ప్రతీకాత్మక చిత్రం
సాక్షి సైబరాబాద్: ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో 18 రోజుల్లో 300 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించారు. 169 మంది పిల్లలను ఇతర రాష్ర్టాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో 267 మంది బాలురు, 33 బాలికలు ఉన్నారు. ఈ పిల్లలు నగరంలో వివిద వృత్తులలో పనిచేస్తుండగా, అడుక్కునేవారు 29మంది.. చైల్డ్ లేబర్లు 222మంది ఉన్నారు. మరో 22 మందిని వీధి బాలలుగా పోలీసులు గుర్తించారు. సంరక్షించబడిన పిల్లలని పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలతో పనులు చేయిస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంతవరకు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 137 పైగా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment