వీధి బాలలకు పరిశుభ్రత గురించి వివరిస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19’ సోమవారంతో ముగిసింది. వారం రోజులపాటు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో 4,806 మంది వీధి బాలలను సంరక్షించారు. వారిలో 1,121 మంది బాలలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
► ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా మొత్తంగా 4,806 మందిని సంరక్షించారు. వారిలో 4,075 మంది బాలురు, 731 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 72 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు.
► మొత్తం 4,703 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మరో 103 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు.
► 1,121 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి.. అందరికీ కోవిడ్ కిట్ (శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు) అందజేశారు.
► చట్టాలను అతిక్రమించి వీధి బాలలతో పనులు చేయిస్తున్న వారిపై 22 కేసులు నమోదు చేశారు. ఏడుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment