మృతులకు 8 లక్షలు ఎక్స్గ్రేషియా: టీటీడీ | Rs 8 lakh ex gratia for mother and son died in tirumala due to electrical shock | Sakshi
Sakshi News home page

మృతులకు 8 లక్షలు ఎక్స్గ్రేషియా: టీటీడీ

Published Tue, Oct 28 2014 10:48 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

మృతులకు 8 లక్షలు ఎక్స్గ్రేషియా: టీటీడీ - Sakshi

మృతులకు 8 లక్షలు ఎక్స్గ్రేషియా: టీటీడీ

తిరుపతి: తిరుమల టీబీసీ ప్రాంతంలో విద్యుత్ షాక్తో మరణించిన తల్లీకొడుకులకు టీటీడీ మంగళవారం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతులకు రూ. 8 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో ఎం.జీ.గోపాల్ మంగళవారం ప్రటించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా రామంజెర్రికి చెందిన అయిదుగురు  కుటుంబ సభ్యులు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి సోమవారం వచ్చారు. ఆ క్రమంలో మొక్కులు సమర్పించుకున్నారు.

దేవుడ్ని దర్శించుకునేందుకు ఆ కుటుంబమంతా క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే ఏడాది వయస్సు ఉన్న కుమారుడు మహేశ్ని ఎత్తుకున్న తల్లి లక్ష్మికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే విగత జీవులుగా పడి ఉన్నారు. దాంతో వారిని టీటీడీ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించారని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతులకు రూ. 8 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement