తల్లి మృతితో కుమారుడు ఆత్మహత్య
Published Thu, Feb 25 2016 11:52 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
తిరుచానూరు : కన్నతల్లి అనారోగ్యంతో మృతి చెందగా, మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముని జాజమ్మ (54) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు పుష్కరనాథ్ (30) అనే కుమారుడు ఉన్నాడు.
గురువారం సాయంత్రం జాజమ్మ మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె కూడా అనారోగ్యంతో గతంలో మృతి చెందారు. దీంతో తల్లి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన పుష్కరనాథ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా గురువారం ఉదయం గుర్తించారు. అమ్మ, నాన్న, చెల్లి లేకుండా ఉండలేనంటూ అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement