సాక్షి, విజయవాడ: ఆపరేష్ ముస్కాన్ కోవిడ్-19 ఫేజ్ 6వ విడత ముగింపు కార్యక్రమం మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ‘గత ఐదు విడతల్లో జరిగిన ముస్కాన్ ఒక ఎత్తు. ఈ సారి జరిగిన ముస్కాన్ ఇంకో ఎత్తు. వారం రోజులు జరిగిన ముస్కాన్ కోవిడ్-19 ఎంతో సక్సెస్స్ సాధించింది. ఆపరేషన్ ముస్కాన్ బృందం పనితీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. వేలాదిమంది పిల్లలను రక్షించటం ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. ఆపరేషన్ ముస్కాన్‌తో నాలుగేళ్ళ తర్వాత తల్లి దగ్గరకి కొడుకును చేర్చాము. కరోనా టెస్టుల ద్వారా చాలా మందిని కోవిడ్ నుంచి కాపాడగలిగాము. ఆపరేషన్ ముస్కాన్‌ను చాలెంజ్‌గా తీసుకొని పనిచేసిన సీఐడీకి అభినందనలు’ అన్నారు. టెలికాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాలో రెస్క్యూ చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు.
అంతేకాక సమన్వయంతో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించిన ముస్కాన్ బృందాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం 4806 మందిని కాపాడామని తెలిపారు. బాల కార్మికులుగా ఉన్న 278 మంది పిల్లలను రక్షించామన్నారు. పట్టుబడ్డవారిలో 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. చిరునామా ఉన్న 4,703 మంది వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు.
నాలుగేళ్ల తర్వాత తల్లి చెంతకు కొడుకు: సవాంగ్
Published Tue, Jul 21 2020 2:17 PM | Last Updated on Tue, Jul 21 2020 5:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment