
సాక్షి, గచ్చిబౌలి : స్నేహంగా ఉన్నప్పుడు తెలియకుండా తీసిన అశ్లీల ఫొటోలను ఇతరులకు పంపిన యువకుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపిన మేరకు.. మణికొండలో నివాసం ఉండే ఓ యువతి కూకట్‌పల్లిలోని ఫ్రింక్‌ఫిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోస్టెస్‌లో 2012లో శిక్షణ తీసుకుంది. ఆ సమయంలో స్నేహితుల ద్వారా సంగారెడ్డికి చెందిన రాడిసన్ హోటల్‌లో ఎఫ్‌ఎంబీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే అరుణ్‌రెడ్డి పరిచయం అయ్యారు. అతనితో కొద్ది రోజులు ఆ యువతి స్నేహంగా ఉండేది.
2013 తరువాత ఇద్దరు ఐదు సంవత్సరాల పాటు కలుసుకోలేదు. అరుణ్ రెడ్డి రెండేళ్లుగా ఎయిర్ హోస్టేస్ స్నేహితురాలితో చనువుగా ఉంటున్నాడు. ఇది ఇలా ఉంటే శిక్షణలో బ్యాచ్‌మేట్ అయిన వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఆరు నెలల క్రితం ఎయిర్ హోస్టెస్‌కు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. జూలై 8న ఆమె కాబోయే భర్తతో కలిసి బర్త్ డే చేసుకుంది. ఆ ఫొటోలను భర్త ఫేస్ బుక్‌లో పెట్టాడు.
ఆ ఫొటోలు చూసిన అరుణ్‌రెడ్డి ఎయిర్ హోస్టెస్ అశ్లీలమైన ఫొటోలను తన గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ఇతర స్నేహితులకు పంపాడు. అరుణ్‌రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్ కాబోయే భర్తకు పంపించింది. తనతో స్నేహంగా ఉన్నప్పుడు తనకు తెలియకుండా తీసిన అశ్లీల ఫొటోలను ఇతరులకు పంపించిన అరుణ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆగస్టు 28న రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. గురువారం నిందితుడు అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment