నిజామాబాద్: వేగంగా ప్రయాణిస్తున్న కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన తల్లి కొడుకులు కృష్ణవేణి, మహేష్ హైదరాబాద్ వెళ్లి వస్తుండగా కారు సికింద్రాపూర్ సమీపానికి చేరుకోగానే రోడ్డు పక్కనే నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.