ఇద్దరు, గూడూరు పరిధిలో 53 మంది, కావలిలో ఇద్దరు, ఆత్మకూరు పరిధిలో 69 మంది, నెల్లూరు మహిళా పోలీసుస్టేషన్ పరిధిలో 11 మంది ఇలా జిల్లా వ్యాప్తంగా 162 మంది బాలకార్మికులను గుర్తించారు. అనంతరం వారిని విచారించారు. వీరిలో 136 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన 26 మంది వివరాలు లభ్యం కాకపోవడంతో వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు అప్పగించారు. నగరంలోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఆపరేషన్ ముస్కాన్‌పై నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి విలేకరులతో మాట్లాడారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనులకు పంపడం, వారిచేత పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. నగరంలో 25 మంది బాలకార్మికులను గుర్తించామని, పిల్లలను పనిలో పెట్టుకున్న 17 మంది యజమానులపై కార్మిక శాఖ వారి సహకారంతో కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో చిన్నబజారు, దర్గామిట్ట, వేదాయపాళెం, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్లు మధుబాబు, ఎం.నాగేశ్వరమ్మ, టీవీ సుబ్బారావు, వైవీ సోమయ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ సురేఖ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గణేష్, జేజేబీ సభ్యులు జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ ముస్కాన్: 18 రోజుల్లో 300 మంది..
సాక్షి సైబరాబాద్: ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో 18 రోజుల్లో 300 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించారు. 169 మంది పిల్లలను ఇతర రాష్ర్టాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో 267 మంది బాలురు, 33 బాలికలు ఉన్నారు. ఈ పిల్లలు నగరంలో వివిద వృత్తులలో పనిచేస్తుండగా, అడుక్కునేవారు 29మంది.. చైల్డ్ లేబర్లు 222మంది ఉన్నారు. మరో 22 మందిని వీధి బాలలుగా పోలీసులు గుర్తించారు. సంరక్షించబడిన పిల్లలని పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలతో పనులు చేయిస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంతవరకు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 137 పైగా కేసులు నమోదయ్యాయి. -
‘ముస్కాన్–5’ షురూ..
సాక్షి,సిటీ బ్యూరో: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గత ఐదేళ్లుగా ఏటా రెండు విడుతలుగా బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలో ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. బాలకార్మికులు, మిస్సింగ్, వీధి బాలలు, డ్రాప్ అవుట్స్, బిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి వారికి పునరావాసం కల్పించనున్నారు. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖ, న్యాయ సేవా సంస్థ, చైల్డ్‌లైన్ ఎన్జీవోల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జూలై ఒకటి నుంచి 31 వరకు చేపట్టే ఈ కార్యక్రమంలో మొదటి వారం తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు, రెండో వారంలో వీ«ధి బాలల గుర్తింపు, మూడో బాలకార్మికుల గుర్తింపు, నాల్గో వారం బిక్షాటన చేసే బాలలను గుర్తించనున్నారు. ఇందు కోసం ఆయా శాఖల అధికారులతో 17 బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు పరిశ్రమలు, కర్మాగారాలు, హోటళ్లపై అకస్మిక దాడులు నిర్వహించి అందులో పనిచేస్తున్న బాలకార్మికులను విముక్తి కల్పించనున్నారు. వీధి బాలలు, బిక్షాటన చేసేవారిని గుర్తించి స్వస్థలాలకు పంపడంతోపాటు పునరావాస చర్యలు చేపడుతున్నారు. నగరంలో 50 వేలకు పైగాబాలకార్మికులు నగరంలో సుమారు 50 వేలకు పైగా బాలకార్మికుల ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద రెండు వేల మందిని గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందులో సగానికి పైగా బాల, బాలికలకు పునరావాసం కల్పించారు. గత ఐదేళ్లుగా ఏటా స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన స్థానికులకు పునరావాస కల్పన, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని స్వస్థలాలకు పంపిస్తున్నారు. మరికొందరిని స్కూళ్లలో చేర్పించారు. మిగితా వారిని స్టేట్ హోంకు అప్పగించారు. పూర్తి స్థాయి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కసరత్తు చేసుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాలకార్మికులందరికీ విముక్తి వివిధ సంస్థలు, షాపుల్లో చట్టవ్యతిరేకంగా పని చేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఆపరేషన్ ముస్కాన్ రెస్క్యూలో ప్రత్యేక బృందాలు పాల్గొంటాయి. పట్టుబడిన చిన్నారులకు చదువుపై ఆసక్తి ఉంటే పాఠశాల్లో చేర్పిస్తాం. పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరం. మహ్మద్ ఇంతియాజ్ , జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి. హైదరాబాద్. -
విజయవాడలో ఆపరేషన్ ముస్కాన్
విజయవాడ: నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, అనాథలకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, వాణిజ్య సదుపాయాలు, పార్కులు, రహదారులు, పారిశ్రామిక వాడల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు పలువురు చిన్నారులను అదుపులోకి తీసుకొని వారిని చైల్డ్ హోమ్‌కు తరలించారు. -
ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్!
ఇందూరు: బాల కార్మికులను పని నుంచి విముక్తి కల్పించడం.. బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం.. అనాథ పిల్లలకు వసతి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ జిల్లాలో విజయవంతమైంది. జూలై 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కొనసాగిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో చాలా మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తిని కల్పించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం స్థానంలో ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బందితోపాటు పోలీసు, కార్మిక శాఖ అధికారులు పాలు పంచుకున్నారు. ఈ మూడు శాఖల సమన్వయంతో నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్లవారీగా నలుగురు సభ్యులు కలిగిన నాలుగు బృందాలు ప్రత్యేక వాహనంలో నెల రోజులపాటు సంచరించారు. ఫ్యాక్టరీలు, వ్యాపార సముదాయాలు, రైల్వే, బస్టాండ్ ప్రాంతాల్లో 93 మంది పిల్లలను పట్టుకున్నారు. ఇందులో బాల కార్మికులు 62, వీధిబాలలు ఒక్కరు, భిక్షాటన చేస్తున్నవారు 13 మంది పిల్లలున్నారు. వ్యాపారులపై కేసు జూవైన్ జస్టిస్ చట్టం ప్రకారం పిల్లలతో పని చేయించడం, పనిలో పెట్టుకోవడం నేరం కిందకు వస్తుంది. బాలలతో పని చేయిస్తున్న ఏడుగురు వ్యాపారులకు ఫైన్ వేయడంతోపాటు కేసులు నమోదు చేశారు. వ్యాపారస్తులతో రూ.5,000 నుంచి రూ.20,000 వరకు పిల్లల పేరిట బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే వారికి 18 ఏళ్లు నిండిన తరువాత పైచదువులకు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. బాలలను తీసుకెళ్లి వారి తల్లి దండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి బడిలో చేర్పించారు. అలాగే భిక్షాటన, చెత్త కాగితాలు సేకరిస్తున్న పిల్లలను వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలల్లో చేర్పించారు. అనాథ పిల్లలను స్వచ్ఛంద సంస్థల్లో చేర్పించి నివాసంతోపాటు, విద్యను అందిస్తున్నారు. నెల రోజులపాటు కొనసాగిన డ్రైవ్ విజయవంతగా ముగియడంతో బృందాల సభ్యులకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ప్రసంశలు కురిపించారు. నిరంతరం చేస్తే ఎంతో మేలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ఏడాదితో రెండు పర్యాయాలు నిర్వహించాలి. అయితే ఈ కార్యక్రమాన్ని రెండుసార్లు మాత్రమే కాకుండా నిరంతరంగా కొనసాగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం నాలుగు దఫాలుగా నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ చేపడితే పాఠశాలల్లో పిల్లల డ్రాపౌట్ తగ్గడానికి వీలుందడని, బడిలో చేర్పించిన పిల్లలు మళ్లీ బడికి వెళ్తున్నారో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ శారదను అడుగగా.. బాల కార్మికులను వ్యాపారస్తులు పనిలో పెట్టుకోవడం చట్ట ప్రకారం నేరం. కేసుల నమోదు, భారీ జరిమానాలు ఉంటాయి. కావున వ్యాపారస్తులు బాలలను పనిలో పెట్టుకోవద్దు. వారిని చదివించడానికి కృషి చేయాలని తెలిపారు. -
నిండైన చిరునవ్వుకు!
‘స్మైల్’ స్థానంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కంకణం ఇందుకోసం రెండు ప్రత్యేక టీములు..! స్త్రీశిశు సంక్షేమశాఖ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ‘ఆపరేషన్ ముస్కాన్’ టీములు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు స్త్రీశిశు సంక్షేమ శాఖ, పోలీసుశాఖ సమన్వయంతో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లా పోలీస్‌కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కమిటీల ఏర్పాటుపై చర్చించారు.మిర్యాలగూడ టౌన్ : బాలకార్మికులను గుర్తించేందుకు గత సంవత్సరం జనవరిలో స్మైల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీములు హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించడం, పారిపోయిన, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ఏర్పాటయ్యాయి. స్మైల్ టీముల స్థానంలోనే తెలంగాణ ప్రభుత్వం ముస్త్కాన్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ఇలా.. జిల్లాలో రెండు ముస్కాన్ టీములు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒకటి, స్త్రీశిశుసంక్షేమ శాఖ పీడీ ఆధ్వర్యంలో మరొక టీము ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క టీంలో ఆ రుగురు సభ్యులు ఉంటారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీలో ఒక ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు , ఒకరు జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఉంటారు. స్త్రీశిశుసంక్షేమ శాఖ పీడీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే టీములో జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఆరుగురు ఉంటారు. రెండు రోజుల్లో టీంలను ఏర్పాటు చేస్తారు. టీముల విధులు జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై తప్పిపోయిన, పారిపోయిన పిల్లలను గుర్తించడం, పరిశ్రమలు, హోటళ్లలో పనిచేసేబాలకార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత ఈ టీములకు ఉంది. ఒక వేళ అనాథపిల్లలను గుర్తించినట్లయితే వీరిని సంక్షేమ హాస్టళ్లలో చేర్పిస్తారు. పిల్లలను గుర్తించే కార్యక్రమం ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. 233 మంది బాలబాలికలను రక్షించాం : ఎస్పీ దుగ్గల్ నల్లగొండ టూటౌన్ : ఆపరేషన్ స్మైల్ ద్వారా జిల్లాలో 233 మంది బాల బాలికలను సంరక్షించి, నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ పేర్కొన్నారు. తప్పిపోయిన, బందీలుగా ఉన్న పిల్లలను సంరక్షించాలనే ఉద్దేశంతో బుధవారం ఆయన ఆపరేషన్ స్మైల్-2 (ముస్కాన్)ను ప్రారంభించి మాట్లాడారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జిల్లాలో సబ్ డివిజనల్ వారీగా 5 పోలీసు సిబ్బందితో టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీం బృందాలు బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, ల్యాడ్జిం గ్లు, చిన్న చిన్న పరిశ్రమలలో, రహదారుల వెంట గస్తీ నిర్వహిస్తూ గతంలో తప్పిపోయిన, నిర్బంధించిన వారిని రక్షించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.గంగారాం పాల్గొన్నారు.