
మృతిచెందిన సహాయమేరి, సహాయరాజ్ (ఫైల్)
అన్నానగర్: తల్లి, కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం తూత్తుకుడిలో చోటుచేసుకుంది. తూత్తుకుడి జార్జ్‌రోడ్డు థామస్‌నగర్ 4వ వీధికి చెందిన సహాయనాథన్. ఇతని భార్య సహాయమేరి (47). వీరి కుమారుడు సహాయరాజ్ (27) అవివాహితుడు. సహాయనాథన్ మృతిచెందాడు. సహాయరాజ్ తూత్తుకుడి హార్బర్‌లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సహాయరాజ్ ఇంటి తలుపులు చాలాసేపైనా తెరుచుకోలేదు. అనుమానించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం మేరకు సీఐ ముత్తు, ఎస్‌ఐ వేలాయుధం, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం స్థానికుల సహాయంతో సహాయరాజ్ ఇంటి తలుపులు పగులగొట్టి పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ సహాయరాజ్, తల్లి సహాయమేరి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందడం చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వీరి ఆత్మహత్యకు కందువడ్డి వేధింపులు కారణమా అని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment