తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్‌ రావడంతో.. | Woman And Son Narrow Escape Sit Platform Wall Train Passed | Sakshi
Sakshi News home page

తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్‌ రావడంతో..

Published Thu, Dec 8 2022 12:53 PM | Last Updated on Thu, Dec 8 2022 12:59 PM

Woman And Son Narrow Escape Sit Platform Wall Train Passed - Sakshi

కర్ణాటకలోని ఓ రైల్వేస్టేషన్‌లో... త్రుటిలో  ఘోర ప్రమాదం తప్పింది. ఒ‍క తల్లి కొడుకులు ట్రైయిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో తల్లి మరో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లేందుకని.. రైల్వే ట్రాక్‌ క్రాస్‌ చేసి తొందరగా వెళ్లిపోవచ్చు అనుకుంది. అందులో భాగంగానే రైల్వే పట్టాలపైకి వచ్చింది. అంతే ఇంతలో అటువైపుగా ఒక గూడ్స్‌ రైలు వేగంగా వస్తోంది. దీన్ని గమినించిన కొడుకు వెంటనే స్పందించి...తల్లిని కాపాడుకునేందకు పట్టాలపై దిగాడు. రైల్వే ఫ్లాట్‌ ఫాంపై ఉన్న ప్రయాణికులంతా ఆ తల్లి కొడుకులు అయిపోయారనుకుని.. నిర్ఘాంతపోయి చూస్తున్నారు.

ఈ ఘటన కర్ణాటకలోని కల్బుర్డిలోని రైల్వే ఫ్లాట్‌ఫాంలో చోటు చేసుకుంది. ఐతే ఆ తల్లికొడుకులిద్దరు పట్టాలకు, ఫ్లాట్‌ఫాంకికు మధ్యలో కదలకుండా ఒకవైపుకి ఒకరినొకరు పట్టుకుని ఒరిగిపోయి కుర్చొన్నారు. పాపం వాళ్లు ట్రైయిన్‌ వెళ్లేంతవరకు అలా ఊపిరి బిగబెట్టుకుని కుర్చొన్నారు. స్టేషన్‌లో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా టెన్షన్‌గా చూస్తున్నారు. ఇంతలో ట్రైయిన్‌ వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ తల్లి కొడుకులు బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన నెట్టింట వైరల్‌ అవుతోంది. 

(చదవండి: గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్‌ చార్లెస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement