‘స్మైల్’ స్థానంలో ‘ఆపరేషన్ ముస్కాన్’
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కంకణం
ఇందుకోసం రెండు ప్రత్యేక టీములు..!
స్త్రీశిశు సంక్షేమశాఖ, పోలీసుశాఖ
ఆధ్వర్యంలో కార్యాచరణ
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ‘ఆపరేషన్ ముస్కాన్’ టీములు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు స్త్రీశిశు సంక్షేమ శాఖ, పోలీసుశాఖ సమన్వయంతో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లా పోలీస్‌కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కమిటీల ఏర్పాటుపై చర్చించారు.మిర్యాలగూడ టౌన్ : బాలకార్మికులను గుర్తించేందుకు గత సంవత్సరం జనవరిలో స్మైల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీములు హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించడం, పారిపోయిన, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ఏర్పాటయ్యాయి. స్మైల్ టీముల స్థానంలోనే తెలంగాణ ప్రభుత్వం ముస్త్కాన్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కమిటీ ఏర్పాటు ఇలా..
జిల్లాలో రెండు ముస్కాన్ టీములు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒకటి, స్త్రీశిశుసంక్షేమ శాఖ పీడీ ఆధ్వర్యంలో మరొక టీము ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క టీంలో ఆ రుగురు సభ్యులు ఉంటారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీలో ఒక ఎస్‌ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు , ఒకరు జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఉంటారు. స్త్రీశిశుసంక్షేమ శాఖ పీడీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే టీములో జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఆరుగురు ఉంటారు. రెండు రోజుల్లో టీంలను ఏర్పాటు చేస్తారు.
టీముల విధులు
జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై తప్పిపోయిన, పారిపోయిన పిల్లలను గుర్తించడం, పరిశ్రమలు, హోటళ్లలో పనిచేసేబాలకార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత ఈ టీములకు ఉంది. ఒక వేళ అనాథపిల్లలను గుర్తించినట్లయితే వీరిని సంక్షేమ హాస్టళ్లలో చేర్పిస్తారు. పిల్లలను గుర్తించే కార్యక్రమం ఈ నెల 31 వరకు కొనసాగుతుంది.
233 మంది బాలబాలికలను రక్షించాం : ఎస్పీ దుగ్గల్
నల్లగొండ టూటౌన్ : ఆపరేషన్ స్మైల్ ద్వారా జిల్లాలో 233 మంది బాల బాలికలను సంరక్షించి, నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ పేర్కొన్నారు. తప్పిపోయిన, బందీలుగా ఉన్న పిల్లలను సంరక్షించాలనే ఉద్దేశంతో బుధవారం ఆయన ఆపరేషన్ స్మైల్-2 (ముస్కాన్)ను ప్రారంభించి మాట్లాడారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జిల్లాలో సబ్ డివిజనల్ వారీగా 5 పోలీసు సిబ్బందితో టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీం బృందాలు బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, ల్యాడ్జిం గ్‌లు, చిన్న చిన్న పరిశ్రమలలో, రహదారుల వెంట గస్తీ నిర్వహిస్తూ గతంలో తప్పిపోయిన, నిర్బంధించిన వారిని రక్షించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.గంగారాం పాల్గొన్నారు.
నిండైన చిరునవ్వుకు!
Published Wed, Jul 1 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement
Advertisement