
సాక్షి, అమరావతి : బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకోసం అన్ని జిల్లాల మహిళా శిశు సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖ, న్యాయ సేవా సంస్థ, చైల్డ్‌లైన్ ఎన్జీవోల సమన్వయంతో ఈ దాడులు చేసినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 794 బృందాలతో తనిఖీలు కొనసాగాయన్నారు.
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సినిమా హాల్స్ బయట, పార్కుల్లో ...అనాధ బాలలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాల, బాలికలను గుర్తించామని డీజీపీ తెలిపారు. చిరునామా ఉన్నవారిని తల్లిదండ్రులకు, చిరునామా లేనివారిని సీడబ్ల్యూసీకి అప్పచెప్పడం జరిగిందన్నారు. ఆపరేషన్ ముస్కాన్ రెస్క్యూలో పట్టుబడిన చిన్నారులను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చుతామన్నారు. ఈ దాడుల్లో 2378మంది బాలురు, 396మంది బాలికలు మొత‍్తం 2774 మంది దొరికినట్లు డీజీపీ తెలిపారు. అలాగే బాలకార్మికులు, మిస్సింగ్, వీధి బాలలు, డ్రాప్ అవుట్స్, బిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి వారికి పునరావాసం కల్పించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment